Payal Rohatgi and Sangram Singh Announce Wedding Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Sangram Singh-Payal Rohatgi: నటుడిని పెళ్లాడనున్న బాలీవుడ్‌ హీరోయిన్‌

Published Fri, May 27 2022 11:23 AM | Last Updated on Fri, May 27 2022 11:37 AM

Sangram Singh Announces Marriage Date With His Girlfriend Payal Rohatgi - Sakshi

హీరోయిన్‌ పాయల్‌ రోహత్గి తర్వలో పెళ్లిపీటలెక్కబోతోంది. క్రీడాకారుడు, నటుడు సంగ్రమ్‌ సింగ్‌తో కొత్త జీవితాన్ని ఆరంభించబోతోంది. జూలైలో పెళ్లి చేసుకోనున్నట్లు గతంలోనే వీరిద్దరూ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే జూలై 21న సంగ్రమ్‌ బర్త్‌డే కావడంతో అదే రోజు వీరు వివాహం చేసుకుంటారని అంతా భావించారు. కానీ దానికంటే ముందే పెళ్లితో ఒక్కటి కానున్నామంటున్నాడు సంగ్రమ్‌.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కొంత ఉత్సాహంగా, మరికొంత ఉద్వేగంగా ఉంది. కొన్నేళ్లుగా కలిసి ఉంటున్న మా జీవితాల్లో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది. జూలై 9న మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా అమ్మ, సోదరి ఈ తేదీని ఖరారు చేశారు. పెళ్లి వేదిక ఎక్కడైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అహ్మదాబాద్‌ లేదా ఉదయ్‌పూర్‌లో డ్రీమ్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. కాకపోతే ఈ వేడుకకు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానిస్తాం' అని చెప్పుకొచ్చాడు సంగ్రమ్‌.

పెళ్లికి ఎక్కువమందిని పిలవకపోయినా ఇండస్ట్రీ మిత్రుల కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టీ ఏర్పాటు చేస్తామని తెలిపాడు. కాగా సర్వైవర్‌ ఇండియా అనే రియాలిటీ షో షూటింగ్‌లో పాయల్‌, సంగ్రమ్‌ తొలిసారి కలిశారు. పరిచయమైన కొంతకాలానికే లవ్‌లో పడ్డ వీరిద్దరూ 2014 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. సుమారు 12 ఏళ్లపాటు ప్రేమలో తడిసిముద్దయిన ఈ జంట ఎట్టకేలకు ఈ జూలైలో పెళ్లి పీటలెక్కబోతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల లాకప్‌ షోలో పాల్గొన్న పాయల్‌ ఆ సమయంలో ఓ భయంకర సీక్రెట్‌ను బయటపెట్టింది. కెరీర్‌ పుంజుకోవడం కోసం ఓ పూజారి సాయంతో చేతబడిలోని వశీకరణం అనే తాంత్రిక విద్యను ప్రయోగించినట్లు తెలిపింది. కానీ దీనివల్ల ఎటువంటి లాభం జరగలేదని వెల్లడించింది. అయితే తన ప్రియుడు సంగ్రమ్‌ మీద ఎలాంటి చేతబడి చేయలేదని పేర్కొంది.

చదవండి 👇
పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్‌

Rakul Preet Singh: సౌత్‌, నార్త్‌ రెండూ కలిస్తే అద్భుతాలే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement