
బిగ్‌బాస్ షో వల్ల పచ్చని కాపురం చెల్లాచెదురైపోయేలా ఉంది. ఇప్పుడు చెబుతుంది తెలుగు బిగ్ బాస్ గురించి కాదు. హిందీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న ఓటీటీ మూడో సీజన్ గురించి. ఇద్దరు భార్యలతో కలిసి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ ఇందులో పాల్గొనగా.. ఓ భార్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమెనే విడాకులు తీసుకుంటానని అంటోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)
అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్.. కృతిక-పాయల్ అనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అలా ఫేమస్ అయిన అర్మాన్.. రీసెంట్‌గా మొదలైన బిగ్‌బాస్ ఓటీటీ 3లోకి భార్యలతో కలిసి వచ్చాడు. కాకపోతే పాయల్ తొలి వారమే ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకుంటోంది. అయితే ఈమెని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వ్లాగ్‌లో దీని గురించే బాధపడుతూ విడాకులు తీసుకుంటానని అంటోంది.
తనని కృతికని లెస్బియన్స్ అంటున్నారని, అలానే ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉండటం తప్పులా చూస్తూ, అందరూ తననే నిందిస్తున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. అలానే ఈ విమర్శలు వల్ల ఒత్తిడికి బాగా లోనవుతున్నానని.. బిగ్ బాస్ హౌస్ నుంచి అర్మాన్-కృతిక బయటకొచ్చిన తర్వాత విడాకులు గురించి మాట్లాడుతానని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నిజంగానే చెబుతోందా? లేదంటే వ్యూస్ కోసమే చేసిన స్టంటా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)

Comments
Please login to add a commentAdd a comment