రెండు కాదు.. నా భర్తకు మూడుసార్లు పెళ్లయింది! | Armaan Malik's Wife Payal Malik Comments On Bigg Boss OTT 3 | Sakshi
Sakshi News home page

Armaan Malik: షాకింగ్ విషయాలు బయటపెట్టిన యూట్యూబర్ భార్య

Jul 2 2024 12:07 PM | Updated on Jul 2 2024 12:15 PM

Armaan Malik's Wife Payal Malik Comments On Bigg Boss OTT 3

బిగ్‍‌బాస్ ఓటీటీ మూడో సీజన్ ప్రస్తుతం హిందీలో జరుగుతోంది. రీసెంట్‌గా ఈ షో వార్తల్లో నిలిచింది. ఓ యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి ఇందులో అడుగుపెట్టడమే కారణం. పలువురు ఈ విషయమై గట్టిగానే విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లని చూపించి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ట్రోల్స్ చేశారు. తాజాగా యూట్యూబర్ భార్యల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రావడమే లేటు షాకింగ్ కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)

ఇకపోతే అర్మాన్‌కి మూడుసార్లు పెళ్లయిందట కదా అనే ప్రశ్నకు కూడా పాయల్ మాలిక్ బదులిచ్చిది. 'అవును.. నా భర్తకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కాకపోతే ఒకటి బాల్య వివాహం. హర్యానాలో కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతుంటాయి. కానీ నన్ను వివాహం చేసుకునే సమాయానికి అర్మాన్.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆర్థికంగానూ ఆమెకు అండగా నిలిచాడు. ఇప్పుడు ఆమె వేరే పెళ్లి కూడా చేసుకుని హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా పుట్టారనుకుంటాను' అని పాయల్ మాలిక్ చెప్పుకొచ్చింది.

అలానే తను ఇంత త్వరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాననుకోలేదని, మా ముగ్గురిని వేర్వేరు కంటెస్టెంట్స్‪‌గా కాకుండా ఒక్కటిగానే చూస్తున్నారని, బహుశా ఇందువల్లే ఎలిమినేట్ అయిపోయింటానని అభిప్రాయం వ్యక్తం చేసింది. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ ప్రస్తుతం తన భార్య కృతికతో కలిసి హౌస్‌లో ఉన్నాడు. మరి ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement