
బిగ్‌బాస్.. ఫ్యామిలీ షో అనే గీత ఎప్పుడో దాటేసింది. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట దరిద్రంగా తయారవుతోంది. షో బయట ఫ్యాన్స్ అని చెప్పి జనాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక షోలో పాల్గొన్న వాళ్లయితే బరితెగించేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే బిగ్‌బాస్ ఓటీటీ హిందీ మూడో సీజన్‌లో జరిగింది. ఇప్పుడు దీనిపై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)
ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ ప్రసారమవుతోంది. ఇందులోకి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో వచ్చాడు. అప్పుడే చాలామంది తిట్టారు. అసలు ఇలాంటి వాళ్లని షోకు పిలిచి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని నిర్వహకులపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా షోలో లైవ్‌గా అర్మాన్ మాలిక్, తన భార్యతో శృంగారం చేయడాన్ని లైవ్‌లో చూపించేశారు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి షో నిర్వహకులపై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. భార్యభర్తల్ని తక్షణమే షో నుంచి బయటకు పంపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ మొదలు కానుంది. దీనిలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment