
హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ సనా మక్బుల్‌కు కోపమొచ్చింది. తనపై సెటైర్లు వేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నటుడు అర్జున్ బిజ్లానీ ముంబైలో దీపావళి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో హీరోయిన్ సనా మక్బుల్ కూడా ఉంది.

ఇంత చీప్‌గా ప్రవర్తిస్తారా?
పార్టీలో అడుగుపెట్టేముందు అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు ఓపికగా పోజులిస్తూ ఫోటో దిగింది. చిరునవ్వుతో ఫోటోలు దిగుతున్న సనాను ఉద్దేశించి ఓ ఫోటోగ్రాఫర్ అసలు మజాయే రావట్లేదు, ఇటు తిరగండి అని కటువుగా మాట్లాడాడు. అతడి మాటలు విని షాకైన సనా ఇది చాలా తప్పు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తారా? మీరిలా మాట్లాడకూడదు. తప్పు అని కౌంటరిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఫోటోగ్రాఫర్‌పై మండిపాటు
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా నటిపై సెటైర్ వేసిన కెమెరామెన్‌ను నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఒక అమ్మాయికి ఇలాగేనా గౌరవమిచ్చేది? అని మండిపడుతున్నారు. మరీ ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్..
కాగా సనా మక్బుల్ తెలుగులో దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. 2021లో ఖత్రోన్ కె ఖిలాడీ 11వ సీజన్‌లో పాల్గొనగా సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది. ఇకపోతే ఈ ఏడాది హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది.
Cuteness overload sana Makbul Diwali look ❤️🤌🏻#SanaMakbul #desipaps pic.twitter.com/ndmo5Z7Be3
— Desi Paps (@desipaps) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment