ప్రియురాలిని పెళ్లాడిన సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ | Singer Armaan Malik Ties Knot with Aashna Shroff, See Pics | Sakshi
Sakshi News home page

సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రముఖ సింగర్‌.. ప్రేయసితో వివాహం

Published Thu, Jan 2 2025 1:19 PM | Last Updated on Thu, Jan 2 2025 1:48 PM

Singer Armaan Malik Ties Knot with Aashna Shroff, See Pics

ప్రముఖ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ (Armaan Malik) పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు ఆష్న ష్రాఫ్‌(Aashna Shroff)ను వివాహమాడాడు. గురువారం ఉదయం తన పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇరుకుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే జరిగిన ఈ వివాహంలో ఆష్న ఆరెంజ్‌ లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. 

2023లో నిశ్చితార్థం
ప్రియురాలికి మ్యాచ్‌ అయ్యేలా అర్మాన్‌ పేస్టల్‌ షేడ్‌ కలర్‌ షేర్వాణి ధరించి రాయల్‌గా కనిపించాడు. ఇక ఈ సడన్‌ సర్‌ప్రైజ్‌ చూసిన అభిమానులు.. ఓ మైగాడ్‌, మీ పెళ్లికోసం ఎంత ఎదురుచూశామో.. మొత్తానికి ఒక్కటయ్యారు, కంగ్రాట్స్‌ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మాన్‌, ఆష్నా ఆరేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాక 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది జరిగిన రెండేళ్లకు వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 

బుట్టబొమ్మతో తెలుగులో సెన్సేషన్‌
ఈయన పాటల విషయానికి వస్తే తెలుగులో హలో (హలో), నిన్నిలా నిన్నిలా.. (తొలి ప్రేమ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో), ఓ ఇషా.. (మేజర్‌) ఇలా ఎన్నో పాటలు పాడాడు. కచ్చాలింబో అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు. అర్మాన్‌ మాలిక్‌ తల్లి జ్యోతి తెలుగువారే కావడం విశేషం.

 

 

చదవండి: 15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్‌ లవ్‌ స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement