Armaan Malik
-
Armaan Malik: ప్రియురాలిని పెళ్లాడిన 'బుట్టబొమ్మ' సింగర్ (ఫోటోలు)
-
డబుల్ దుపట్టా డిజైనర్ లెహంగాలో మెరిసిన పెళ్లి కూతురు, దీని స్పెషాల్టీ ఇదే!
సాధారణంగా పెళ్లి పెళ్లి తంతు, విందుభోజనాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. అలాగే వధూవరులు అందం చందాల్నిచూసి అందమైన జంట,క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగిడేస్తాం. వీటితోపాటు ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ వేడుకల సందడి కూడా బాగాపెరిగింది. దీంతోపాటు వధూవరుల డిజైనర్ దుస్తులు, ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బ్రైడల్ లుక్ అదే.. పెళ్లి కూతురు ముస్తాబు, డిజైనర్ లెహెంగాలు చాలా ఆసక్తికరంగా మారాయి. తాజాగా గాయకుడు అర్మాన్ మాలిక్ తనచిరకాల ప్రియురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లాడాడు. వధువు ఆరెంజ్ కలర్ డిజైనర్ లెహెంగాలో మెరిసిపోతూ అందరి దృష్టినీ ఆకర్షించింది. అద్భుత సెట్టింగుల మధ్య వారి పెళ్లి దుస్తులు ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఆర్మాన్, ఆష్నా దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.ప్రత్యేకత ఏంటి అంటేరెగ్యులర్ కలర్స్ కంటే భిన్నంగా ఆరెంజ్ కలర్ మనీష్ మల్హోత్రా లెహంగాలో ఆష్నా బ్యూటిఫుల్‌గా ముస్తాబైంది. బంగారు జర్దోజీ వర్క్ తో, స్క్వేర్ నెక్ క్రాప్డ్ బ్లౌజ్, ఫ్లేర్డ్ స్కర్ట్ అద్భుతంగా అమిరింది. దీనికి డబుల దుపట్టాలతో తన బ్రైడల్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసేలా జాగ్రత్తపడింది. ఆరెంజ్ కలర్లో ఒకటి, తలపై మేలిముసుగుకోసం పాస్టెల్ పీచ్ కలర్లో ఒకటి జతగా ధరించింది. అలాగే డ్రెస్‌కు మ్యాచింగ్‌గా పాస్టెల్ పీచ్ బ్యాంగిల్స్ వేసుకుంది. ఇంకా పోల్కీ డైమండ్, చోకర్ నెక్లెస్, ముత్యాల ఆభరణాలతో మేళవించి న్యూ గ్లామ్ లుక్‌తో కాబోయే పెళ్లి కూతుళ్లకు కొత్త ట్రెండ్ అందించింది. ఇక వరుడు అర్మాన్ మాలిక్ ఈ విషయంలో ఆష్నాను ఫాలో అయిపోయాడు. ఆమెకు మ్యాచింగ్‌గా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ జర్దోజీ వర్క్ ఫుల్ స్లీవ్స్ పీచ్ షేర్వానీలో కనిపించాడు.మ్యాచింగ్ కుర్తా, ప్యాంటు,,తలపాగా సిల్క్ మెటీరియల్‌తో పాటు, బ్రూచ్‌లో రాయల్, క్లాసీ లుక్‌లో అదిరిపోయాడు. అలాగే కొత్త ఏడాదిలో తమ సరికొత్త జీవన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న వేళ అర్మాన్ కొత్త ఈపీ( EP extended play)ని విడుదల చేశాడు. కాగా ఆష్నా ష్రాఫ్ పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లగ్జరీ ఫ్యాషన్, బ్యూటీ , లైఫ్‌స్టైల్‌కి పెట్టింది పేరైన ఆమెకు 10 లక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లుఉన్నారు. -
ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ అర్మాన్ మాలిక్
ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు ఆష్న ష్రాఫ్(Aashna Shroff)ను వివాహమాడాడు. గురువారం ఉదయం తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ఇరుకుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే జరిగిన ఈ వివాహంలో ఆష్న ఆరెంజ్ లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. 2023లో నిశ్చితార్థంప్రియురాలికి మ్యాచ్ అయ్యేలా అర్మాన్ పేస్టల్ షేడ్ కలర్ షేర్వాణి ధరించి రాయల్‌గా కనిపించాడు. ఇక ఈ సడన్ సర్ప్రైజ్ చూసిన అభిమానులు.. ఓ మైగాడ్, మీ పెళ్లికోసం ఎంత ఎదురుచూశామో.. మొత్తానికి ఒక్కటయ్యారు, కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మాన్, ఆష్నా ఆరేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాక 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది జరిగిన రెండేళ్లకు వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బుట్టబొమ్మతో తెలుగులో సెన్సేషన్ఈయన పాటల విషయానికి వస్తే తెలుగులో హలో (హలో), నిన్నిలా నిన్నిలా.. (తొలి ప్రేమ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో), ఓ ఇషా.. (మేజర్) ఇలా ఎన్నో పాటలు పాడాడు. కచ్చాలింబో అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు. అర్మాన్ మాలిక్ తల్లి జ్యోతి తెలుగువారే కావడం విశేషం. View this post on Instagram A post shared by ARMAAN MALIK (@armaanmalik) చదవండి: 15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్ లవ్ స్టోరీ -
బిగ్‌బాస్ నుంచి భర్త ఎలిమినేట్.. సంతోషంగా ఉందంటున్న భార్య
బిగ్‌బాస్ వల్ల పాపులారిటీ వస్తుందన్న విషయం పక్కనపెడితే దానివల్ల బంధాలు, కెరీర్ నాశనమైపోయిన సంఘటనలు కూడా కోకొల్లలు. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ రన్ అవుతోంది. ఈసారి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి షోలో అడుగుపెట్టాడు. హవ్వ, ఇదేం ఘోరం, ఇంకెవరూ దొరకలేదా? అని జనాలు నోరెళ్లబెట్టారు. ముగ్గురూ కలిసిమెలిసి బాగానే ఉన్నారు.కృతిక అందంగా ఉందని కామెంట్ఇంతలో ఓ వారం పాయల్ ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ విశాల్ పాండే.. అర్మాన్ రెండో భార్య కృతికని అందంగా ఉందని కామెంట్ చేశాడు. వీకెండ్లో బిగ్‌బాస్‌కు వెళ్లిన పాయల్.. ఈ విషయంపై రాద్దాంతం చేసింది. తన మొదటి భార్యపై కామెంట్ చేశాడన్న కోపంతో అర్మాన్.. విశాల్ చెంప చెళ్లుమనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.పాయల్‌పై ట్రోలింగ్ఈ గొడవ అంతటికీ కారణం నువ్వేనంటూ నెటిజన్లు పాయల్‌ను ఏకిపడేశారు. ఇది తట్టుకోలేకపోయిన పాయల్.. ఈ విమర్శల వల్ల ఒత్తిడికి లోనవుతున్నానని, బిగ్‌బాస్ నుంచి భర్త బయటకు వచ్చాక విడాకుల గురించి మాట్లాడతానంది. తాజాగా అర్మాన్ ఎలిమినేట్ అవడంతో సంతోషం వ్యక్తం చేసింది.ఇక ఆపేయండిఅర్మాన్ బయటకు వచ్చినందుకు హ్యాపీ. మీరు కూడా సంతోషంగా ఉన్నారనుకుంటాను. బహుశా స్వీట్లు కూడా పంచుకుంటారేమో! ఇంత ద్వేషాన్ని భరించేబదులు బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేయడమే మేలు. మీరు బలంగా కోరుకున్నారు కాబట్టే బయటున్నాడు. సంతోషమే కదా.. ఇకనైనా ద్వేషించడం ఆపండి అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ జీవితాన్ని అందంగా మార్చేశావ్.. థాంక్యూ: మౌనిక -
బిగ్‌బాస్ షోలో బరి తెగించేశారు.. లైవ్ వీడియోపై విమర్శలు
బిగ్‌బాస్.. ఫ్యామిలీ షో అనే గీత ఎప్పుడో దాటేసింది. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట దరిద్రంగా తయారవుతోంది. షో బయట ఫ్యాన్స్ అని చెప్పి జనాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక షోలో పాల్గొన్న వాళ్లయితే బరితెగించేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే బిగ్‌బాస్ ఓటీటీ హిందీ మూడో సీజన్లో జరిగింది. ఇప్పుడు దీనిపై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ ప్రసారమవుతోంది. ఇందులోకి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో వచ్చాడు. అప్పుడే చాలామంది తిట్టారు. అసలు ఇలాంటి వాళ్లని షోకు పిలిచి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని నిర్వహకులపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా షోలో లైవ్‌గా అర్మాన్ మాలిక్, తన భార్యతో శృంగారం చేయడాన్ని లైవ్‌లో చూపించేశారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి షో నిర్వహకులపై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. భార్యభర్తల్ని తక్షణమే షో నుంచి బయటకు పంపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ మొదలు కానుంది. దీనిలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
బిగ్‌బాస్ ఎంత పనిచేసింది.. యూట్యూబర్ విడాకులు!?
బిగ్‌బాస్ షో వల్ల పచ్చని కాపురం చెల్లాచెదురైపోయేలా ఉంది. ఇప్పుడు చెబుతుంది తెలుగు బిగ్ బాస్ గురించి కాదు. హిందీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న ఓటీటీ మూడో సీజన్ గురించి. ఇద్దరు భార్యలతో కలిసి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ ఇందులో పాల్గొనగా.. ఓ భార్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమెనే విడాకులు తీసుకుంటానని అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్.. కృతిక-పాయల్ అనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అలా ఫేమస్ అయిన అర్మాన్.. రీసెంట్గా మొదలైన బిగ్‌బాస్ ఓటీటీ 3లోకి భార్యలతో కలిసి వచ్చాడు. కాకపోతే పాయల్ తొలి వారమే ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకుంటోంది. అయితే ఈమెని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వ్లాగ్‌లో దీని గురించే బాధపడుతూ విడాకులు తీసుకుంటానని అంటోంది.తనని కృతికని లెస్బియన్స్ అంటున్నారని, అలానే ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉండటం తప్పులా చూస్తూ, అందరూ తననే నిందిస్తున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. అలానే ఈ విమర్శలు వల్ల ఒత్తిడికి బాగా లోనవుతున్నానని.. బిగ్ బాస్ హౌస్ నుంచి అర్మాన్-కృతిక బయటకొచ్చిన తర్వాత విడాకులు గురించి మాట్లాడుతానని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నిజంగానే చెబుతోందా? లేదంటే వ్యూస్ కోసమే చేసిన స్టంటా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?) -
నా భార్యనే అంటావా? చెంప పగలగొట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
హిందీ బిగ్‌బాస్‌ను ఆదరించే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే అక్కడ 17 సీజన్లు విజయవంతంగా నడిచాయి. అలాగే మధ్యలో ఓటీటీని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ నడుస్తోంది. ఈ సారి షోలోకి యూట్యూబర్ అర్మాన్ మాలిక్ దంపతులను తీసుకొచ్చారు. అంటే అర్మాన్తో పాటు అతడి ఇద్దరు భార్యలు కూడా హౌస్‌లోకి వచ్చారు.గెస్టుగా వచ్చిన మొదటి భార్యఅర్మాన్ మొదటి భార్య పాయల్ ఇటీవలే షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే లోపల ఉన్న కంటెస్టెంట్, యూట్యూబర్ విశాల్‌పై విరుచుకుపడింది. అర్మాన్ రెండో భార్య కృతిక వదిన అంటే చాలా ఇష్టమని విశాల్.. ఓ కంటెస్టెంట్ చెవిలో గుసగుసలాడాడు. అది గుర్తు చేసిన పాయల్.. నువ్వు ఒక తల్లి గురించి, ఒకరి భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆ విషయం తెలుసుకుని కాస్త మర్యాదగా మాట్లాడు. కృతిక గురించి అలా అనడం తప్పు అని చెప్పింది. చెడు ఆలోచన లేదన్న విశాల్అయితే విశాల్ మాత్రం.. తానేదో సరదాగా చెప్పానని, తప్పుడు అభిప్రాయంతో అనలేదని వివరణ ఇచ్చాడు. ఏ చెడు ఆలోచన లేకపోతే చెవిలో గుసగుసలాడాల్సిన అవసరం ఏముంది? అదేదో తనకే నేరుగా వెళ్లి చెప్పొచ్చు కదా అని పాయల్ ప్రశ్నించింది. అలా కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. ఇవన్నీ విన్నాక అర్మాన్‌కు ఒళ్లు మండిపోయింది. తన భార్య గురించి మాట్లాడతాడా? అని విశాల్ దగ్గరకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆవేశంలో అతడి చెంప చెళ్లుమనిపించాడు. అది కూడా తప్పేనా?ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లడంతో మిగతా కంటెస్టెంట్లు వారిని చెరో పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా పలువురూ విశాల్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? దానికే కొట్టాలా? అయినా వదిన అనే కదా అన్నాడు.. అందులో తప్పేంటి? అని మండిపడుతున్నారు. అర్మాన్ మాలిక్‌ను బయటకు పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bigg Boss ott 3 Khabri (@biggbossott3.tazakhabar)చదవండి: లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: హీరోయిన్ -
రెండు కాదు.. నా భర్తకు మూడుసార్లు పెళ్లయింది!
బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ ప్రస్తుతం హిందీలో జరుగుతోంది. రీసెంట్గా ఈ షో వార్తల్లో నిలిచింది. ఓ యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి ఇందులో అడుగుపెట్టడమే కారణం. పలువురు ఈ విషయమై గట్టిగానే విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లని చూపించి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ట్రోల్స్ చేశారు. తాజాగా యూట్యూబర్ భార్యల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రావడమే లేటు షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)ఇకపోతే అర్మాన్‌కి మూడుసార్లు పెళ్లయిందట కదా అనే ప్రశ్నకు కూడా పాయల్ మాలిక్ బదులిచ్చిది. 'అవును.. నా భర్తకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కాకపోతే ఒకటి బాల్య వివాహం. హర్యానాలో కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతుంటాయి. కానీ నన్ను వివాహం చేసుకునే సమాయానికి అర్మాన్.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆర్థికంగానూ ఆమెకు అండగా నిలిచాడు. ఇప్పుడు ఆమె వేరే పెళ్లి కూడా చేసుకుని హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా పుట్టారనుకుంటాను' అని పాయల్ మాలిక్ చెప్పుకొచ్చింది.అలానే తను ఇంత త్వరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాననుకోలేదని, మా ముగ్గురిని వేర్వేరు కంటెస్టెంట్స్‌గా కాకుండా ఒక్కటిగానే చూస్తున్నారని, బహుశా ఇందువల్లే ఎలిమినేట్ అయిపోయింటానని అభిప్రాయం వ్యక్తం చేసింది. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ ప్రస్తుతం తన భార్య కృతికతో కలిసి హౌస్‌లో ఉన్నాడు. మరి ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్) -
Bigg Boss: ఇద్దరు భార్యలతో ‘బిగ్‌బాస్’లోకి.. ఎవరా కంటెస్టెంట్?
బుల్లితెరపై బిగ్‌బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా ఈ రియాల్టీ షోకి మంచి ఆదరణ ఉంది. అందుకే ఓటీటీలో కూడా ఈ షోని రన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సీజన్లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయి మంచి విజయం సాధించాయి. దీంతో తాజాగా హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3ని ప్రారంభించారు మేకర్స్. ఎప్పటి మాదిరిలో ట్రెండింగ్‌లో ఉన్న నటీనటులతో పాటు ఫేమస్ యూట్యూబర్స్ ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రతి సీజన్లోనూ ఓ జంట ఇందులో పాల్గొంటుంది. సీజన్లో 3లో కూడా దాన్ని కొనసాగించారు. విచిత్రంగా ఓ కంటెస్టెంట్ తన ఇద్దరు భార్యలతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. ఆ కంటెస్టెంట్ పేరు ఆర్మాన్ మాలిక్. అతనో ఫేమస్ యూట్యూబర్. మొదటి భార్య పాయల్ మాలిక్, రెండో భార్య క్రితికా మాలిక్ ఇద్దరితో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ‘బిగ్‌బాస్’ హిస్టరీలోనే ఇది తొలిసారి. ఇలా ఇద్దరు భార్యలతో షోలో పాల్గొనడాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దేవోలినా భట్టాచార్జితో పాటు పలువురు తప్పు పట్టినా.. ఆర్మాన్ మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నాడు. (చదవండి: బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!)తమ మధ్య ఎలాంటి వివాదాలు రావని.. ఒక ఫ్యామిలీగా ఎలా ఉంటామో చూపించడానికే బిగ్‌బాస్‌లోకి వచ్చానని ఆర్మాన్ చెబుతున్నాడు. అంతేకాదు అభిమానులకు తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది.. నా వ్యక్తిత్వం ఎలాంటి అని తెలియజేసేందుకు ఈ షో బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. తనదైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకొని..కప్ కొడతానని ఆర్మాన్ చెప్పుకొచ్చాడు. మరి ఇద్దరి భార్యలతో కలిసి ఆర్మాన్ ఎలా ఆడతాడు? ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనేది మున్ముందు తెలుస్తుంది. అలా ప్రేమలో పడి..ఆర్మాన్, పాయల్‌ది ప్రేమ వివాహం. పాయల్ ఓ బ్యాంకు ఉద్యోగిణి. ఓ సందర్భంలో బ్యాంకులోకి వెళ్లిన ఆర్మాన్..తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆరో రోజుల్లోనే తన ప్రేమను వ్యక్తం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల పాటు కలిసి జీవించారు. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ క్రితికా మాలిక్‌తో ప్రేమలో పడిపోయాడు. ఆమె పాయల్‌కు బెస్ట్ ఫ్రెండ్. పాయల్ ద్వారనే ఆర్మాన్కి పరిచయం అయింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పాయల్‌కు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ముగ్గురి మధ్య గొడవలు కూడా జరిగాయి. చివరకు పాయల్ అంగీకరించడంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టారు. పాయల్‌కి ముగ్గురు సంతానం కాగా, కృతిక ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల పాటు ఈ ముగ్గురు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి పంజాబ్‌లోని చండీగఢ్‌లో నివసిస్తున్నారు.తొలిసారి అనిల్ కపూర్ హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1కి కరణ్ జోహార్.. సీజన్ 2కి సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3కి కూడా సల్మానే హోస్ట్ అని అంతా భావించారు. కానీ సీనియర్ హీరో అనిల్ కపూర్‌ని హోస్ట్‌గా పరిచయం చేసి షాకిచ్చారు. ఈ సీజన్ 3లో వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, బాక్సర్ నీరజ్ గోయట్, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ ‘జియో సినిమా’లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Kritika malik (@kritika_malik_9) -
నా లక్కీ సిటీ హైదరాబాద్
హఫీజ్‌పేట్: ‘హైదరాబాద్ నా లక్కీ సిటీ. అలాగే ఇది మా అమ్మమ్మ ఊరు కూడా’ అని బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ అన్నారు. శనివారం షరటాన్ హోటల్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మా అమ్మ తెలుగమ్మాయి కావడంతో హైదరాబాద్ నగరంతో ప్రత్యేక అనుబంధముంది. కోవిడ్ తర్వాత నగరంలో జరిగిన నా మొదటి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను’ అని గుర్తు చేసుకున్నారు. తన విభావరిని హైదరాబాద్ సంగీత ప్రియులు, యువత ఎంతగానో ఆదరించారన్నారు. ‘అల వైకుంఠపురం’ సినిమాలో పాడిన ‘బుట్ట బొమ్మ’ పాట తనకు లైఫ్నిచి్చందన్నారు. తెలుగులో తనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. త్వరలోనే మరిన్ని టాలీవుడ్ పాటలతో తెలుగు శ్రోతలను అలరించనున్నట్లు ఆయన తెలిపారు. అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని చెప్పారు. -
యూట్యూబర్‌తో స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్, ఫోటోలు వైరల్
స్టార్ సింగర్ అర్మన్ మాలిక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలితో వైవాహిక జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్లాగర్, యూట్యూబర్ ఆశ్న ష్రాఫ్‌తో త్వరలో ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో సోమవారం(ఆగస్టు 28) వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అర్మన్.. మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడిగాడు. ఈ మధురక్షణాలని ఆస్వాదించిన ఆశ్న పట్టరాని సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను అర్మన్, ఆశ్న.. సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు పెళ్లికి రెడీ అయిన ఈ జంటకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మన్ మాలిక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళ, గుజరాతీ, పంజాబి, ఉర్దు, మలయాళ భాషల్లో పాటలు ఆలపించాడు. తెలుగులో ఆయన బుట్టబొమ్మ.. (అల వైకుంఠపురములో) నిన్నిలా.. నిన్నిలా చూశానే.. (తొలిప్రేమ), అనగనగనగా..(అరవింద సమేత), పెదవులు దాటని పదంపదంలో.. (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా), పడిపడి లేచె మనసు టైటిల్ సాంగ్, నిన్నే నిన్నే..(అశ్వథ్థామ) ఇలా బోలెడన్ని హిట్ సాంగ్స్ పాడాడు. View this post on Instagram A post shared by ARMAAN MALIK 🧿 (@armaanmalik) -
రవి ఆనంద్ పాట బాగుంది: ‘బుట్టబొమ్మ’ఫేమ్ ఆర్మాన్ మాలిక్
ఇండో ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్ రూపొందించిన ‘ఐ సీయూ సీ ది మూన్’ అనే పాట పోస్టర్‌ను బుట్టబొమ్మ పాట ఫేమ్, ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ శుక్రవారం ఆవిష్కరించారు. ఇంగ్లీష్‌లో రాసిన ఈ పాట ప్రముఖ స్వచ్ఛంద, సాంస్కృతిక సేవా సంస్థ మెల్బోర్న్ మామ దృష్టికి వచ్చింది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని ఇండో - ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్ ఈ పాటను రికార్డ్ చేసి చిత్రీకరణ జరిపింది. అర్మాన్ మాలిక్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా రవి ఆనంద్ పాట పోస్టర్ ఆవిష్కరింప చేశారు. ఈ సందర్భంగా ఆర్మాన్ మాలిక్ మాట్లాడుతూ.. రవి ఆనంద్ పాట బాగుందన్నారు. ఆయన ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. -
మ్యూజిక్ కాన్సర్ట్‌లో సందడి చేసిన సమంత (ఫొటోలు)
-
ఇద్దరు భార్యలపై చేయి చేసుకున్న యూట్యూబర్, అర్మన్ మాలిక్ ఫైర్
అర్మన్ మాలిక్.. హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు పాడి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన గాన మాధుర్యానికి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చిపడ్డాయి. అర్మన్ మాలిక్ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కానీ అది ఇతడిది కాదు. అర్మన్ అలియాస్ సందీప్ ఈ ఛానల్ నడుపుతూ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా అతడు యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సందీప్ గర్భంతో ఉన్న ఇద్దరు భార్యలు పాయల్, కృతికలపై చేయి చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే యూట్యూబర్ అర్మన్ మాలిక్ తన ఇద్దరు భార్యల చెంప పగలగొట్టాడంటూ నెట్టింట వార్తలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై సింగర్ అర్మన్ మాలిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'అతడిని అర్మన్ మాలిక్ అని పిలవడం ఇక ఆపండి. అతడి అసలు పేరు సందీప్. నా పేరును దుర్వినియోగం చేస్తున్నాడు. పొద్దుపొద్దున్నే ఇలాంటి వార్తలు చదివాల్సి వస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది. ఇవి నాకు ఎంతగానో చిరాకు తెప్పిస్తున్నాయి' అని ట్వీట్ చేశాడు. దీనిపై యూట్యూబర్ స్పందిస్తూ అర్మన్ మాలిక్ పేరుతో ఈ ప్రపంచంలో ఒక్కడే ఉండాలా? ఆ పేరు ఎవరూ పెట్టుకునే అర్హత లేదా? అని ప్రశ్నించాడు. మీరంటే బాలీవుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఫేమస్ అయ్యారు. కానీ నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏదో వీడియోలు, బ్లాగ్లు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పుకొచ్చాడు. Stop calling him Armaan Malik in the media. His real name is freakin’ Sandeep!! For gods sake enough with this misuse of my name. Hate waking up and reading articles like this.. and the news makes me even more disgusted https://t.co/8MrDZt5870 — ARMAAN MALIK (@ArmaanMalik22) February 24, 2023 చదవండి: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి, నటుడి పెళ్లి ఫోటోలు వైరల్ -
ఇద్దరు భార్యలకు ప్రెగ్నెన్సీ.. ప్రముఖ యూట్యూబర్‌పై దారుణంగా ట్రోల్స్
ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అర్మాన్ మాలిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇటీవల ఇన్‌స్టాలో ఇద్దరు భార్యలతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తన భార్యలిద్దరూ బేబీ బంప్‌తో ఉండగా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మాలిక్ ట్రోల్స్‌కు గురయ్యారు. తన ఇన్‌స్టాలో మై ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆర్మాన్ మాలిక్ ఫోటోలను పంచుకున్నారు. యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్ ఇద్దరు భార్యలు కృతిక, పాయల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయల్ కంటే కృతికతో ఉన్న ఫోటోలు ఎక్కువ పోస్ట్ చేశాడని పలువురు మండిపడ్డారు. మీరు కృతికపై మాత్రమే ఎందుకు ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మరికొందరు ప్రశ్నించారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి తెలివి తక్కువ వ్యక్తులకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారని మండిపడ్డారు. కొంతమంది మాత్రం అందరికీ భిన్నంగా వీరికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Armaan Malik (@armaan__malik9) -
ఖరీదైన బంగ్లాను అమ్మేసిన స్టార్ హీరో.. కారణమిదే!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె కట్పుత్లీ సినిమాతో ఆకట్టుకున్న అక్షయ్ గురించి తాజాగా బీటౌన్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఆయనకున్న బంగ్లాలో ఒకదాన్ని దబూ మాలిక్ అనే వ్యక్తికి అమ్మేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దబూ బాలిక్ మరెవరో కాదు..ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ తండ్రే. ముంబై అంధేరి వెస్ట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ సుమారు రూ. 6కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తుంది. గతంలో అక్షయ్ ఇదే అపార్ట్‌మెంట్‌ను రూ 4కోట్లకు కొనుగోలు చేశాడట. ఇక అక్షయ్‌కు ముంబైలో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు తదితర ప్రాందాల్లో పలు బంగ్లాలు ఉన్నాయి. కాగా ఆయన నటించిన చివరి చిత్రం కఠ్పుత్లీ సెప్టెంబర్ 2న హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా రీమేక్ ఇది. -
నాకు తెలియదు, నన్ను నమ్మండి : పాపులర్ సింగర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. దీంతో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై అర్మాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నాకు సందేశాలు పంపుతున్న మహేశ్ బాబు అభిమానులందరికి, నిజంగా సర్కారు వారి పాట నుంచి నెక్ట్స్ సాంగ్ ఎప్పుడు వస్తుందనేదానిపై నా వద్ద ఎలాంటి క్లూ లేదు. నన్ను నమ్మండి. నాకు కూడా తెలియదు.ప్రతీ దానికి ఒక ఇంటర్నల్ ప్రాసెస్ ఉంటుంది. మేమంతా ఓపికగా పనిచేస్తున్నాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వేచి చూడండి అంటూ ట్వీట్ చేశారు. To all SSMB fans messaging me, I genuinely have no clue when the song from #SarkaruVaariPaata is dropping. I know how eager y’all are to hear it. Trust me, I am too! But there’s an internal process to everything & all we can do is patiently wait for an official announcement ❤️🙏🏻 — ARMAAN MALIK (@ArmaanMalik22) April 17, 2022 -
కవలైవేండామ్‌కు బాలీవుడ్ గాయకుడి పాట
కవలైవేండామ్ చిత్రానికి బాలివుడ్ ప్రముఖ గాయకుడు అర్మూన్ మాలిక్ పాట పాడడం విశేషం. జీవా నటించిన తిరునాళ్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇందులో నయనతార నాయకిగా నటించారు. జీవా నటిస్తున్న మరో చిత్రం కవలైవేండామ్. ఇంతకు ముందు కో, కో-2, యామెరుక్కక భయమే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్.కుమార్ తన ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం కవలైవేండామ్. డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లియో జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన తెలుపుతూ బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్ గానానికి మైమరచిపోని వారుండరన్నారు.అలాంటిది తాను ఆయన అభిమానినని తెలిపారు. ఆయన ఇంతకు ముందు పాడిన ఉన్ కాదల్ పాట తరహాలో కవలైవేండామ్ చిత్రం కోసం ఒక మెలోడి పాట పాడించాలని భావించామన్నారు. ఆయన్ని సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తమకు ఒక పాట పాడాలని కోరామన్నారు. వెంటనే ఆయన పాట లిరిక్స్ పంపమని చెప్పగా తాను ట్యూన్ సహా పాటను పంపామన్నారు. పాట విన్న అర్మాన్ మాలిక్ చాలా బాగుందంటూ పాడారన్నారు. దీని ముంబాయిలోని ఒక ప్రముఖ రికార్డింగ్ స్టూడియోలో రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ పాట కచ్చితంగా ప్రేక్షకులకు వీనుల విందుగా ఉంటుందని అన్నారు.