సాధారణంగా పెళ్లి పెళ్లి తంతు, విందుభోజనాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. అలాగే వధూవరులు అందం చందాల్నిచూసి అందమైన జంట,క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగిడేస్తాం. వీటితోపాటు ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ వేడుకల సందడి కూడా బాగాపెరిగింది. దీంతోపాటు వధూవరుల డిజైనర్ దుస్తులు, ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బ్రైడల్ లుక్ అదే.. పెళ్లి కూతురు ముస్తాబు, డిజైనర్ లెహెంగాలు చాలా ఆసక్తికరంగా మారాయి.
తాజాగా గాయకుడు అర్మాన్ మాలిక్ తనచిరకాల ప్రియురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లాడాడు. వధువు ఆరెంజ్ కలర్ డిజైనర్ లెహెంగాలో మెరిసిపోతూ అందరి దృష్టినీ ఆకర్షించింది. అద్భుత సెట్టింగుల మధ్య వారి పెళ్లి దుస్తులు ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఆర్మాన్, ఆష్నా దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.
ప్రత్యేకత ఏంటి అంటే
రెగ్యులర్ కలర్స్ కంటే భిన్నంగా ఆరెంజ్ కలర్ మనీష్ మల్హోత్రా లెహంగాలో ఆష్నా బ్యూటిఫుల్‌గా ముస్తాబైంది. బంగారు జర్దోజీ వర్క్ తో, స్క్వేర్ నెక్ క్రాప్డ్ బ్లౌజ్, ఫ్లేర్డ్ స్కర్ట్ అద్భుతంగా అమిరింది. దీనికి డబుల దుపట్టాలతో తన బ్రైడల్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసేలా జాగ్రత్తపడింది. ఆరెంజ్ కలర్‌లో ఒకటి, తలపై మేలిముసుగుకోసం పాస్టెల్ పీచ్ కలర్‌లో ఒకటి జతగా ధరించింది. అలాగే డ్రెస్‌కు మ్యాచింగ్‌గా పాస్టెల్ పీచ్ బ్యాంగిల్స్ వేసుకుంది. ఇంకా పోల్కీ డైమండ్, చోకర్ నెక్లెస్, ముత్యాల ఆభరణాలతో మేళవించి న్యూ గ్లామ్ లుక్‌తో కాబోయే పెళ్లి కూతుళ్లకు కొత్త ట్రెండ్ అందించింది.
ఇక వరుడు అర్మాన్ మాలిక్ ఈ విషయంలో ఆష్నాను ఫాలో అయిపోయాడు. ఆమెకు మ్యాచింగ్‌గా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ జర్దోజీ వర్క్ ఫుల్ స్లీవ్స్ పీచ్ షేర్వానీలో కనిపించాడు.మ్యాచింగ్ కుర్తా, ప్యాంటు,,తలపాగా సిల్క్ మెటీరియల్‌తో పాటు, బ్రూచ్‌లో రాయల్, క్లాసీ లుక్‌లో అదిరిపోయాడు. అలాగే కొత్త ఏడాదిలో తమ సరికొత్త జీవన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న వేళ అర్మాన్ కొత్త ఈపీ( EP extended play)ని విడుదల చేశాడు.
కాగా ఆష్నా ష్రాఫ్ పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, లగ్జరీ ఫ్యాషన్, బ్యూటీ , లైఫ్‌స్టైల్‌కి పెట్టింది పేరైన ఆమెకు 10 లక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లుఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment