
స్టార్ సింగర్ అర్మన్ మాలిక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలితో వైవాహిక జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్లాగర్, యూట్యూబర్ ఆశ్న ష్రాఫ్‌తో త్వరలో ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో సోమవారం(ఆగస్టు 28) వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అర్మన్.. మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడిగాడు.
ఈ మధురక్షణాలని ఆస్వాదించిన ఆశ్న పట్టరాని సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను అర్మన్, ఆశ్న.. సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు పెళ్లికి రెడీ అయిన ఈ జంటకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్మన్ మాలిక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళ, గుజరాతీ, పంజాబి, ఉర్దు, మలయాళ భాషల్లో పాటలు ఆలపించాడు.
తెలుగులో ఆయన బుట్టబొమ్మ.. (అల వైకుంఠపురములో) నిన్నిలా.. నిన్నిలా చూశానే.. (తొలిప్రేమ), అనగనగనగా..(అరవింద సమేత), పెదవులు దాటని పదంపదంలో.. (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా), పడిపడి లేచె మనసు టైటిల్ సాంగ్, నిన్నే నిన్నే..(అశ్వథ్థామ) ఇలా బోలెడన్ని హిట్ సాంగ్స్ పాడాడు.
Comments
Please login to add a commentAdd a comment