
హిందీ బిగ్‌బాస్‌ను ఆదరించే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే అక్కడ 17 సీజన్లు విజయవంతంగా నడిచాయి. అలాగే మధ్యలో ఓటీటీని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ నడుస్తోంది. ఈ సారి షోలోకి యూట్యూబర్ అర్మాన్ మాలిక్ దంపతులను తీసుకొచ్చారు. అంటే అర్మాన్‌తో పాటు అతడి ఇద్దరు భార్యలు కూడా హౌస్‌లోకి వచ్చారు.
గెస్టుగా వచ్చిన మొదటి భార్య
అర్మాన్ మొదటి భార్య పాయల్ ఇటీవలే షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే లోపల ఉన్న కంటెస్టెంట్, యూట్యూబర్ విశాల్‌పై విరుచుకుపడింది. అర్మాన్ రెండో భార్య కృతిక వదిన అంటే చాలా ఇష్టమని విశాల్.. ఓ కంటెస్టెంట్ చెవిలో గుసగుసలాడాడు. అది గుర్తు చేసిన పాయల్.. నువ్వు ఒక తల్లి గురించి, ఒకరి భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆ విషయం తెలుసుకుని కాస్త మర్యాదగా మాట్లాడు. కృతిక గురించి అలా అనడం తప్పు అని చెప్పింది.
చెడు ఆలోచన లేదన్న విశాల్
అయితే విశాల్ మాత్రం.. తానేదో సరదాగా చెప్పానని, తప్పుడు అభిప్రాయంతో అనలేదని వివరణ ఇచ్చాడు. ఏ చెడు ఆలోచన లేకపోతే చెవిలో గుసగుసలాడాల్సిన అవసరం ఏముంది? అదేదో తనకే నేరుగా వెళ్లి చెప్పొచ్చు కదా అని పాయల్ ప్రశ్నించింది. అలా కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. ఇవన్నీ విన్నాక అర్మాన్‌కు ఒళ్లు మండిపోయింది. తన భార్య గురించి మాట్లాడతాడా? అని విశాల్ దగ్గరకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆవేశంలో అతడి చెంప చెళ్లుమనిపించాడు.
అది కూడా తప్పేనా?
ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లడంతో మిగతా కంటెస్టెంట్లు వారిని చెరో పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా పలువురూ విశాల్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? దానికే కొట్టాలా? అయినా వదిన అనే కదా అన్నాడు.. అందులో తప్పేంటి? అని మండిపడుతున్నారు. అర్మాన్ మాలిక్‌ను బయటకు పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment