పక్కింటి ముచ్చట్లంటే ఎవరికి ఆసక్తి ఉండదు? ఈ ఒక్క పాయింట్‌ను ఆధారంగా చేసుకుని బిగ్‌బాస్ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలు ఎలా ఉంటారు? ఏం తింటారు? ఎలా ప్రవర్తిస్తారు? వంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే బిగ్‌బాస్ షో. ఇందులో తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించుకుంటారు ప్రేక్షకులు. ఇందుకే కొత్తగా ఓటీటీలో కూడా బిగ్‌బాస్ వస్తోంది. తెలుగులో ఓటీటీలో ఒక సీజన్ పెట్టి వదిలేశారు, కానీ హిందీలో మాత్రం రెండో సీజన్ కూడా షురూ అయింది.
మందుకు బానిసయ్యా
ఇందులో నటి, దర్శకురాలు పూజా భట్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా తనకున్న చెడు అలవాట్లను గురించి చెప్పుకొచ్చింది. 44 ఏళ్ల వయసులో మద్యపానానికి గుడ్‌బై చెప్పానంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'నాకు మందు తాగే అలవాటుంది. అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. అప్పుడే మద్యం సేవించే అలవాటును వదిలేయాలనుకున్నాను. అయినా ఈ సమాజం మగవాళ్లు ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా ఓ లైసెన్స్ ఇస్తుంది. వాళ్లు చెప్పేది వింటుంది, కానీ ఆడవాళ్ల మాటలు వినాలనుకోదు.
తాగుతామని, వదిలేశామని ఆడవాళ్లు చెప్పలేరు
మందుకు బానిసైన మగవాళ్లు తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశామని చెప్తే విని చప్పట్లు కొడతారు. కానీ ఆడవాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. వారు తాగుతామని బహిరంగంగా ఒప్పుకోలేరు, అలాంటప్పుడు వదిలేశామని మాత్రం ఎలా చెప్తారు? నేను మాత్రం అందరి ముందే తాగేదాన్ని.. అందుకే ఆ అలవాటు నుంచి బయటపడుతున్నప్పుడు ఆ విషయాన్ని అందరికీ ఎందుకు చెప్పకూడదు అనిపించింది. ఎందుకంటే అప్పటికే అందరూ నన్ను తాగుబోతు అని పిలుస్తున్నారు. వాళ్లు అలా అన్న ప్రతిసారి.. లేదు, నేను మానేశాను అని చెప్పుకొస్తున్నాను' అని పేర్కొంది పూజా భట్. ఇకపోతే బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్
హీరోయిన్‌తో సీనియర్ హీరో రొమాన్స్.. తప్పేంటన్న నటుడు
Comments
Please login to add a commentAdd a comment