Pooja Bhatt
-
నా జీవితంలో అదే అతి పెద్ద విషాదం: నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లో పాల్గొన్నాడు. గతంలో పూజా భట్‌తో ప్రేమాయణం నడిపిన ఈయన తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఆనాటి సంగతులను గుర్తు చేసుకోవడంతో పాటు కెరీర్ ఎలా మొదలైందో వెల్లడించాడు.ఆరంకెల జీతం నుంచి జీరోరణ్వీర్ మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో కెమెరా వెనకాల నా ప్రయాణం మొదలైంది. కొన్ని షోలకు డైరెక్షన్ చేశాను, నిర్మాతగా వ్యవహరించాను. తర్వాత ఓ ఎంటర్మైంట్ ఛానల్లో వీజేగా మారాను. ఆరంకెల జీతం అందుకున్నాను. సడన్‌గా మేనేజ్మెంట్ మారడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మళ్లీ జీరో దగ్గరకు వచ్చాను.అప్పు తీసుకున్నాఅప్పుడు నా సోదరుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. 2002లో లఢక్‌లో లక్ష్య షూటింగ్ చేస్తున్న సమయంలో అమ్మకు బాలేదని ఫోన్ వచ్చింది. షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో అప్పటికప్పుడు వెళ్లలేకపోయాను. తర్వాత ముంబైకి వెళ్లేసరికి అమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ కొన్ని రోజులకే అమ్మ చనిపోయింది. అది నా జీవితంలోనే పెద్ద విషాదం. ఈ విషయాన్ని నా సోదరులకు ఫోన్లో చెప్పాల్సి రావడం మరో విషాదం.నటి వల్ల ఇబ్బందులుసరిగ్గా అదే సమయంలో ఓ నటి వల్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాను. నా పరిస్థితి చూసి మా అన్న అమెరికా వచ్చేయమన్నాడు. అలా అక్కడికెళ్లి తన దగ్గర అప్పు తీసుకుని ఆరు నెలలపాటు యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇండియాకు వచ్చీరావడంతోనే అప్పటిదాకా అటకెక్కిన నా రెండు సినిమాలు (ఖోస్లా కా ఘోస్లా, ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్) రిలీజ్‌కు నోచుకున్నాయి. జనాలు సైతం ఆ చిత్రాలను ఆదరించారు. నటుడినయ్యాక నా జీవితం సరైన దారికొచ్చింది అని చెప్పుకొచ్చాడు.ఐరన్ రాడ్‌తో..కాగా రణ్వీర్ షోరే గతంలో పూజా భట్‌ను ప్రేమించాడు. కానీ ఈ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. తాగొచ్చి కొట్టేవాడని పూజా ఆరోపించగా అలాంటిదేం లేదని రణ్వీర్ బుకాయించాడు. అయితే విషయం తెలిసిన పూజా సోదరుడు రాహుల్.. ఐరన్ రాడ్‌తో అతడిని కొట్టేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.పర్సనల్ లైఫ్ఇకపోతే పూజ.. 2003లో మనీష్‌ను పెళ్లి చేసుకోగా 2014లో విడాకులు తీసుకుంది. రణ్వీర్.. 2010లో కొంకణసేన్ శర్మను పెళ్లాడగా 2011లో బాబు జన్మించాడు. 2015లో రణ్వీర్- కొంకణ విడాకులు తీసుకున్నారు. -
తండ్రితో హీరోయిన్ లిప్‌లాక్.. 33 ఏళ్ల తర్వాత రియాక్షన్
దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఫోటో షూట్ గురించి తాజాగా బాలీవుడ్ నటి పూజా భట్ స్పందించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం తన తండ్రి, దర్శకుడు మహేశ్ భట్‌తో కలిసి ఆమె ముద్దు పెట్టుకున్నారు. అప్పట్లో సినిమా కోసం చేసిన ఆ ఫోటో షూట్ స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చింది. తండ్రీకూతుళ్లు ఇలా ఎప్పుడూ ముద్దుపెట్టుకోరని, అది అసహజమని వీరిద్దరినీ తప్పుబడుతూ ఎంతోమంది ఆరోజుల్లో పలు విమర్శలు చేశారు. అంతేకాకుండా పూజా తన కూతురు కాకపోతే పెళ్లి చేసుకునేవాడినని మహేష్ భట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పూజ పట్ల మహేష్ భట్‌కు తండ్రి భావాలు లేవని కూడా పలువురు విమర్శించారు. దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన ఈ సినిమాపై ఇప్పుడు పూజా భట్ స్పందించారు. ఆ ఫోటో షూట్లో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని ఆమె అన్నారు. ఆ సమయంలో తమ ఉద్దేశం మంచిదే కానీ చూసేవాళ్లే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజా భట్ తెలిపారు. (ఇదీ చదవండి: కేఎల్ రాహుల్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన అతియా) 'దురదృష్టవశాత్తూ ఆ ఫొటోలను కొంతమంది వేరేలా అర్థం చేసుకున్నారు. ఆ ఫొటోషూట్‌పై విమర్శలు వచ్చిన సమయంలో షారుఖ్ ఖాన్ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు.. తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దుపెట్టుకుంటారు. ప్రజలు తమకు తోచినది చెబుతారు. పర్వాలేదు, పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు. నిజం చెప్పాలంటే, ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పాపలానే చూస్తారు.' అని ఆమె తెలిపారు. ఈ ఫొటోషూట్ జరిగినప్పుడు సమాజం గురించి తనకు పెద్దగా తెలియదని పూజా భట్ చెప్పారు. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. అది సహజమేనని ఆమె చెప్పుకొచ్చారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని వాళ్లు వేరేలా చూడాలనుకుంటే.. ఎవరమైనా ఏం చేస్తామని ఆమె ప్రశ్నించారు. -
'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహిరించిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2కు సోమవారం శుభం కార్డ్ పడింది. ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులో మనీషా రాణి ఒకరు. అయితే ఈ షోలో ప్రత్యేక అతిథిగా ఆలియా భట్ ఫాదర్ మహేశ్ భట్ పాల్గొన్నారు. హోస్‌మేట్స్‌తో ముచ్చటించిన ఆయన.. అదే సమయంలో మనీషా రాణి చేతిని సరదాగా ముద్దాడారు. అయితే దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రోల్స్‌కు గురయ్యారు. వయసులో పెద్దవ్యక్తి అయినా మహేశ్.. ఆమెను అసభ్యకరంగా తాకడం ఏంటని నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెపై వస్తున్న ట్రోల్స్‌పై మనీషా రాణి స్పందించింది. మహేశ్ భట్ తీరు పట్ల ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి! ) మనీషా రాణి మాట్లాడుతూ..'మహేష్ భట్ చాలా పెద్ద డైరెక్టర్. అతడిని కలవాలనేది నాకల. ఆయన అలా చేయడం వల్ల నాకు అసౌకర్యంగా అనిపించలేదు. అలా తాకాడని ప్రజలు భావిస్తే.. అది చాలా తప్పు. అతను నాకు అంకుల్‌తో సమానం. వృద్ధులు తమ ప్రేమను కొన్నిసార్లు వారిని తాకడం ద్వారా వ్యక్తం చేస్తారు. ఆయన ఉద్దేశం చాలా స్వచ్ఛమైంది.' అని చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫైనలిస్ట్, మహేశ్ భట్ కూతురు పూజా భట్ మీడియాతో మాట్లాడింది. మనీషాతో పాటు తన తండ్రి ఇతర కంటెస్టెంట్స్‌ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని తెలిపింది. బిగ్ బాస్ హౌస్‌లో కొద్ది సమయమే ఉన్నారని పేర్కొంది. మనీషా ఇతరులను కౌగిలించుకుని ముద్దులు పెట్టినప్పుడు ఎవరికీ సమస్య ఉండదు..కానీ ప్రజలు నిజంగా అలా ఆలోచిస్తే వారికి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది. అంతే కానీ దీనిపై మా నాన్న, నేను ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పూజా భట్ తెలిపింది. ఈ సీజన్లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ విన్నర్‌గా నిలిచి.. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఈ సీజన్లో టాప్ -5 ఫైనలిస్ట్‌లలో ఎల్విష్, అభిషేక్ మల్హన్, మనీషా రాణి, బేబికా ధుర్వే, పూజా భట్ ఉన్నారు. (ఇది చదవండి: అమ్మపై దారుణ కామెంట్స్.. ఇప్పుడు కూడా: బుల్లితెర నటి) #Livefeed !! Mahesh Bhatt ne #Manisha ke hath pe kiss kiya!! #BiggBossOTT2pic.twitter.com/mt1ZVVKmuD — Livefeed Videos (@BBosslivefeed1) August 1, 2023 -
భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!
ఈ మధ్య కాలంలో విడాకులు అనే పదం మరీ ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా నటీనటులు చాలామంది ఏళ్లుగా ఉన్న బంధానికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. భర్త నుంచి డివోర్స్ తీసుకుంటున్నారు. ప్రముఖ నటి కమ్ డైరెక్టర్ అయిన పూజాభట్ కూడా తొమ్మిదేళ్ల క్రితమే విడాకులు తీసుకుంది. కానీ అప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడుతోంది. ఆ సమయంలో ప్రాణం పోయినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'మా' ప్రెసిడెండ్ మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం?) తప్పంతా నాదే! 'నా భర్త చెడ్డవాడు ఏం కాదు. అయితే నేను జీవితాన్ని నాకు నచ్చినట్లు బతకాలనుకున్నాను. నన్ను నేను మోసం చేసుకుంటూ ఎన్నాళ్లని ఉంటాను అనిపించింది. నేను ముఖ్యమా? విడాకులు ముఖ్యమా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు డివోర్స్ వైపు మొగ్గు చూపాను. అదంతా సడన్‌గా జరిగిపోయింది. అయితే ఆయనకు విడాకులు ఇచ్చినపప్పుడు నాకేతే ప్రాణం పోయినట్లు అనిపించింది. అలా మద్యానికి బానిసయ్యాను. అది నా జీవితంలో అత్యంత దారుణమైన దశ' అని నటి పూజా భట్ చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌లో గత నెల నుంచి మొదలైన బిగ్ బాస్ హిందీ ఓటీటీ రెండో సీజన్లో పూజా భట్.. ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన విషయాల్ని ఒక్కొక్కటిగా చెబుతోంది. తను మద్యానికి బానిస కావడం, పిల్లలు లేకపోవడానికి గల కారణాల్ని గత నెలలో ఓ టాస్క్ సందర్భంగా బయటపెట్టింది. తాజాగా మరోసారి తన భర్త గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఇదిలా ఉండగా వీడియో జాకీ మనీష్ మఖిని 2003లో పూజా భట్ పెళ్లి చేసుకుంది. ఇది జరిగిన 11 ఏళ్ల తర్వాత అంటే 2014లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!) -
పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి
దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లోని స్టార్ హీరోలు కూడా ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా జియో సినిమాలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి కూడా ఈ హౌస్‌లోకి పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. వారిలో నటి, దర్శకురాలు పూజా భట్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ సందర్భంగా తనకు పిల్లలు ఎందకు పుట్టలేదో తోటి పోటీదారులతో తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగానే మాట్లాడింది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) పూజా భట్ తన వివాహం గురించి తనతో పాటు ఉన్న మరొక కంటెస్టెంట్ బోబికా ధూర్వేతో ఇలా చెప్పింది. 'నాకు పెళ్లయి దాదాపు 11 ఏళ్లు అవుతోంది. కానీ నేను ఆ సమయంలో పిల్లలను కనడానికి సిద్ధంగా లేను. నాకు పిల్లలు కావాలి, నేను పిల్లలను ప్రేమిస్తున్నాను.. కానీ ఆ సమయంలో నేను పిల్లలను కనాలని కోరుకోలేదు. నేను ఆ సమయంలో దూరంగానే ఉండేదాన్ని. అంతా నా వల్లే జరిగింది.' అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో వీడియో జాకీగా గుర్తింపు తెచ్చుకున్నమనీష్ మఖిని ప్రేమించి 2003లో పూజా భట్ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత 2014లో ఈ జంట విడాకులు తీసుకుంది. -
మద్యానికి బానసయ్యా.. తాగుబోతు అని తిట్టేవారు: నటి
పక్కింటి ముచ్చట్లంటే ఎవరికి ఆసక్తి ఉండదు? ఈ ఒక్క పాయింట్‌ను ఆధారంగా చేసుకుని బిగ్‌బాస్ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలు ఎలా ఉంటారు? ఏం తింటారు? ఎలా ప్రవర్తిస్తారు? వంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే బిగ్‌బాస్ షో. ఇందులో తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించుకుంటారు ప్రేక్షకులు. ఇందుకే కొత్తగా ఓటీటీలో కూడా బిగ్‌బాస్ వస్తోంది. తెలుగులో ఓటీటీలో ఒక సీజన్ పెట్టి వదిలేశారు, కానీ హిందీలో మాత్రం రెండో సీజన్ కూడా షురూ అయింది. మందుకు బానిసయ్యా ఇందులో నటి, దర్శకురాలు పూజా భట్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా తనకున్న చెడు అలవాట్లను గురించి చెప్పుకొచ్చింది. 44 ఏళ్ల వయసులో మద్యపానానికి గుడ్‌బై చెప్పానంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'నాకు మందు తాగే అలవాటుంది. అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. అప్పుడే మద్యం సేవించే అలవాటును వదిలేయాలనుకున్నాను. అయినా ఈ సమాజం మగవాళ్లు ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా ఓ లైసెన్స్ ఇస్తుంది. వాళ్లు చెప్పేది వింటుంది, కానీ ఆడవాళ్ల మాటలు వినాలనుకోదు. తాగుతామని, వదిలేశామని ఆడవాళ్లు చెప్పలేరు మందుకు బానిసైన మగవాళ్లు తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశామని చెప్తే విని చప్పట్లు కొడతారు. కానీ ఆడవాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. వారు తాగుతామని బహిరంగంగా ఒప్పుకోలేరు, అలాంటప్పుడు వదిలేశామని మాత్రం ఎలా చెప్తారు? నేను మాత్రం అందరి ముందే తాగేదాన్ని.. అందుకే ఆ అలవాటు నుంచి బయటపడుతున్నప్పుడు ఆ విషయాన్ని అందరికీ ఎందుకు చెప్పకూడదు అనిపించింది. ఎందుకంటే అప్పటికే అందరూ నన్ను తాగుబోతు అని పిలుస్తున్నారు. వాళ్లు అలా అన్న ప్రతిసారి.. లేదు, నేను మానేశాను అని చెప్పుకొస్తున్నాను' అని పేర్కొంది పూజా భట్. ఇకపోతే బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్ హీరోయిన్‌తో సీనియర్ హీరో రొమాన్స్.. తప్పేంటన్న నటుడు -
నాటునాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది?.. ట్రోలింగ్‌పై నటి ఫైర్
నాటు నాటు పాటను ప్రపంచమే మెచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారత్ నుంచి, అందులోనూ తెలుగు నుంచి మొట్టమొదటిసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట అవార్డు గెలుచుకుంది. దీంతో యావత్ దేశం చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెప్తోంది. ఇదే సమయంలో కొందరు నాటు నాటు పాట వెగటు పుట్టిస్తోందని వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. ఇదేం పాటరా బాబూ అంటూ వెకిలిగా నవ్వుతున్నారు. పనీపాటా లేక ఇలాంటి విమర్శలు చేస్తున్నవారిపై సెలబ్రిటీలు మండిపడుతున్నారు. 'నాటు నాటు పాట చప్పగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే మరీ యావరేజ్‌గా ఉంది. అందులో వచ్చే యాస అయితే మరీ ఘోరం అని కొందరు పకపకా నవ్వుతున్నారు. మీరు చిన్నప్పటినుంచి మరీ అంత బాధలో ఉన్నారా? కనీసం పక్కవారి సంతోషాన్ని చూసి ఓర్వలేరా?' అంటూ రచయిత అనిరుధ గుహ ట్విటర్ వేదికగా ఫైరయ్యారు. 'ఒకరి బాధను చూడగలరేమో కానీ వారి సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోవడం మానవ నైజం కదా!' అంటూ సెటైర్ వేసింది పూజా భట్. Insaan ki fitrat hai ke woh apna dukh jhel leta hai par doosron ka sukh bardaashth nahin kar sakta 🙏 https://t.co/cbTAEcIIrP — Pooja Bhatt (@PoojaB1972) January 12, 2023 చదవండి: నాకసలు ఫ్యాన్స్ ఉన్నారా? అందుకే సినిమాలు చేయట్లే: నటుడు పూజారి మాస్ డ్యాన్స్, వీడియో చూశారా? -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్‌గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్‌కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్‌ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్‌కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్‌గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్‌గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్‌కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
నాన్న తాగొచ్చాడని బాత్రూమ్లో లాక్ చేసింది: పూజా భట్
కొందరు సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటారు. మరికొందరు మాత్రం అన్నింటినీ గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. కానీ బాలీవుడ్‌లోని భట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మొదటి కోవకే చెందుతారు. తమ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా నిర్మొహమాటంగా బయటకు చెప్తుంటారు. ఇందుకు బాలీవుడ్ నటి, దర్శకురాలు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పూజా భట్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంఘటనే ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతకీ పూజా భట్ దేని గురించి మాట్లాడిందంటారా? తన తండ్రి తాగినప్పుడు తల్లి ఎలా రియాక్ట్ అయిందో తెలిపింది. 'ఒక రోజు రాత్రి నాన్న తాగి తూలుతూ వచ్చాడు. దీంతో అమ్మ అతడిని బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టింది. ఇది చూసి నేను బెడ్‌పైనే ఏడ్చుకుంటూ ఎందుకు నాన్నను బంధించావని అడిగాను. వెంటనే అమ్మ నువ్వు నాన్న పార్టీనా? నా పార్టీనా? అని అడిగింది. ఇది టూమచ్ అనుకున్నా. కానీ సైడ్ తీసుకోవాల్సి వస్తే తప్పకుండా నాన్నవైపే వెళ్తాను' అని కుండ బద్ధలు కొట్టేసింది. ఎప్పుడూ నాన్నసైడ్ నిలబడుతున్నందుకు తన సోదరుడు మహేశ్ భట్ చెంచా అని ఆటపట్టించేవాడని పేర్కొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: రాకింగ్ రాకేశ్‌కు ఖరీదైన ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత ఆ వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు.. -
‘ధూమ్ 2’ నటుడు మృతి.. హన్సల్ మెహతా ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, వెలరన్ యాక్టర్ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్ 2’, ‘రాయిస్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళి తెలిపారు. యూసుఫ్ అల్లుడు ‘స్కామ్ 1992’ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా ట్వీట్ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్ బచ్చన్, ‘ఫ్యామీలీ మ్యాన్’ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్, నటి పూజా భట్ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, సినీ ప్రముఖుల నివాళి RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732 — Hansal Mehta (@mehtahansal) October 29, 2021 #RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y — Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021 Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95 — manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021 This brought tears to my eyes Hansal. Can’t begin to imagine what you’ll are feeling. My deepest condolences to all! 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 30, 2021 -
ఆర్యన్ డ్రగ్స్ వివాదంపై షారుక్‌కి.. మద్దతు తెలిపిన బాలీవుడ్ ప్రముఖులు
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందరికీ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అయితే డ్రగ్స్ కేసు విషయంలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు షారుక్ ఖాన్‌కి మద్దతు ప్రకటించారు. అందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి పూజా భట్ ఒకరు. ‘చాహత్’లో బాద్షాతో కలిసి పని చేసిన ఈ నటి ‘నేను మీకు సపోర్టుగా నిలుస్తున్నాను షారుఖ్. ఇది మీకు అవసరం లేకపోవచ్చు. కానీ నేను చేస్తాను. ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అంతేకాకుండా ‘కభీ హన్ కభీ నా’ మూవీలో షారుక్‌తో కలిసి నటించిన సుచిత్ర కృష్ణమూర్తి సైతం ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పిల్లలు ఇబ్బందులు పడడం చూడడం కంటే పెద్ద కష్టం తల్లిండ్రులకు ఏది ఉండదని నటి తెలిపింది. అంతేకాకుండా..‘ ఇంతకుముందు కూడా ఇలాగే బాలీవుడ్ నటులపై రైడ్స్ జరిగాయి. కానీ అందులో ఏం దొరకలేదు. ఏది ప్రూవ్ కాలేదు. మాతో తమషా చేయడం మామూలు అయిపోయింది కానీ అది మా ఫేమ్‌ని దెబ్బతీస్తుంది’ అని రాసుకొచ్చింది. అయితే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని వినియోగించినందుకు వివిధ సెక్షన్ల కింద ఎన్సీబీ ముగ్గురిపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది. చదవండి: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ? I stand in solidarity with you @iamsrk Not that you need it. But I do. This too, shall pass. 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 3, 2021 For all those targetting #Bollywood remember all the #NCB raids on filmstars? Yes nothing was found and nothing was proved. #Bollywood gawking is a tamasha. Its the price of fame — Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021 Nothing harder for a parent than seeing their child in distress. Prayers to all 🙏 — Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021 -
తాగుడుకు బానిసయ్యా, కానీ: నటి
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ కూతురు, నటి పూజాభట్ మద్యానికి బానిసయ్యాననని, అయితే దాని నుంచి బయటప పడేందుకు తను చేసిన ప్రయత్నం ఓ పోరాటమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘దిల్ హై కి మంతా నహీన్’ మూవీ జూలై 12తో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ మూవీ సంబంధించిన విషయాలను, తనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాలో పూజ మద్యానికి బానిసైన తండ్రిని కాపాడుకునే కూతురి పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ నిజ జీవితంలో తాను కూడా మద్యానికి బానిసైయినట్లు వెల్లడించింది. ‘ఈ సినిమాలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని దానిని నుంచి ఆయనను బయటక పడేసే కూతురి పాత్రలో నటించాను. ఇందులో మాదిరిగానే నేను కూడా నిజం జీవితంలో విపరీతంగా మద్యం సేవించేదాన్ని. అయితే నాలుగేళ్ల క్రితమే మానేశాను. దానిని నుంచి బయట పడాలనుకన్నాను. ఆ సమయంలో మద్యం నుంచి నా ఆలోచలను బయట పడేయడం చాలా కష్టంగా ఉండేది. చెప్పాలంటే అది ఒక పోరాటం’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక ‘ఇలాంటి విషయాలను ఆడవాళ్లు బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. కానీ ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఆడవాళ్లు ఈ విషయంపై నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వారికి స్ఫూర్తిని నింపాలనే ఇప్పుడు నేను దీనిపై నేను పెదవి విప్పాల్సి వచ్చింది. కానీ నేను తాగుడు నుంచి బయట పడేందుకు పోరాటమే చేశాను’ అని పూజ అన్నారు. కాగా మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ హై కి మంతా నహీన్’ మూవీ పూజ భట్ లీడ్ రోల్ పోషించగా, తండ్రి పాత్రలో అనుపమ్ ఖేర్ నటించాడు. ఇందులో ఆమీర్ ఖాన్ హీరో. అయితే ఈ సినిమాను తన నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా మహేష్ భట్ పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pooja B (@poojab1972) -
18 ఏళ్లకే ఫస్ట్ కిస్, నాన్న ప్రోత్సాహంతోనే: పూజా భట్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురు పూజా భట్ 18 ఏళ్లకే తన ఫస్ట్ కిస్ అనుభవాన్ని చుశానని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరీర్ ప్రారంభంలోని సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘సడక్’ చిత్రంలోని ఓ ముద్దు సన్నివేశం గురించి వివరించారు. ఆ సీన్లో నటించేందుకు తను ఇబ్బంది పడుతుంటే తన తండ్రి(మహేష్ భట్) దగ్గరుండి ఆ సన్నివేశాన్ని చేయించారన్నారు. ‘సడక్ మూవీ చేస్తున్న సమయానికి నాకు 18 ఏళ్లు. ఈ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు భయంతో వణికిపోయాను. నాన్న ముందు ఆ సీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో నాన్న నన్ను పక్కకు తీసుకెళ్లి నువ్వు ముద్దును వల్గర్‌గా ఫీల్ అయ్యావంటే అందులో నీకు వల్గారిటియే కనిపిస్తుంది. అదే నువ్వు ముద్దు సన్నివేశాన్ని గౌరవించి.. ఎంత ఇష్టంతో నటిస్తే ఆ సన్నివేశం అంతబాగా పండుతుంది. కథలో భాగంగా ప్రతి సీన్లోని ఇంటెన్షన్ తెలుసుకోవాలని’ చెప్పారని పేర్కొన్నారు. అలా తన తండ్రి మహేష్ భట్ ప్రోత్సాహంతో ముద్దు సీన్లో నటించగలిగానని, అప్పుడు ఆయన చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకుంటూ కెమెరా ముందు నిబద్ధతతో నటిస్తుంటానని పూజా తెలిపారు. కాగా పూజా భట్ 1991 చిత్రం సడక్తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ దత్‌కు ఆమె హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పూజా భట్ ఇటీవల 'బాంబే బేగమ్స్' అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెట్ ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ విడుదలైంది. చదవండి: ట్రెండింగ్: సడక్ 2కు డిస్‌లైకుల వర్షం -
తనువు చాలించిన బాలీవుడ్ నటుడు
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నినటి పూజా భట్ ట్విటర్లో షేర్ చేశారు. భారమైన హృదయంలో ఈ విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని ట్వీట్ చేశారు ఇకపై కూడా ఫరాజ్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. అలాగే అవసరమైన సమయంలో సాయం అందించిన అందరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత నెలలో ఛాతీ, మెదడు సంబంధింత ఇన్ఫెక్షన్తో బాధపడుతూ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో అతనికి సాయం చేయాల్సిందిగా పూజా భట్ ట్వీట్ చేశారు. దీంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించి సాయం అందించారు. కాగా ఫరాజ్ ఖాన్ 1990లో బాలీవుడ్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫరేబ్, మెహందీ, మైనే ప్యార్ కియా వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. With a heavy heart I break the news that #FaraazKhan has left us for what I believe, is a better place.Gratitude to all for your help & good wishes when he needed it most.Please keep his family in your thoughts & prayers.The void he has left behind will be impossible to fill 🙏 — Pooja Bhatt (@PoojaB1972) November 4, 2020 -
ఐసీయూలో నటుడు.. ఆదుకున్న హీరో
బాలీవుడ్ నటుడు ఫారజ్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫరాజ్ చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చైందని, ఆర్థికంగా తమ పరిస్థితి బాగా లేనందున సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఆయన సోదరుడు ఫండ్‌రైజింగ్ ప్లాట్‌ఫాంలో తమ దీనస్థితిని వివరిస్తూ సుదీర్ఘ పోస్టు షేర్ చేశాడు. దీనిపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. ఫరాజ్ మెడికల్ బిల్లులన్నింటిని భాయి జాన్ చెల్లించారు. ఈ విషయాన్ని నటి కాశ్మీరా షా వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ‘మీరు నిజంగా చాలా గొప్ప మనిషి. ఫరాజ్ ఖాన్‌కి సాయం చేసినందుకు ధన్యవాదాలు. అతడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ సమయంలో మీరు అతడికి మద్దతుగా నిలిచి సాయం చేశారు. నేను ఎల్లప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తాను. జనాలు ఈ పోస్ట్‌ని ఇష్టపడకపోవచ్చు. కానీ నేను పట్టించుకోను. వారు నన్ను ఫాలో కాకపోయినా నాకు అభ్యంతరం లేదు. చిత్ర పరిశ్రమలో నేను కలుసుకున్న అత్యంత గొప్ప వ్యక్తి మీరు’ అంటూ కాశ్మీరా ఇన్స్టాగ్రామ్ వేదికగా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. (చదవండి: భాయ్ బరిలో దిగుతున్నారు) ఇక నెటిజనులు కూడా ‘ఆయనలాంటి వ్యక్తి ఎవరూ లేరు.. సల్మాన్ నిజంగా ఓ లెజెండ్’.. ‘భాయిజాన్‌ని గౌరవించండి.. మీ వెనక ఎలా అయినా మాట్లాడుకోనివ్వండి.. మా అందరికి తెలుసు మీరు మీ చుట్టూ ఉన్న వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో.. నిస్సహాయులు, ఆపదలో ఉన్న వారికోసం మీరు ఎంత శ్రద్ధ వహిస్తారో మాకు తెలుసు’ అంటూ అభినందిస్తున్నారు. ఇక 1990 నాటి నటుడు ఫారజ్ ఖాన్ చెస్ట్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యం నిమిత్తం 25 లక్షల రూపాయలు అవసరం ఉందని ఆదుకోవాలని ఆయన సోదరుడు కోరారు. ఇప్పటికే పూజా భట్ తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. -
ఐసీయూలో నటుడు; ‘ప్లీజ్.. సాయం చేయండి’
ముంబై: బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్(46) ఆరోగ్య పరిస్థితి విషమించింది. చెస్ట్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజులుగా ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఫరాజ్ చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చైందని, ఆర్థికంగా తమ పరిస్థితి బాగా లేనందున సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఆయన సోదరుడు ఫామాన్ ఖాన్ విరాళాల సేకరణకు ఉపక్రమించారు. ఈ మేరకు ఫండ్‌రైజింగ్ ప్లాట్‌ఫాంలో తమ దీనస్థితిని వివరిస్తూ సుదీర్ఘ పోస్టు షేర్ చేశాడు. (చదవండి: 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు: సోనూ) ‘‘చాలా ఏళ్ల క్రితమే తన సినీ కెరీర్ ముగిసిపోయింది. ప్రస్తుతం తనొక చిన్న జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ట్రీట్మెంట్ కోసం రూ. 25 లక్షలు అవసరం. అంతపెద్ద మొత్తం భరించడం ఆ కుటుంబానికి తలకు మించిన భారం. ఐసీయూలో అచేతన స్థితిలో పడి ఉన్న ఫరాజ్ ఖాన్‌ను రక్షించేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మరో వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచాలని చెప్పారు. అయితే అందుకు అవసరమైన డబ్బు ఫరాజ్ కుటుంబం వద్ద లేదు. మాది సాదాసీదా కుటుంబం. ఉద్యోగం చేసుకుంటూ, వారాంతాల్లో కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడమే మాకు తెలుసు. అలాంటిది ఇంత పెద్ద కష్టం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. భాయ్ ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నాడు. దయచేసి సహాయం చేయండి’’ అంటూ విజ్ఞప్తి చేశాడు. బుధవారం నాటికి రెండున్నర లక్షల రూపాయల సాయం అందినట్లు పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన సీనియర్ నటి పూజా భట్, తన వంతు సాయం చేశానని, వీలైతే మీరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తోచిన సాయం చేయాలంటూ తన ఫాలోవర్లకు సూచించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కాగా దివంగత నటుడు యూసఫ్ ఖాన్ కుమారుడైన ఫరాజ్ ఖాన్, మెహందీ, పృథ్వీ, దుల్హన్ బనో మై తేరీ, ఫరేబ్ వంటి సినిమాల్లో నటించాడు. ష్ కోయీ హై, రాత్ హోనే కో హై, సింధూర్ తేరే నాహ్ కా వంటి టీవీ షోలతోనూ మంచి గుర్తింపు పొందాడు. -
విమర్శించడం ఆపేద్దాం!
‘‘చెడు అలవాట్లకు బానిసయినవాళ్లను విమర్శించడం కంటే అసలు దానికి ఎందుకు బానిస అయ్యారనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ విమర్శించడం అలవాటై, ఆ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం’’ అన్నారు నటి, దర్శకురాలు పూజా భట్. గతంలో ఆమె మద్యానికి బానిస అయి, అందులో నుంచి బయటపడ్డారు. పలు సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావించారామె. తాజాగా మరోసారి మద్యం అలవాటు నుంచి బయటపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మూడు సంవత్సరాల తొమ్మిది నెలలయింది మద్యం మానేసి. ఇంకో మూడు నెలలయితే నాలుగేళ్లు పూర్తవుతాయి. నేను మందు ఎలా బహిరంగంగానే తీసుకున్నానో, అందులో నుంచి బయటపడిన విషయాన్ని కూడా ఓపెన్‌గానే చెబుతాను. ఎందుకంటే నా ప్రయాణం అందరికీ తెలియాలనుకున్నాను. మద్యం మత్తు నుంచి బయట పడాలనుకుంటున్న వాళ్లకు స్ఫూర్తిగా ఉంటుందనుకున్నా. ఒక అలవాటు మానుకోవడానికి ఎంతో కృషి చేయాలి. మానేయాలనే పట్టుదలే మనల్ని మానేసేలా చేస్తుంది. మీరొక్కరే (మద్యానికి అలవాటుపడినవాళ్లు) ఒంటరిగా లేరు. మీలానే దీంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకోండి. ఇలా బయటకు మాట్లాడినందుకు చాలా మంది నన్ను అభినందించారు. కొందరు ఎగతాళి కుడా చేశారు. ఏదైనా విషయానికి బానిసలైతే దానికి ఎందుకు బానిసలయ్యారో కనుక్కోవాలి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు పూజా భట్. -
వాళ్ల గురించి పట్టించుకున్నారా.. సరేగానీ
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ కేసులో పలువురు నటుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీ-టౌన్ సెలబ్రిటీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్ మాఫియాతో సంబంధాల గురించి నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ పార్లమెంటులో ప్రస్తావించారు. బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారు. అదే విధంగా ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సైతం సినీ ఇండస్ట్రీలో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని, లోతుగా దర్యాప్తు చేస్తే సగం మంది ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(చదవండి: సుశాంత్‌తో టచ్‌లో లేను.. కానీ నాకు తెలుసు!) ఈ నేపథ్యంలో నటి పూజా భట్ ఆసక్తికర ట్వీట్‌తో సోషల్ మీడియాలో చర్చ లేవనెత్తారు. పేదరికంలో మగ్గిపోతూ, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారి గురించి ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘ సమాజంలో అట్టడుగువర్గాలుగా పరిగణింపబడుతూ, బాధల నుంచి విముక్తి పొందేందుకు మత్తు పదార్థాలను ఉపయోగించే ప్రజల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? కలలు కల్లలైపోయి పేదరికంలో మునిగి దుర్భర జీవితం గడుపుతున్న వాళ్ల పునరావాసం, బాగోగుల గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా?’’అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించారు. మీ నాన్న పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలో కొంతమంది పూజాకు మద్దతుగా కామెంట్లు చేస్తుంటే.. మరికొంత మంది నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ వారి కోసం ఇప్పుడు సెలబ్రిటీలను వదిలిపెట్టమంటారా? రియా అరెస్టు అయ్యింది. మీ నాన్న, మీ చెల్లెళ్ల గురించి ఏమంటారు’’అంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, పూజా భట్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు మహేష్ భట్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు ఆయన మద్దతుగా నిలిచారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పూజ సోదరి అలియా భట్ నెపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో స్థానం సంపాదించగలిగిందంటూ, ఇటీవల ఆమె నటించిన సడక్ 2 సినిమాకు ఘోరమైన రేటింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Does anyone care about people who live on the ultimate fringe of society,who use drugs to make the pain of living go away? The ones who are too battered & broken to chase dreams but chase substances amidst much poverty & squalor? Anyone interested in their rehabilitation? — Pooja Bhatt (@PoojaB1972) September 16, 2020 -
ఓటీటీలో సడక్ 2
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సడక్ 2’. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేశారు. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘సడక్’కి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆలియా, సంజయ్ దత్ లుక్స్‌ను విడుదల చేశారు. నేడు ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
కంగనా వర్సెస్ పూజా
‘‘మీ నాన్న (నటి, దర్శక–నిర్మాత పూజా భట్ తండ్రి మహేశ్ భట్ని ఉద్దేశించి) అవకాశం ఇవ్వడం వల్ల నాకు చాలా పెద్ద నష్టమే జరిగింది. సరిగ్గా అప్పుడే నాకు తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో చక్కని అవకాశం ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. మీ ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా వల్ల ‘పోకిరి’లాంటి మంచి సినిమా వదులుకున్నాను’’ అని పూజా భట్‌పై మండిపడ్డారు కథానాయిక కంగనా రనౌత్. బాలీవుడ్లో బంధుప్రీతి మెండుగా ఉందని, వారసులకు ఇచ్చినంత విలువ బయటినుంచి వచ్చినవాళ్లకు ఇవ్వరని ఎప్పటినుంచో ఓ వివాదం సాగుతోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ వివాదం ఊపందుకుంది. నెపోటిజం టాపిక్ వచ్చిన ప్రతిసారీ నేనున్నానంటూ ముందువరసలో నిలబడి పోరాటం చేస్తున్నారు కంగనా. ఈ నేపథ్యంలో తనకు మొదటి సినిమా (‘గ్యాంగ్‌స్టర్’)లో నటించటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత మహేశ్ భట్, ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు కంగనా. ‘‘మొదటి అవకాశం ఇచ్చిన మా నాన్నపై చీటికీ మాటికీ చురకలు అంటిస్తుంటుంది తను’’ అని ఓ సందర్భంలో పూజా భట్ అన్నారట. అలాగే ఆ సినిమా అప్పుడు 2006లో జరిగిన ఓ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారామె. కంగనా ‘ఉత్తమ నూతన కథానాయిక’గా ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రానికి అవార్డు అందుకున్న వీడియో అది. స్టేజ్ మీదకు వెళుతూ, ఆ చిత్రనిర్మాతల్లో ఒకరైన ముఖేశ్ భట్ (మహేశ్ భట్ తమ్ముడు)ను హగ్ చేసుకున్నారు కంగనా. తర్వాత స్టేజ్‌పైకి వెళ్లి ‘గ్యాంగ్‌స్టర్’ టీమ్ కెమెరామేన్‌కు, తన మేకప్ టీమ్‌తో పాటు ఆమె అక్క రంగోలికి థ్యాంక్స్ చెప్పారు కంగనా. అప్పుడు ఆనందం వ్యక్తం చేసి, ఇప్పుడు విమర్శించడం సరికాదనే అర్థం వచ్చేలా ఆ వీడియోను షేర్ చేశారు పూజా భట్. అందుకు సమాధానంగా కంగనా ‘‘నన్ను, నా టాలెంట్‌ను గుర్తించి ఆ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది దర్శకుడు అనురాగ్ బస్. విశేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించారంతే. ఆ సినిమా టైమ్‌లో మీ ఫ్యామిలీ (పూజా భట్ ఫ్యామిలీ) వాళ్లు నాపై చెప్పులు విసిరి, నీకు పిచ్చి ఉంది.. ఈ సినిమా తర్వాత నీ కథ ముగిసినట్లే అని విమర్శించారు’’ అని పేర్కొన్నారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ పాత కథలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. మరి... ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. -
పూజాభట్- కంగనాల మధ్య ముదురుతున్న వివాదం!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో మొదలైన నెపోటిజం గొడవ రోజులు గడుస్తున్న ఇంకా చల్లబడటం లేదు. నెపోటిజం గురించి బయటకి వచ్చి బహిరంగంగానే స్టార్స్ కిడ్స్‌ని, మహేష్ భట్, కరన్‌జోహార్ లాంటి నిర్మాతలను విమర్శించిన వారిలో కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు. ఇక నెపోటిజానికి సంబంధించి సోషల్‌మీడియా వేదికగా మహేష్ కుమార్తె పూజా భట్‌కు, కంగనా రనౌత్‌కు మాటల యుద్దం నడుస్తూనే ఉంది. 2006 ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించినందుకు గాను కంగనా బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కంగనా మహేష్ భట్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) తాజాగా పూజాభట్ ఈ వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వీడియోలు కూడా అబద్ధమా? నేను ఆరోపణలను వారికే వదిలేస్తున్నాను, నేను వాస్తవాలను మీ ముందుంచాను’ అని పూజా తన పోస్ట్‌కు శీర్షికను పెట్టారు. తన కుటుంబం మీద వస్తున్న నెపోటిజం ఆరోపణలపై స్పందించిన పూజా... విశేష్ ఫిల్మ్ ఒకప్పుడు కొత్తవారితో మాత్రమే పనిచేసినందుకు అపఖ్యాతి పాలైందని గుర్తుచేశారు. ఇక దీనిపై స్పందించిన కంగనా రనౌత్ సోషల్ మీడియా టీం మహేష్ భట్ ప్రొడక్షన్ హౌస్ నటుల కోసం అంత ఎక్కువగా డబ్బు ఖర్చు చేయదని పేర్కొంది. కంగనా లాంటి టాలెంట్ ఉన్న వారు తక్కువ డబ్బులకు చేయడానికి దొరకడంతో మహేష్ భట్ ఆమెకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మొత్తం మీద సోషల్‌మీడియా వేదికగా పూజా భట్-కంగనాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. చదవండి: 'కంగనా.. నీకు ఆ అర్హత లేదు' -
ముంబైలోనే మకాం
తిరిగి తిరిగి ముంబైలోనే మకాం పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘సడక్’ టీమ్. 1991లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సడక్ 2’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ చిత్రం కోసం మళ్లీ డైరెక్టర్ చైర్లో కూర్చోనున్నారు మహేశ్‌భట్. చివరిసారిగా 1999లో ‘కారతూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు మహేశ్‌భట్. తాజాగా ఆయన తీయనున్న ‘సడక్ 2’లో సంజయ్‌దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్యతారలుగా నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ని ముందుగా రొమేనియాలో ప్లాన్ చేశారు. అక్కడి లొకేషన్లను కూడా పరిశీలించారు. అక్కడి లొకేషన్స్ నచ్చినప్పటికీ లోకల్ కాస్ట్ అండ్ క్రూ, కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలోనే జరపాలనుకుంటున్నారు. ఆల్రెడీ ముంబైలోని ఓ స్టూడియోలో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. తొలుత సంజయ్‌దత్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు టీమ్. మే 15 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. -
కొత్త ప్రయాణం
‘సడక్ 2’ ప్రయాణం మొదలైంది. ఈ చిత్రం కోసం లొకేషన్ సెర్చ్ స్టార్ట్ చేశారు దర్శకుడు మహేశ్ భట్. తన 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ భట్ ‘సడక్ 2’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న చిత్రమిదే కావడం విశేషం. 1999లో మహేశ్ భట్ చివరగా ‘కార్తూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘సడక్ 2’ కి సన్నాహాలు మొదలెట్టారు. 1991లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, పూజాభట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘‘సడక్ 2’ ప్రయాణం అధికారికంగా మొదలైంది. లైఫ్‌ను మార్చే కొత్త ప్రయాణం ఆరంభమైన అనుభూతి కలుగుతోంది. డెహ్రాడూన్, కేదార్నాథ్ ప్రదేశాలను షూటింగ్ కోసం పరిశీలించాం’’అన్నారు పూజాభట్. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
హింసను బయటకు చెప్పకూడదా?
‘‘అందరూ తమ బాధను మర్చిపోవడానికో, తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికో లైంగిక వేధింపుల గురించి బయటకు మాట్లాడుతున్నారు. నేను ఒకప్పుడు మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండేదాన్ని. అతన్ను నన్ను శారీరకంగా హింసించే వాడు. ఆ హింసను బయటకు చెప్పడానికి నేను మొహమాటపడలేదు, భయపడలేదు’’ అని బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత, ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తనయ పూజా భట్ పేర్కొన్నారు. ‘మీటూ’ ఉద్యమం ఎవ్వరికీ వినిపించని గోడులను నిర్భయంగా బయటకు చెప్పుకునే అవకాశం తీసుకువచ్చింది. ప్రపంచంలోని అన్ని మూలలా ఉన్న ప్రతి ఒక్కరూ తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటకు చెప్పుకోగలుగుతున్నారు. కేవలం వాళ్ల బాధను వెలిబుచ్చుకోవడం కోసమే కాదు. ఇలాంటివి మళ్లీ జరక్కుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ ఉద్యమం సాగుతోంది. తాజాగా ఈ ఉద్యమంలో తన గొంతునూ వినిపించారు పూజా భట్. లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కానీ మన ఇళ్లలో, మన పడకగదుల్లో మార్పు వచ్చే వరకూ ఏ మార్పు రాదు. కేవలం అబద్ధాలకే అలవాటు పడ్డ ప్రపంచంలో నువ్వు నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ప్రజలు చెవిటివారిలా నటించడంలో ఆశ్చర్యం లేదు. మార్పు గురించి అందరం మాట్లాడతాం తప్పితే ఆ దిశగా ఎవ్వరం నడవం. మన ఇంట్లో సురక్షితమైన వాతావరణం ఉంటే ప్రపంచం 90 శాతం శాంతియుతంగా మారిపోతుంది. ఎందుకంటే 90 శాతం వేధింపులు మన ఇంట్లోనే జరుగుతాయి కాబట్టి. నా సమస్య గురించి బయటకు చెప్పినప్పుడు ఎందుకు ఇంట్లో సమస్యను పబ్లిక్‌లో పెడుతున్నావేంటి? అన్నారు. మహేశ్ భట్ కూతుర్ని కాబట్టి నాకు బాధ తక్కువగా ఉంటుందా? హింసను బయటకు చెప్పకూడదా’’ అన్నారు పూజా. -
‘అతనో ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు’
తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశం అయ్యింది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ చేసిన ఆరోపణలు మన దేశంలో కూడా ‘మీటూ’ ఉద్యమానికి ఆరంభంగా నిలిచాయంటున్నారు ప్రముఖులు. కానీ ఈ ప్రారంభం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అంటూ పెదవి విరుస్తున్నారు. కారణం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాల గురించి పెద్ద హీరోలు మాట్లాడకపోవడం. తనుశ్రీ వివాదం గురించి ఇంతవరకూ బాలీవుడ్ స్టార్ హీరోలైనా అమితాబ్ బచ్చన్ కానీ, ఖాన్ హీరోల త్రయం కానీ స్పందించలేదు. అయితే తనుశ్రీ - నానా వివాదంలో స్వరా భాస్కర్, ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా, అనుష్క శర్మ, వరుణ్ ధావన్‌లు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి వరుసలోకి మహేష్ భట్ తనయ పూజా భట్ చేరారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తనుశ్రీ, నానా పటేకర్ తనను లైంగింకంగా వేధించాడని చెప్పినప్పుడు చాలా మంది ‘ఇమె పదేళ్లు నోర్ముసుకుని ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది’ అనడం నేను స్వయంగా విన్నాను. అంతేకాక కొంత మంది ‘నానా చాలా మంచి వ్యక్తి’ అంటూ అతనికి కితాబు ఇస్తున్నారు.. కానీ కొందరు అతన్ని రౌడీ అని పిలవడం కూడా నేను విన్నాను. ఈ విషయంలో తనుశ్రీ ఇంకా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. తాను ఈ విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయించాలి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పూజా తన గతాన్ని గుర్త చేసుకుంటూ ‘ఒకప్పుడు నేను ఒక వ్యక్తితో బంధాన్ని కలిగి ఉండేదాన్ని. అతను చాలా ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు. అతని గురించి నేను మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ.. ‘ఎందుకు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నావ్.. ఇలాంటి చెత్త గురించి బహిరంగాగా చర్చించడం వల్ల లాభం ఏంటి’ అని ప్రశ్నించింది. కానీ హింసను ఎదుర్కొన్నది నేను. మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రాన నాకు తక్కువ బాధ కలగదు కదా’ అంటూ ప్రశ్నించారు. అంతేకాక ‘నన్ను కిందకు లాగిన వారికి.. నా మంచితనాన్ని చెరపేసిన వారికి.. నన్ను నాశనం చేయాలని చూసిన వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే వీటన్నింటి వల్ల నాకు నా బలం ఏంటో తెలిసింది. సమాజం ఎలా ఉంటుందో తెలిసిందో. సమస్యలతో ఎలా పోరాడాలో తెలిసింది. అన్నింటికి మించి నా కాళ్ల మీద నేను నిలబడేందుకు.. నా సమస్యలతో నేనే పోరాటం చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని నేను కూడగట్టుకున్నాను. నేను బాధితురాలిని.. నా సమస్యలతో నేనే పోరాడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.