నా పేరు చెప్పి మోసం చేశాడు: హీరోయిన్ | Pooja Bhatt to File Police Complaint Against Man Posing as Her Agent | Sakshi
Sakshi News home page

నా పేరు చెప్పి మోసం చేశాడు: హీరోయిన్

Published Thu, Feb 23 2017 10:44 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

నా పేరు చెప్పి మోసం చేశాడు: హీరోయిన్ - Sakshi

నా పేరు చెప్పి మోసం చేశాడు: హీరోయిన్

ముంబై: ఓ వ్యక్తి తన ఏజెంట్‌నని చెప్పుకొంటూ, తనకు తెలియకుండా పలు కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశాడని బాలీవుడ్ నటి, దర్శకురాలు పూజాభట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ మల్గేవార్ అనే వ్యక్తి మోసానికి పాల్పడినట్టు చెప్పింది.

ప్రశాంత్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తన ఏజెంట్ లేదా ప్రతినిధి కాదని పూజాభట్ స్పష్టం చేసింది. తప్పుడు మాటలు చెప్పి ఇలా మోసం చేయడం చాలా ప్రమాదకరమైన పరిణామని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కంపెనీలు తనను సంప్రదించకుండా, ప్రశాంత్‌ గురించి తెలుసుకోకుండా అతనికి ఎలా డబ్బులు ఇచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబై, ఢిల్లీ పోలీసులకు ప్రశాంత్‌పై ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement