'నేను సింగిల్గానే ఉన్నాను బాబోయ్'
ముంబై: తన గురించి వస్తున్న రూమర్లపై బాలీవుడ్ నటి పూజాభట్ కలత చెందారు. తన ప్రేమ విషయం గురించి వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ.. ప్రస్తుతానికి తాను సింగిల్గా ఉన్నానని, ఎవరితోనూ ప్రేమలో పడలేదని పూజాభట్ చెప్పారు.
భర్త మనీష్ మఖీజతో పూజాభట్ 12 ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. మనీష్ నుంచి పూజాభట్ విడిపోయాక ఆమెపై గాసిప్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని, ఎవరినైనా ప్రేమిస్తే.. ఆ విషయాన్ని చెబుతానని పూజ ట్వీట్ చేశారు. ఈ వయసులో (43) తనను ఎవరైనా ప్రేమిస్తే ఆ విషయం తనను అడిగి తెలుసుకోవాలని, అంతేకాని తప్పుడు కథనాలను నమ్మకండి అంటూ పూజ ట్విట్టర్లో పేర్కొన్నారు. తనపై వస్తున్న రూమర్లపై స్పందించకుంటే నిజమని భావిస్తారనే ఉద్దేశ్యంతో వివరణ ఇస్తున్నట్టు చెప్పారు.