స్మోకింగ్ దెబ్బకు హీరోయిన్ దిమ్మతిరిగిందట! | Richa Chadda, a non-smoker consumed multiple cigarettes | Sakshi
Sakshi News home page

స్మోకింగ్ దెబ్బకు హీరోయిన్ దిమ్మతిరిగిందట!

Published Thu, Feb 4 2016 8:15 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్మోకింగ్ దెబ్బకు హీరోయిన్ దిమ్మతిరిగిందట! - Sakshi

స్మోకింగ్ దెబ్బకు హీరోయిన్ దిమ్మతిరిగిందట!

ముంబై: ఇటీవల కాలంలో బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో పాటు వారి పాత్రే కీలకంగా ఉన్న కథలు తెరకెక్కుతున్నాయి. 'ఫ్యాషన్'లో కంగనారనౌత్, 'మేరీ కోమ్'లో ప్రియాంకచోప్రా హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించడంతో పాటు తమ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆ మూవీస్ కోసం వారు కొద్దిపాటి సాహసం చేశారని చెప్పవచ్చు. మరో హీరోయిన్ కూడా వారి బాటలోనే నడుస్తోంది. ఆమె మరెవరో కాదు.. 'ఓయ్ లక్కీ ఓయ్'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రిచా ఛద్దా. ప్రస్తుతం 'సరబ్జిత్', 'క్యాబరే' మూవీ షూటింగ్ లతో బిజిబిజీగా ఉంది. ఆమె నటించిన 'ఔర్ దేవదాస్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగతున్నాయి.

భారీ అంచనాలతో పూజాభట్ నిర్మిస్తున్న క్యాబరే  చిత్రంలో రిచా ఛద్దా కాస్త సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మూవీలో తన పాత్ర డిమాండ్ చేస్తుండటంతో ఓ సీన్లో భాగంగా ఆమె కొన్ని సిగరెట్లు కాల్చేసింది. సీన్ సరిగ్గా రాకపోవడంతో కాస్త స్మోకింగ్ మోతాదు పెరిగిపోయింది. దీంతో ఆనారోగ్యానికి గురై కాస్త విరామం తీసుకుంది. సినిమా యూనిట్ షూటింగ్కు తాత్కాలికంగా ప్యాకప్ చెప్పేశారట. హీరోయిన్ పాత్రకు రిచానే న్యాయం చేయగలదని భావించి అవకాశం ఇచ్చిన పూజాభట్ నమ్మకాన్ని నిలబెట్టడానికి సాహసమే చేసిందని ఇండస్ట్రీలో టాక్. టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ ఈ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. 'క్యాబరే'లో దీపక్ తిజోరి, ముకుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement