‘క్యాబరే’ హీరోయిన్‌గా రిచా ఛద్దా
భారీ అంచనాలతో పూజాభట్ నిర్మిస్తున్న ‘క్యాబరే’ చిత్రంలో రిచా ఛద్దా హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. కౌస్తభ్‌నారాయణ్ నియోగి దర్శకత్వంలో రూపొందించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రిచానే న్యాయం చేయగలదని భావించిన పూజాభట్, ఆమెకు ఇందులో అవకాశం ఇచ్చింది. ఇందులో దీపక్ తిజోరి, ముకుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ‘క్యాబరే’ షూటింగ్ ప్రారంభం కానుంది.