పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటారు.. నాగరికత ముదిరితే నాన్నని ముద్దెట్టుకుంటారు అన్నట్టుగా ఉంది ఆ హీరోయిన్ శైలి అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ తండ్రి కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి ఓ విలువ ఉంది. మరింత ముందుకెళ్లి బుగ్గ మీద కిస్ చేసినా.. ఆ ముద్దులోనూ ఆప్యాయతనే చూడొచ్చు. కానీ తండ్రీ కూతుర్లు ఏకంగా లిప్‌లాక్ చేసుకుంటే... అందులో ఏం చూడాలి?
అప్పట్లో టాప్ లేపిన బ్యూటీ
ఈ విషయాన్ని బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ పూజా భట్ (Pooja Bhatt)ని అడగాలి. దాదాపుగా 3 దశాబ్ధాల క్రితం పూజాభట్ ఓ టాప్ బాలీవుడ్ నటి. దిల్ హై మాంగ్తా నహీ, సడక్... తదితర సినిమాలతో కుర్రకారు కలల బ్యూటీగా వెలిగిపోయింది. ఆ తర్వాత తర్వాత వయసు పెరిగినా రకరకాల పాత్రలతో ఇంకా బాలీవుడ్‌లో తనదైన సత్తా చాటుతూనే ఉంది. మన టాలీవుడ్ హీరో నాగార్జున సరసన ఈమె జఖ్మ్ అనే బాలీవుడ్ మూవీలో కూడా నటించింది. అయితే 3 దశాబ్దాలకు పూర్వం టీనేజ్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన పూజా భట్ అప్పట్లో మోడ్రన్ అమ్మాయిలకు కదిలే సింబల్‌లా ఉండేది.
తండ్రితో ఫోటోషూట్
ఆధునిక హీరోయిన్‌గా అందాల ఆరోబోత మాత్రమే కాదు తెరపై లిప్‌లాక్స్‌లోనూ ముందుండేది. దాంతో ఆమెకు మీడియాలో బాగానే ప్రచారం లభించేది. అదే సమయంలో ఈమె తన తండ్రి విఖ్యాత బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ (Mahesh Bhatt) తో కలిసి చేసిన ఓ ఫొటో షూట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫొటో షూట్ చేసి ఊరుకుంటే ఫర్వాలేదు, ఓ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపై ఆ ఫొటో పబ్లిష్ అయింది. తండ్రి మహేష్ భట్, కుమార్తె పూజాభట్ కలిసి పెదాల్ని ముద్దాడుతూ దిగిన ఆ ఫొటో 1990ల నాటి మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రచురించడంతో అనేక మంది భగ్గుమన్నారు. తండ్రీ కూతుర్లను తిట్టిపోశారు.
(చదవండి: సరిదిద్దుకోలేని తప్పు చేశా.. మోసం చేశా.. ఇన్నాళ్లకు తెలుసుకున్నా: ఆర్జీవీ)
అందులో అసభ్యత లేదు
ఆమధ్య ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ పూజాభట్ మరోసారి ఆ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. నాటి 1990 మ్యాగజైన్ కవర్ చుట్టూ అల్లుకున్న వివాదం, గురించి చర్చించింది, మరోసారి తనను తాను సమర్ధించుకున్న పూజాభట్ అందులో ఏ మాత్రం అసభ్యత లేదంటున్నారు. అలాంటి దృశ్యాల్ని కూడా నీచంగా చూసేవాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నీతులు వల్లించేవారు, సంప్రదాయవాదులు... ఆ ఫొటో మీద మండిపడడాన్ని తప్పుబట్టారు.
విడ్డూరంగా ఉంది
తండ్రీకూతుళ్ల అనుబంధం, గురించి అలా మాట్లాడేవాళ్లు ఇలాంటి సందర్భాల్లో కుటుంబ విలువల గురించి చర్చించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (‘అగర్ లోగ్ బాప్ ఔర్ బేటీ కే రిష్టే కో అలగ్ నజారీయే సే దేఖ్ సక్తే హై తో వో కుచ్ భీ కర్ సక్తే హైం) తండ్రీ కుమార్తెల అనుబంధాన్ని తప్పుడు దృష్టితో చూసేవాళ్లు ఏదైనా చేయగలరు. అలాంటివాళ్లు కుటుంబ విలువల గురించి మాట్లాడడ అద్భుతమైన జోక్‘ అని ఆమె పేర్కొంది.
తప్పు కాదా?
అయితే అలా చూసే పరిస్థితికి కారణం ఎవరు? అనేది పూజాభట్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆమె చేసింది తప్పుకానట్లయితే మళ్లీ ఇప్పటి దాకా అలాంటి పని మరెవ్వరూ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అనుబంధాల్ని అందంగా ఆవిష్కరించే శక్తి ఉన్న నటీనటుటు...ఆసభ్యంగా మార్చడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.
చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment