ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్‌లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్‌ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్‌గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్‌లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్‌లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్‌లో హృతిక్‌తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment