బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ షోరే హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్‌లో పాల్గొన్నాడు. గతంలో పూజా భట్‌తో ప్రేమాయణం నడిపిన ఈయన తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఆనాటి సంగతులను గుర్తు చేసుకోవడంతో పాటు కెరీర్ ఎలా మొదలైందో వెల్లడించాడు.
ఆరంకెల జీతం నుంచి జీరో
రణ్‌వీర్ మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో కెమెరా వెనకాల నా ప్రయాణం మొదలైంది. కొన్ని షోలకు డైరెక్షన్ చేశాను, నిర్మాతగా వ్యవహరించాను. తర్వాత ఓ ఎంటర్‌మైంట్ ఛానల్‌లో వీజేగా మారాను. ఆరంకెల జీతం అందుకున్నాను. సడన్‌గా మేనేజ్‌మెంట్ మారడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మళ్లీ జీరో దగ్గరకు వచ్చాను.
అప్పు తీసుకున్నా
అప్పుడు నా సోదరుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. 2002లో లఢక్‌లో లక్ష్య షూటింగ్ చేస్తున్న సమయంలో అమ్మకు బాలేదని ఫోన్ వచ్చింది. షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో అప్పటికప్పుడు వెళ్లలేకపోయాను. తర్వాత ముంబైకి వెళ్లేసరికి అమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ కొన్ని రోజులకే అమ్మ చనిపోయింది. అది నా జీవితంలోనే పెద్ద విషాదం. ఈ విషయాన్ని నా సోదరులకు ఫోన్‌లో చెప్పాల్సి రావడం మరో విషాదం.
నటి వల్ల ఇబ్బందులు
సరిగ్గా అదే సమయంలో ఓ నటి వల్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాను. నా పరిస్థితి చూసి మా అన్న అమెరికా వచ్చేయమన్నాడు. అలా అక్కడికెళ్లి తన దగ్గర అప్పు తీసుకుని ఆరు నెలలపాటు యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇండియాకు వచ్చీరావడంతోనే అప్పటిదాకా అటకెక్కిన నా రెండు సినిమాలు (ఖోస్లా కా ఘోస్లా, ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్) రిలీజ్‌కు నోచుకున్నాయి. జనాలు సైతం ఆ చిత్రాలను ఆదరించారు. నటుడినయ్యాక నా జీవితం సరైన దారికొచ్చింది అని చెప్పుకొచ్చాడు.
ఐరన్ రాడ్‌తో..
కాగా రణ్‌వీర్ షోరే గతంలో పూజా భట్‌ను ప్రేమించాడు. కానీ ఈ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. తాగొచ్చి కొట్టేవాడని పూజా ఆరోపించగా అలాంటిదేం లేదని రణ్‌వీర్ బుకాయించాడు. అయితే విషయం తెలిసిన పూజా సోదరుడు రాహుల్.. ఐరన్ రాడ్‌తో అతడిని కొట్టేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
పర్సనల్ లైఫ్
ఇకపోతే పూజ.. 2003లో మనీష్‌ను పెళ్లి చేసుకోగా 2014లో విడాకులు తీసుకుంది. రణ్‌వీర్.. 2010లో కొంకణసేన్ శర్మను పెళ్లాడగా 2011లో బాబు జన్మించాడు. 2015లో రణ్‌వీర్- కొంకణ విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment