Ranvir Shorey
-
నా జీవితంలో అదే అతి పెద్ద విషాదం: నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లో పాల్గొన్నాడు. గతంలో పూజా భట్‌తో ప్రేమాయణం నడిపిన ఈయన తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఆనాటి సంగతులను గుర్తు చేసుకోవడంతో పాటు కెరీర్ ఎలా మొదలైందో వెల్లడించాడు.ఆరంకెల జీతం నుంచి జీరోరణ్వీర్ మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో కెమెరా వెనకాల నా ప్రయాణం మొదలైంది. కొన్ని షోలకు డైరెక్షన్ చేశాను, నిర్మాతగా వ్యవహరించాను. తర్వాత ఓ ఎంటర్మైంట్ ఛానల్లో వీజేగా మారాను. ఆరంకెల జీతం అందుకున్నాను. సడన్‌గా మేనేజ్మెంట్ మారడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మళ్లీ జీరో దగ్గరకు వచ్చాను.అప్పు తీసుకున్నాఅప్పుడు నా సోదరుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. 2002లో లఢక్‌లో లక్ష్య షూటింగ్ చేస్తున్న సమయంలో అమ్మకు బాలేదని ఫోన్ వచ్చింది. షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో అప్పటికప్పుడు వెళ్లలేకపోయాను. తర్వాత ముంబైకి వెళ్లేసరికి అమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ కొన్ని రోజులకే అమ్మ చనిపోయింది. అది నా జీవితంలోనే పెద్ద విషాదం. ఈ విషయాన్ని నా సోదరులకు ఫోన్లో చెప్పాల్సి రావడం మరో విషాదం.నటి వల్ల ఇబ్బందులుసరిగ్గా అదే సమయంలో ఓ నటి వల్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాను. నా పరిస్థితి చూసి మా అన్న అమెరికా వచ్చేయమన్నాడు. అలా అక్కడికెళ్లి తన దగ్గర అప్పు తీసుకుని ఆరు నెలలపాటు యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇండియాకు వచ్చీరావడంతోనే అప్పటిదాకా అటకెక్కిన నా రెండు సినిమాలు (ఖోస్లా కా ఘోస్లా, ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్) రిలీజ్‌కు నోచుకున్నాయి. జనాలు సైతం ఆ చిత్రాలను ఆదరించారు. నటుడినయ్యాక నా జీవితం సరైన దారికొచ్చింది అని చెప్పుకొచ్చాడు.ఐరన్ రాడ్‌తో..కాగా రణ్వీర్ షోరే గతంలో పూజా భట్‌ను ప్రేమించాడు. కానీ ఈ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. తాగొచ్చి కొట్టేవాడని పూజా ఆరోపించగా అలాంటిదేం లేదని రణ్వీర్ బుకాయించాడు. అయితే విషయం తెలిసిన పూజా సోదరుడు రాహుల్.. ఐరన్ రాడ్‌తో అతడిని కొట్టేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.పర్సనల్ లైఫ్ఇకపోతే పూజ.. 2003లో మనీష్‌ను పెళ్లి చేసుకోగా 2014లో విడాకులు తీసుకుంది. రణ్వీర్.. 2010లో కొంకణసేన్ శర్మను పెళ్లాడగా 2011లో బాబు జన్మించాడు. 2015లో రణ్వీర్- కొంకణ విడాకులు తీసుకున్నారు. -
‘ఈ ట్వీట్‌తో విమర్శలు వస్తాయని తెలుసు’
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఏం అవకాశం ఉన్నట్టు? ఈ ట్వీట్ చేయడం వల్ల నేను విమర్శలను ఆహ్వానిస్తున్నానని తెలుసు, అయినా దీన్ని గట్టిగా చెప్పాలనిపించింది. నిన్న ఒక కుటుంబంతో ఒక పాపను గమనించాను. పుణెలోని ఒక ధనిక మార్కెట్ ప్రాంతం అది. కచ్చితంగా పాప తొమ్మిది, పది నెలలకు మించి ఉండదు. తనకు హిజాబ్ వేసివుంది. ఈ సందర్భంలో పాపకు ఏం అవకాశం ఉన్నట్టు? నేను హిజాబ్ నిషేధాన్ని సమర్థించడం లేదు. కానీ అంత చిన్న పాపకు వేయడం అనే విషయంలో మాత్రం ఏదో తప్పుగా ఉంది. – రిచా సింగ్, రచయిత్రి కుడి ఎడమల వైఖరులు మెట్రోలో నాకు ఎడమ వైపున ఒక ఢిల్లీ పోలీస్ అంకుల్ కూర్చుని వాట్సాప్‌లో కాంగ్రెస్ పార్టీ మీద జోక్ చదువుతున్నాడు. నాకు కుడి వైపున బహుశా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అనుకుంటాను, లెనిన్ పుస్తకం చదువుతున్నాడు. జీవితంలో బహుశా మొదటిసారి నేను లెఫ్ట్ కంటే ‘రైట్’కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. – కె. స్వాతి, ఢిల్లీ హైకోర్ట్ అడ్వకేట్ ప్రతీకార రాజకీయాలు పశ్చిమ బెంగాల్లో ఒక్క వారంలో 26 రాజకీయ హత్యలు జరిగాయి. వీర్భూమ్ నరమేధంలో 12 మంది మహిళలు, పిల్లల్ని తగలబెట్టి చంపారు. ఇరవై నాలుగ్గంటల క్రితం వాళ్లు బతికున్నారు. ఒక తృణమూల్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా జరిగిన హింస ఇది. మమతా బెనర్జీ పాలిత బెంగాల్లో ఇది నిత్యకృత్యమైపోయింది. – అభిజిత్ మజుందార్, సంపాదకుడు ఇంత హింసా? నిజాయితీ లేని మేధావితనం ఒక రాష్ట్రానికీ, దాని ప్రజలకూ ఏం చేయగలదో చూడాలంటే, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతున్నదో గమనించండి. కనీసం అక్కడ జరిగిన నరమేధపు ఫొటోలను ట్వీట్ చేయడానికి కూడా నాకు చేతులు రావడం లేదు. – రణ్వీర్ షోరే, నటుడు ఎలా మద్దతివ్వగలం? వ్లాదిమిర్ పుతిన్‌ను ఓడించడానికి ఉక్రెయిన్‌లోని నాజీలతో జట్టుకట్టడం ఎంత అసంబద్ధ మంటే... పుతిన్‌ను ఓడించడానికి సిరియాలోని ఐసిస్‌తో జట్టుకట్టడంతో అది సమానం. – మాజిద్ నవాజ్, యాక్టివిస్ట్ ఎందుకింత వేగం? కిరాణా సామగ్రి పది నిమిషాల్లో డెలివరీ... పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ... అదీ భారతీయ నగరాల్లో? నిజంగా ఈ డెలివరీ బాయ్స్ జీవితాలు, వాళ్ల రక్తపోట్ల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? – షెఫాలీ వైద్య, పాత్రికేయురాలు ఎందుకు రావడం? రీడింగ్ రూమ్‌కు వచ్చి అట్లానే పూర్తి నిద్రలోకి జారుకునేవాళ్లు నాకు ఎప్పుడూ అర్థం కారు. ప్రతి టేబుల్ మీదా ఒక తల పెట్టివుంది. – జాకబ్ బర్న్‌హామ్, పరిశోధక విద్యార్థి -
దద్దమ్మ.. నువ్వింకా బతికే ఉన్నావా?
బాలీవుడ్నటుడు రణ్వీర్ షోరే మీద కొందరు ట్విటర్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కాస్తైనా బుర్ర లేదని, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మేల్ వర్షన్లా ఉన్నాడే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఈ నటుడి మీద అంతలా ఎగిరెగిరి పడటానికి కారణం.. అతడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడమే.. 'గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కేవలం కరోనా కారణంగా రాహుల్ గాంధీ తన ర్యాలీలను రద్దు చేసుకోవడం నిజంగా గ్రేట్..' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. రాహుల్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం మింగుడుపడని ఓ నెటిజన్.. 'ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అసలు ఎలా బతుకగలుగుతున్నావ్? బుర్ర లేకుండా ఎవరైనా జీవించగలరా?' అంటూ విమర్శించాడు. దీనిపై సదరు నటుడు స్పందిస్తూ.. 'రాబందులను టార్గెట్ చేసి ఆవును చంపలేరు..' అని కౌంటరిచ్చాడు. 'నువ్వు పిచ్చోడివి, తెలివి తక్కువ దద్దమ్మవి. కంగనా రనౌత్‌కు మేల్ వర్షన్‌వి..' అని మరో నెటిజన్ తిట్టిపోయగా.. 'ఏంటి? ఈర్ష్యతో ఒళ్లు మండిపోతోందా?' అని రణ్వీర్ ఘాటు రిప్లై ఇచ్చాడు. కాగా, రణ్వీర్ గతంలో కంగనా వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కంగనా ఎన్నో నిజాలను కుండబద్దలు కొట్టి చెప్తుంటే ఎందుకు మీరు ఆమె నోరు మూయించాలని చూస్తున్నారు? దాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అంటూ ఆమెను వ్యతిరేకించేవారికి గట్టి కౌంటరిచ్చారు. ‘నీ భార్య నిన్ను వదిలి మంచి పని చేసింది’ అని గతంలో ఓ నెటిజన్ కామెంట్ చేయగా దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు రణ్వీర్. ‘నేను మంచివాడిని, కాబట్టే ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది’ అని సమాధానమిచ్చి సదరు నెటిజన్ నోరు మూయించాడు. “गिद्धों के कोसने से गाय नहीं मरती” https://t.co/ZyQUS2iF0G — Ranvir Shorey (@RanvirShorey) April 18, 2021 pic.twitter.com/6wCXQ0fC0C — Ranvir Shorey (@RanvirShorey) April 18, 2021 చదవండి: పెళ్లికి రెడీ అయిన కమెడియన్లు, ఎప్పుడంటే? అవన్నీ చూసేంత ధైర్యం లేదు, వదిలేస్తున్నా: చార్మీ -
కన్ను తాకితే కరోనా వచ్చింది!
కొన్నాళ్ల క్రితం కరోనా ఏ సెలబ్రిటీకి వచ్చినా పెద్ద న్యూస్‌గా ఉండేది. ఇప్పుడు ఎవరికి వస్తున్నదో ఎవరికి పోతున్నదో పెద్దగా పట్టడం లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరేకు కరోనా వచ్చింది. అతడు మాత్రం ఒక హెచ్చరిక చేశాడు. ‘చేతి శుభ్రత పాటించకపోవడం వల్లే నాకు కరోనా వచ్చిందని భావిస్తున్నాను. మేకప్ సమయంలో నేను నా కంటిని తాకాను. నేను శానిటైజ్ చేసుకోలేదు. కనుక దయచేసి అందరూ చేతి శుభ్రతను పాటించండి’ అని అతడు అప్పీలు చేశాడు. రణ్వీర్, కొంకణా సేన్లు 2010లో వివాహం చేసుకున్నారు. 2015 నుంచి విడిగా ఉంటూ 2020లో విడాకులు తీసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ‘మా అబ్బాయిని నాకు కరోనా రావడంతోటే కొంకణా ఇంటికి పంపించేశాను’ అన్నాడు రణ్వీర్. ప్రస్తుతం అతను ఒక గదిలో అతని 91 సంవత్సరాల తండ్రి ఒక గదిలో ఉంటున్నారట. రణ్వీర్ షోరే ‘భేజా ఫ్రై’, ‘దస్విదానియా’, ‘మోహ్ మాయా మనీ’ వంటి సినిమాలలో మంచి నటన ప్రదర్శించాడు. -
విడాకులకు బాలీవుడ్ జంట దరఖాస్తు
ముంబై : బాలీవుడ్ నటి, దర్శకురాలు కొంకణ సేన్ శర్మ తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు. నటుడు రణ్వీర్ షోరేను 2010లో కొంకణ సేన్ వివాహం చేసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్, మిక్స్డ్ డబుల్స్, ఆజా నాచ్లే వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట అనంతరం ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా 2015లో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వీరికి ఆరేళ్ల కుమారుడు హరూన్ ఉన్నాడు. ఇద్దరూ విడిగా ఉంటూనే కుమారుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. (నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్) అయితే 2015లో దూరమైన ఈ జంట ఇప్పటి వరకు విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవ్వగా.. ఆరునెలల్లో అధికారికంగా విడాకులు అందనున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు కొంకణ, రణవీర్ ఇద్దరూ కౌన్సిలింగ్ తీసుకున్నట్లు, అయినప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. (విడాకులపై పెదవి విప్పిన నటి శ్వేతాబసు) -
మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్
ముంబై: బాలీవుడు నటుడు రణవీర్ షోరే తన మాజీ భార్య, నటి కొంకనాసేన్ శర్మకు అభినందనలు తెలిపాడు. నటి కొంకనాసేన్ దర్శకురాలిగా మారి తీసిన తొలిచిత్రం 'ఏ డెత్ ఇన్ ద గంజ్'. అయితే తన తొలి ప్రయత్నంలోనే కొంకనాసేన్ ఉత్తమ మహిళా దర్శకురాలు అవార్డు సొంతం చేసుకున్నారు. ముంబైలో జరుగుతున్న 18వ జియో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె అవార్డు అందుకున్నారు. తనకు బెస్ట్ ఫీమేల్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని నటి కొంకనాసేన్ ట్విట్ చేయగా, ఆమె మాజీ భర్త, నటుడు రణవీర్ షోరే ఆమెను అభినందిస్తూ రీట్వీట్ చేశారు. రణవీర్, విక్రాంత్ మస్సీ, కల్కి కొచ్లిన్ ఆ మూవీలో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మామి16లో తనకు అవార్డు రావడంతో ఎంతో థ్రిల్ అయ్యాయని కొంకనా తన ట్వీట్ లో పేర్కొన్నారు. రణవీర్, కొంకనాలు ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2015లో తాము విడిపోయినట్లు ప్రకటించారు. ఈ దంపతులకు హరూన్ అనే బాబు ఉన్నాడు. -
'మేము విడిపోతున్నాం'
ముంబై: బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ, నటుడు రణవీర్ షొరే దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. వీరిద్దరూ విడిపోనున్నారని వచ్చిన రూమర్లు నిజమేనని రుజువు చేశారు. 'రణవీర్, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మేమిద్దరం స్నేహితులుగా కొనసాగుతాం. మా అబ్బాయికి కో-పేరెంట్ గా ఉంటాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నామ'ని కొంకణా సేన్ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని రణవీర్ షొరే కూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2007 నుంచి ప్రేమించుకుంటున్న కొంకణ, రణవీర్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు హరూన్ ఉన్నారు. కొంకణ, రణవీర్ కలిసి ట్రాఫిక్ సిగ్నల్, మిక్సిడ్ డబుల్స్, ఆజా నాచెలె, గౌర్ హరి దస్తాన్ సినిమాల్లో నటించారు. Ranvir and I have mutually decided to separate, but continue to be friends and co-parent our son. Will appreciate your support. Thank you. — Konkona Sensharma (@konkonas) September 14, 2015 -
వైఫల్యాలు నిజమే!
న్యూఢిల్లీ: భేజా ఫ్రై, ఖోస్లా కా ఘోస్లాలో రణ్వీర్ షోరే అద్భుతంగా నటించి హాస్యం సృష్టించినా అవేవీ మనోడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. హిందీ సినీపరిశ్రమలో తాను తగినన్ని విజయాలు సాధించని మాట నిజమేనని అంటున్నాడు. అందుకు బాధేమీ లేదని, కొన్నిసార్లు కాలం కలిసి రాకపోవచ్చని చెప్పాడు. తన కెరీర్లో ఎన్ని వైఫల్యాలు ఉన్నా, విజయాలతో పోలిస్తే వాటి సంఖ్య తక్కువేనని ఈ 41 ఏళ్ల నటుడు అన్నాడు. ఇక నుంచి మరిన్ని మంచి కథలు ఎంచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన షోరే, ఇప్పటి వరకు ఎంచుకున్న వాటిలో హాస్యపాత్రలే ఎక్కువ. ‘హాస్యం నాకు సహజసిద్ధంగానే వచ్చిందనుకుంటా. నా హాస్యాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కాబట్టే పాత్రలూ ఇలాంటివే దక్కుతున్నాయి. నవ్వించే పాత్రలు కొనసాగించడానికి ఇబ్బంది కూడా ఏం లేదు’ అని స్పష్టం చేశాడు. సింగ్ ఈజ్ కింగ్, చాందినీచౌక్ టు చైనా వంటి సినిమాల్లో షోరే కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రముఖ నటి కొంకణాసేన్ను పెళ్లాడినా, తామిద్దరం సినిమాల గురించి మాట్లాడేది చాలా తక్కువని ఇతడు చెబుతాడు. ‘సినిమాలే కాదు మేం పట్టించుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉంటాయి. కొడుకు హరూమ్తో ఇంట్లో చాలా సేపు గడుపుతాం. స్నేహితుల ఇళ్లకు భోజనాలకూ వెళ్తుంటాం. స్నేహితుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎప్పుడూ బిజీగా ఉంటాను’ అని షోరే వివరించాడు. సాహసాలు, పోరాటాల నేపథ్యంగా సాగే ఖత్రోకా కే ఖిలాడీ 5 టీవీ షోలోనూ ఇతడికి అవకాశం దక్కింది. ఇది కాస్త ప్రమాదకరమైన షో కాబట్టి నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కొంకణ హెచ్చరించిందని చెప్పాడు. రణ్వీర్ షోరే మాత్రం షోలో పాల్గొనాలనే నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్లో ప్రసారమవుతుంది.