మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్ | Ranvir Shorey congratulates Konkona in twitter | Sakshi
Sakshi News home page

మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్

Published Fri, Oct 28 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్

మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్

ముంబై: బాలీవుడు నటుడు రణవీర్ షోరే తన మాజీ భార్య, నటి కొంకనాసేన్ శర్మకు అభినందనలు తెలిపాడు. నటి కొంకనాసేన్ దర్శకురాలిగా మారి తీసిన తొలిచిత్రం 'ఏ డెత్ ఇన్ ద గంజ్'. అయితే తన తొలి ప్రయత్నంలోనే కొంకనాసేన్ ఉత్తమ మహిళా దర్శకురాలు అవార్డు సొంతం చేసుకున్నారు. ముంబైలో జరుగుతున్న 18వ జియో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె అవార్డు అందుకున్నారు.

తనకు బెస్ట్ ఫీమేల్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని నటి కొంకనాసేన్ ట్విట్ చేయగా, ఆమె మాజీ భర్త, నటుడు రణవీర్ షోరే ఆమెను అభినందిస్తూ రీట్వీట్ చేశారు. రణవీర్, విక్రాంత్ మస్సీ, కల్కి కొచ్లిన్ ఆ మూవీలో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మామి16లో తనకు అవార్డు రావడంతో ఎంతో థ్రిల్ అయ్యాయని కొంకనా తన ట్వీట్ లో పేర్కొన్నారు. రణవీర్, కొంకనాలు ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2015లో తాము విడిపోయినట్లు ప్రకటించారు. ఈ దంపతులకు హరూన్ అనే బాబు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement