Konkona Sensharma
-
నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి: స్టార్ హీరోయిన్
Konkona Sen Sharma Says She Does Not See Herself As Woman: బాలీవుడ్ బ్యూటీ కొంకణ సేన్ శర్మ పేజ్ 3, ఓంకార, లక్ బై ఛాన్స్, తల్వార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెండర్ ఈక్వాలిటీపై తనకున్న భావాన్ని పంచుకుంది. తాను లింగ సమానత్వంలో న్యూట్రల్‌గా ఉంటానని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో 'నేను ఒక చిత్రంలో ఫెమినిస్ట్‌గా నటించాల్సి వస్తే స్త్రీవాది గురించి తెలుసుకోవాలి. ఆ పాత్రకు తగినట్లుగా ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీ అయినా, పురుషుడైనా, మరేవరైనా కచ్చితంగా న్యూట్రల్‌గానే ఆలోచించాలని నేను భావిస్తున్నా. అప్పుడే అందరికీ సమన్యాయం చేయగలుగుతామన్నదే నా అభిప్రాయం. అందుకో నన్ను నేను ఎప్పుడూ ఒక మహిళగా భావించుకోను.' అని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 2010లో యాక్టర్ రణ్వీర్ షోరేని వివాహం చేసుకుంది. పెళ్లైన ఐదేళ్లకు భర్తతో విడిపోయి 2020లో అధికారికంగా విడాకులు తీసుకుంది. ఈ జంటకు 11 ఏళ్ల కుమారుడు హరూన్ షోరే ఉన్నాడు. తన కొడుకును ఎప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించమని చెబుతానని కొంకణ సేన్ తెలిపింది. అలాగే తన మాజీ భర్త గురించి చెబుతూ 'సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కానీ ఆయనకు సంబంధించి ఆయన ఏమైనా, ఎలాగైనా అనుకోవచ్చని భావిస్తాడు. జనాల కోసం అన్నింటిని భరిస్తూ ఉండటం నా వల్ల కాదు. నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్, ఏసీ వంటి మరికొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఉంటాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నాకు నచ్చిన పనులు చేసేలా ఉండాలి.' అని కొంకణ సేన్ శర్మ తెలిపింది. -
విద్యా పోయే.. కోన్ వచ్చే!
గతేడాది రిలీజైన హిందీ చిత్రం ‘లిప్‌స్టిక్ అండర్ మై గుర్కా’ సినిమా బాలీవుడ్లో మంచి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణే లభించింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకురాలు అలంక్రిత శ్రీవాత్సవ నెక్ట్స్ చిత్రంపై దృష్టిసారించారు. ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లుకు చాన్స్ ఉంది. అందులో ఒక కథానాయికగా భూమి పడ్నేకర్ ఫిక్సయ్యారు. మరో కథనాయికగా విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చిన ఫైనల్‌గా ప్లేస్‌ను కోన్కోనా సేన్ శర్మ దక్కించుకున్నారు. ‘లిప్‌స్టిక్ అండర్ మై గుర్కా’ సినిమాలో లీడ్ రోల్ చేసింది కూడా సేన్ శర్మనే కావడం విశేషం. ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకురాలిగా తొలిసారి అశ్వనీ అయ్యర్ పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనా రనౌత్ ‘పంగా’ సినిమాతో అశ్వని బిజీగా ఉన్నారు. -
మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్
ముంబై: బాలీవుడు నటుడు రణవీర్ షోరే తన మాజీ భార్య, నటి కొంకనాసేన్ శర్మకు అభినందనలు తెలిపాడు. నటి కొంకనాసేన్ దర్శకురాలిగా మారి తీసిన తొలిచిత్రం 'ఏ డెత్ ఇన్ ద గంజ్'. అయితే తన తొలి ప్రయత్నంలోనే కొంకనాసేన్ ఉత్తమ మహిళా దర్శకురాలు అవార్డు సొంతం చేసుకున్నారు. ముంబైలో జరుగుతున్న 18వ జియో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె అవార్డు అందుకున్నారు. తనకు బెస్ట్ ఫీమేల్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని నటి కొంకనాసేన్ ట్విట్ చేయగా, ఆమె మాజీ భర్త, నటుడు రణవీర్ షోరే ఆమెను అభినందిస్తూ రీట్వీట్ చేశారు. రణవీర్, విక్రాంత్ మస్సీ, కల్కి కొచ్లిన్ ఆ మూవీలో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మామి16లో తనకు అవార్డు రావడంతో ఎంతో థ్రిల్ అయ్యాయని కొంకనా తన ట్వీట్ లో పేర్కొన్నారు. రణవీర్, కొంకనాలు ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2015లో తాము విడిపోయినట్లు ప్రకటించారు. ఈ దంపతులకు హరూన్ అనే బాబు ఉన్నాడు. -
'మేము విడిపోతున్నాం'
ముంబై: బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ, నటుడు రణవీర్ షొరే దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. వీరిద్దరూ విడిపోనున్నారని వచ్చిన రూమర్లు నిజమేనని రుజువు చేశారు. 'రణవీర్, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మేమిద్దరం స్నేహితులుగా కొనసాగుతాం. మా అబ్బాయికి కో-పేరెంట్ గా ఉంటాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నామ'ని కొంకణా సేన్ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని రణవీర్ షొరే కూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2007 నుంచి ప్రేమించుకుంటున్న కొంకణ, రణవీర్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు హరూన్ ఉన్నారు. కొంకణ, రణవీర్ కలిసి ట్రాఫిక్ సిగ్నల్, మిక్సిడ్ డబుల్స్, ఆజా నాచెలె, గౌర్ హరి దస్తాన్ సినిమాల్లో నటించారు. Ranvir and I have mutually decided to separate, but continue to be friends and co-parent our son. Will appreciate your support. Thank you. — Konkona Sensharma (@konkonas) September 14, 2015