
Konkona Sen Sharma Says She Does Not See Herself As Woman: బాలీవుడ్ బ్యూటీ కొంకణ సేన్ శర్మ పేజ్ 3, ఓంకార, లక్ బై ఛాన్స్, తల్వార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెండర్ ఈక్వాలిటీపై తనకున్న భావాన్ని పంచుకుంది. తాను లింగ సమానత్వంలో న్యూట్రల్‌గా ఉంటానని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో 'నేను ఒక చిత్రంలో ఫెమినిస్ట్‌గా నటించాల్సి వస్తే స్త్రీవాది గురించి తెలుసుకోవాలి. ఆ పాత్రకు తగినట్లుగా ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీ అయినా, పురుషుడైనా, మరేవరైనా కచ్చితంగా న్యూట్రల్‌గానే ఆలోచించాలని నేను భావిస్తున్నా. అప్పుడే అందరికీ సమన్యాయం చేయగలుగుతామన్నదే నా అభిప్రాయం. అందుకో నన్ను నేను ఎప్పుడూ ఒక మహిళగా భావించుకోను.' అని చెప్పుకొచ్చింది.
ఈ బ్యూటీ 2010లో యాక్టర్ రణ్‌వీర్ షోరేని వివాహం చేసుకుంది. పెళ్లైన ఐదేళ్లకు భర్తతో విడిపోయి 2020లో అధికారికంగా విడాకులు తీసుకుంది. ఈ జంటకు 11 ఏళ్ల కుమారుడు హరూన్ షోరే ఉన్నాడు. తన కొడుకును ఎప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించమని చెబుతానని కొంకణ సేన్ తెలిపింది. అలాగే తన మాజీ భర్త గురించి చెబుతూ 'సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కానీ ఆయనకు సంబంధించి ఆయన ఏమైనా, ఎలాగైనా అనుకోవచ్చని భావిస్తాడు. జనాల కోసం అన్నింటిని భరిస్తూ ఉండటం నా వల్ల కాదు. నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్, ఏసీ వంటి మరికొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఉంటాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నాకు నచ్చిన పనులు చేసేలా ఉండాలి.' అని కొంకణ సేన్ శర్మ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment