Konkona Sen
-
నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి: స్టార్ హీరోయిన్
Konkona Sen Sharma Says She Does Not See Herself As Woman: బాలీవుడ్ బ్యూటీ కొంకణ సేన్ శర్మ పేజ్ 3, ఓంకార, లక్ బై ఛాన్స్, తల్వార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెండర్ ఈక్వాలిటీపై తనకున్న భావాన్ని పంచుకుంది. తాను లింగ సమానత్వంలో న్యూట్రల్‌గా ఉంటానని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో 'నేను ఒక చిత్రంలో ఫెమినిస్ట్‌గా నటించాల్సి వస్తే స్త్రీవాది గురించి తెలుసుకోవాలి. ఆ పాత్రకు తగినట్లుగా ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీ అయినా, పురుషుడైనా, మరేవరైనా కచ్చితంగా న్యూట్రల్‌గానే ఆలోచించాలని నేను భావిస్తున్నా. అప్పుడే అందరికీ సమన్యాయం చేయగలుగుతామన్నదే నా అభిప్రాయం. అందుకో నన్ను నేను ఎప్పుడూ ఒక మహిళగా భావించుకోను.' అని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 2010లో యాక్టర్ రణ్వీర్ షోరేని వివాహం చేసుకుంది. పెళ్లైన ఐదేళ్లకు భర్తతో విడిపోయి 2020లో అధికారికంగా విడాకులు తీసుకుంది. ఈ జంటకు 11 ఏళ్ల కుమారుడు హరూన్ షోరే ఉన్నాడు. తన కొడుకును ఎప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించమని చెబుతానని కొంకణ సేన్ తెలిపింది. అలాగే తన మాజీ భర్త గురించి చెబుతూ 'సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కానీ ఆయనకు సంబంధించి ఆయన ఏమైనా, ఎలాగైనా అనుకోవచ్చని భావిస్తాడు. జనాల కోసం అన్నింటిని భరిస్తూ ఉండటం నా వల్ల కాదు. నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్, ఏసీ వంటి మరికొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఉంటాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నాకు నచ్చిన పనులు చేసేలా ఉండాలి.' అని కొంకణ సేన్ శర్మ తెలిపింది. -
‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’ సినిమా తర్వాత పరిశ్రమలో మంచి గుర్తింపు
తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ నుంచి పొందిన స్ఫూర్తితో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొంకణాసేన్ ఖాతాలో విజయాలు తక్కువేనని చెప్పాలి. అయితే నటనపరంగా చూస్తూ మిగతా నటీనటులకంటే ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ విషయమై అస్ట్రేలియాలోని సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ సినిమా తర్వాత పరిశ్రమలో నాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటనకుగాను నాకు జాతీయ అవార్డు వచ్చింది. చిత్రీకరణ సమయంలో నటనలోని అన్ని కోణాలను చాలా దగ్గరగా చూశాననే అనుభూతి కలిగింది. నిజానికి ఆ సినిమా అంగీకరించే సమయంలో నాకు నటనలో పెద్దగా అనుభం లేదనే చెప్పాలి. కానీ నా తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ ప్రోత్సాహంతో ఆ పాత్రను ఒప్పుకున్నాను. నటనకు సంబంధించి ఎన్నో మెళకువలు ఆమె వద్ద నేర్చుకున్నాను. సినిమాలో నా పాత్ర కోసం ఓ పరిశోధన జరిగిదంనే చెప్పాలి. పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలుసుకునేందుకు అమ్మ చెన్నై వెళ్లింది. తనపాటు అసిస్టెంట్‌గా నన్ను తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లడం నాకెంతో ఉపయోగపడింది. మొత్తానికి సినిమా బాగా వచ్చింది. ఆ తర్వాత అవార్డుల గురించి మీకు తెలిసిందే. అయితే సినిమాకు అవార్డులు వచ్చే సమయంలో నేను ఢిల్లీలో ఓ జాబ్‌లో స్థిరపడిపోయాను. కానీ అవార్డు తర్వాత అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించాను. బాల నటిగా 1983లోనే ‘ఇందిరాహ్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాకు తొలి చిత్రంలోనే బాలుడిలా కనిపించేందుకు వెంట్రుకలు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సినిమా కోసం ఏదైనా చేయాలనే అభిప్రాయానికి వచ్చాను. అదే నన్ను జాతీయ అవార్డు దక్కించుకునేలా చేసింద’ని చెప్పింది.