విద్యా పోయే.. కోన్‌ వచ్చే! | After Bhumi, Konkana joins the cast of Alankrita Shrivastava's next? | Sakshi
Sakshi News home page

విద్యా పోయే.. కోన్‌ వచ్చే!

Oct 13 2018 3:53 AM | Updated on Oct 13 2018 3:53 AM

After Bhumi, Konkana joins the cast of Alankrita Shrivastava's next? - Sakshi

కోన్‌కోనా సేన్‌ శర్మ

గతేడాది రిలీజైన హిందీ చిత్రం ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై గుర్కా’ సినిమా బాలీవుడ్‌లో మంచి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణే లభించింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకురాలు అలంక్రిత శ్రీవాత్సవ నెక్ట్స్‌ చిత్రంపై దృష్టిసారించారు. ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లుకు చాన్స్‌ ఉంది. అందులో ఒక కథానాయికగా భూమి పడ్నేకర్‌ ఫిక్సయ్యారు. మరో కథనాయికగా విద్యాబాలన్‌ పేరు తెరపైకి వచ్చిన ఫైనల్‌గా ప్లేస్‌ను కోన్‌కోనా సేన్‌ శర్మ దక్కించుకున్నారు. ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై గుర్కా’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేసింది కూడా సేన్‌ శర్మనే కావడం విశేషం. ఈ సినిమాను ఏక్తా కపూర్‌ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకురాలిగా తొలిసారి అశ్వనీ అయ్యర్‌ పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనా రనౌత్‌ ‘పంగా’ సినిమాతో అశ్వని బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement