వరుణ్‌తో అలాంటిదేమీ లేదు... | Nargis Fakhri Denies Dating Varun Dhawan | Sakshi
Sakshi News home page

వరుణ్‌తో అలాంటిదేమీ లేదు...

Published Mon, Aug 25 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

వరుణ్‌తో అలాంటిదేమీ లేదు...

వరుణ్‌తో అలాంటిదేమీ లేదు...

వరుణ్ ధావన్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా వచ్చిన కథనాలను నర్గీస్ ఫఖ్రీ తోసిపుచ్చింది. ‘ఏక్ థా హీరో’లో వరుణ్‌తో కలసి నటించిన నర్గీస్ ఫఖ్రీ, కొద్ది కాలంగా అతడితో రొమాన్స్‌లో మునిగి తేలుతోందని, ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇదివరకు కూడా తనపై ఇలాంటి కథనాలే వచ్చాయని, ఊసుపోని పాత్రికేయులు కొందరు ఇలాంటివి రాస్తుంటారని రుసరుసలాడింది.

చెల్లెళ్లతో పూజాభట్ సినిమా!
కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న పూజాభట్ త్వరలోనే తన చెల్లెళ్లు ఆలియా, షాహీన్‌లతో సినిమా నిర్మించాలనుకుంటోంది. తాను నటనకేమీ దూరం కాలేదని, వయసుకు తగిన పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తానని ఆమె చెబుతోంది. ఇప్పుడు తన వయసు 42 ఏళ్లని, తన తండ్రి మహేశ్‌భట్ తరహాలో ఎవరైనా కథ రూపొందించి, తనకు తగిన పాత్ర కల్పిస్తే, మళ్లీ తెరపై కనిపిస్తానని అంటోంది.
 
 స్టైలిస్ట్‌గా ఆలియాభట్
వెండితెరపై ఇప్పుడిప్పుడే సత్తా చాటుకుంటున్న ఆలియాభట్ త్వరలోనే స్టైలిస్ట్‌గానూ తన ప్రతిభ నిరూపించుకోనుంది. ఎంటీవీ చానల్ ప్రసారం చేసే డిజిటల్ షో ‘ది లుక్’ కోసం తాను స్వయంగా రూపకల్పన చేసిన హెయిర్‌స్టైల్స్‌ను పరిచయం చేయనుంది. వీడియో జాకీలు వాణి, గేలిన్‌లతో కలసి ఆలియా తన స్టైలిస్ట్ అవతారాన్ని ప్రదర్శించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement