'Bigg Boss 2 OTT': Actress Pooja Bhatt About Her Divorce - Sakshi
Sakshi News home page

Pooja Bhatt: భర్తని తలుచుకుని నటి ఎమోషనల్.. తప్పంతా తనదేనని!

Published Tue, Aug 1 2023 1:14 PM | Last Updated on Wed, Sep 6 2023 10:17 AM

Actress Pooja Bhatt Her Divorce Bigg Boss 2 OTT - Sakshi

ఈ మధ‍్య కాలంలో విడాకులు అనే పదం మరీ ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా నటీనటులు చాలామంది ఏళ్లుగా ఉన్న బంధానికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. భర్త నుంచి డివోర్స్ తీసుకుంటున్నారు. ప్రముఖ నటి కమ్ డైరెక్టర్ అయిన పూజాభట్ కూడా తొమ్మిదేళ్ల క్రితమే విడాకులు తీసుకుంది. కానీ అప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడుతోంది. ఆ సమయంలో ప్రాణం పోయినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'మా' ‍ప్రెసిడెండ్ మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం?)

తప్పంతా నాదే!
'నా భర్త చెడ్డవాడు ఏం కాదు. అయితే నేను జీవితాన్ని నాకు నచ్చినట్లు బతకాలనుకున్నాను. నన్ను నేను మోసం చేసుకుంటూ ఎన్నాళ్లని ఉంటాను అనిపించింది. నేను ముఖ్యమా? విడాకులు ముఖ్యమా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు డివోర్స్ వైపు మొగ్గు చూపాను. అదంతా సడన్‌గా జరిగిపోయింది. అయితే ఆయనకు విడాకులు ఇచ్చినపప‍్పుడు నాకేతే ప్రాణం పోయినట్లు అనిపించింది. అలా మద్యానికి బానిసయ్యాను. అది నా జీవితంలో అత్యంత దారుణమైన దశ' అని నటి పూజా భట్ చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌లో
గత నెల నుంచి మొదలైన బిగ్ బాస్ హిందీ ఓటీటీ రెండో సీజన్‪‌లో పూజా భట్.. ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన విషయాల్ని ఒక్కొక్కటిగా చెబుతోంది. తను మద్యానికి బానిస కావడం, పిల్లలు లేకపోవడానికి గల కారణాల్ని గత నెలలో ఓ టాస్క్ సందర్భంగా బయటపెట్టింది. తాజాగా మరోసారి తన భర్త గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఇదిలా ఉండగా వీడియో జాకీ మనీష్ మఖిని 2003లో పూజా భట్ పెళ్లి చేసుకుంది. ఇది జరిగిన 11 ఏళ్ల తర్వాత అంటే 2014లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

(ఇదీ చదవండి: సెట్‌లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement