
బాలీవుడ్ పాపులర్ జోడీ గోవింద, సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 37ఏళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని, విడాకులు తీసుకోనున్నారని కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తాజాగా ఈ విషయంపై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు.
తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో గోవిందాకు విడాకుల ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజుల నుంచి తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన మేనేజర్ ఇలా చెప్పాడు. 'ఫ్యామిలీలో కొంతమంది చేసిన కామెంట్ల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు నిజమే. అయితే, విడాకులు తీసుకునేంత పెద్దవి మాత్రం కాదు. ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే.. అవి వారిద్దరే పరిష్కరించుకుంటారు.' అని ఆయన పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం గోవిందా సతీమణి సునీత అహుజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవింద, తాను వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. ఆపై తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నామని చెప్పడంతో విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. వచ్చే జన్మ ఉంటే ఆయనకు భార్యగా ఉండాలని కోరుకోవడం లేదని ఆమె చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పనికే అంకితం చేశారని ఆమె అన్నారు. గోవింద, సునీతలకు 1987లో వివాహం అయింది. వీరికి టీనా అహుజా, యశోవర్ధన్ అహుజా పిల్లలు ఉన్నారు. 37 ఏళ్ల తర్వాత వారిద్దరు విడిపోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment