Govindha
-
ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే: గోవిందా మేనేజర్
బాలీవుడ్ పాపులర్ జోడీ గోవింద, సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 37ఏళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని, విడాకులు తీసుకోనున్నారని కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తాజాగా ఈ విషయంపై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు.తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో గోవిందాకు విడాకుల ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజుల నుంచి తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన మేనేజర్ ఇలా చెప్పాడు. 'ఫ్యామిలీలో కొంతమంది చేసిన కామెంట్ల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు నిజమే. అయితే, విడాకులు తీసుకునేంత పెద్దవి మాత్రం కాదు. ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే.. అవి వారిద్దరే పరిష్కరించుకుంటారు.' అని ఆయన పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం గోవిందా సతీమణి సునీత అహుజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవింద, తాను వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. ఆపై తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నామని చెప్పడంతో విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. వచ్చే జన్మ ఉంటే ఆయనకు భార్యగా ఉండాలని కోరుకోవడం లేదని ఆమె చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పనికే అంకితం చేశారని ఆమె అన్నారు. గోవింద, సునీతలకు 1987లో వివాహం అయింది. వీరికి టీనా అహుజా, యశోవర్ధన్ అహుజా పిల్లలు ఉన్నారు. 37 ఏళ్ల తర్వాత వారిద్దరు విడిపోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ?
ముంబై: ఊహించిందే నిజమైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం శివసేన కార్యలయంలో సీఎం షిడే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉద్దవ్ వర్గం శివసేన నుంచి అమోల్ కిర్తికర్ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండేతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. దీంతో సీనియర్ నటుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ గోవిందా షేండే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ.. మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. "దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత రాజకీయాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతగా మారిందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో పని చేస్తానని పేరారు. #WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO — ANI (@ANI) March 28, 2024 మరోవైపు గోవిందా షిండే పార్టీలో చేరడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ స్పందించారు. అతనే ప్రముఖ నటుడు కాదని. ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఉన్న నటుడిని తీసుసుకొని ఉంటే బాగుండేదన్నారు. ‘నాకు తెలిసి షిండే సినిమాలు చూడరేమో.. ఒకవేళ చూస్తుంటే.. అతనికి ఎవరూ మంచి నటుడే తెలిసి ఉండేంది’ అని అన్నారు #WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV — ANI (@ANI) March 28, 2024 ఇదిలా ఉండగా గతంలోనూ గోవిందా రాజకీయాల్లో ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి.. బీజేపీ సీనియర్ నేత రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
రైట్ రైట్... మహాభారతం
కౌరవులు, పాండవులు, ధర్మరాజు ధర్మాలు, దుర్యోధనుడి దురాగతాలు, శకుని కుట్రలు, కృష్ణుడి మాయలు, కర్ణుడి దానగుణం, అర్జునుడి పరాక్రమం, కురుక్షేత్ర రణరంగం... ‘మహాభారతం’ గురించి చెబుతున్నామన్న విషయం గ్రహించే ఉంటారు. సోనమ్ కపూర్‌కి ‘మహాభారతం’ అంటే ఇష్టం. అందుకే మహాభారతాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించాలనుకున్నారు. ‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా సింగపూర్ బేస్డ్ రైటర్ కృష్ణ ఉదయశంకర్ ఓ నవల రాశారు. ఇందులో ‘గోవిందా, కౌరవ, కురుక్షేత్ర’ అనే త్రీ పార్ట్స్ ఉన్నాయి. ఇందులోని ఫస్ట్ పార్ట్ ‘గోవిందా’ రైట్స్‌ను సోనమ్ కపూర్ కొన్నారు. ‘‘నేను ఏ క్యారెక్టర్ చేయబోతున్నానన్నది ప్రజెంట్ సస్పెన్స్. మహాభారతం గొప్ప పురాణ చరిత్ర’’ అని పేర్కొన్నారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. సోనమ్ ఇది వరకే అనూజా చౌహాన్ రాసిన ‘బాటిల్ ఫర్ బిట్టోర’, ‘జోయా ఫ్యాక్టర్’ బుక్స్ ఆధారంగా సినిమాలు చేయాలనుకున్నారు. మరి..‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? ఈ బుక్స్ బేస్డ్ మూవీస్ ప్రారంభమయ్యేది ఎప్పుడు? -
విలన్‌గా గోవిందా..
బాలీవుడ్ కామెడీ కింగ్ గోవిందా తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘కిల్ దిల్’లో కరడుగట్టిన దుష్టపాత్ర ధరించనున్నాడు. విలన్ పాత్ర పోషించడంపై ప్రశ్నిస్తే, యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ రూపొందించిన సినిమాల్లో విలన్ పాత్రలు సైతం హీరో స్థాయిలో ఉంటాయిని, అందుకే ఈ పాత్రకు అంగీకరించానని గోవిందా చెబుతున్నాడు. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలీ జఫర్, పరిణీతి చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.