శివ‌సేన‌లో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్‌ వెస్ట్‌ నుంచి పోటీ? | Actor Govinda joins Shinde Shiv Sena, May contest from Mumbai North West | Sakshi
Sakshi News home page

శివ‌సేన‌లో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా..ముంబై నార్త్‌ వెస్ట్‌ నుంచి పోటీ?

Published Thu, Mar 28 2024 6:39 PM | Last Updated on Thu, Mar 28 2024 7:09 PM

Actor Govinda joins Shinde Shiv Sena, May contest from Mumbai North West - Sakshi

ముంబై: ఊహించిందే నిజమైంది. బాలీవుడ్ సీనియర్‌ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం శివసేన కార్యలయంలో సీఎం షిడే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ముంబై నార్త్‌ వెస్ట్‌ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉద్దవ్‌ వర్గం శివసేన నుంచి అమోల్‌ కిర్తికర్‌ పోటీ చేస్తున్నారు.

కాగా ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండేతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. దీంతో సీనియర్‌ నటుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ గోవిందా షేండే పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ..  మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. "దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత రాజకీయాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతగా మారిందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో పని చేస్తానని పేరారు.

మరోవైపు గోవిందా షిండే పార్టీలో చేరడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ  నేత జయంత్ పాటిల్ స్పందించారు. అతనే ప్రముఖ నటుడు కాదని. ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఉన్న నటుడిని తీసుసుకొని ఉంటే బాగుండేదన్నారు. ‘నాకు తెలిసి షిండే సినిమాలు చూడరేమో.. ఒకవేళ చూస్తుంటే.. అతనికి ఎవరూ మంచి నటుడే తెలిసి ఉండేంది’ అని అన్నారు

ఇదిలా ఉండగా గతంలోనూ గోవిందా రాజకీయాల్లో ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి.. బీజేపీ సీనియర్‌ నేత రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement