మహారాష్ట్ర సీఎం ఎవరూ.. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. ముఖ్యంగా సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపినప్పటికీ సీఎం పీఠముడి వీడటం లేదు. ఓవైపు సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, గ్యాలరీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
అయితే ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు మహాయుతి నేతలుగవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవలేదు. నిజానికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మంగళవారం వేర్వేరు నగరాల్లో ఉన్నారు.
జ్వరం, గొంతు నొప్పితో శుక్రవారం సాయంత్రం సొంతూరికి వెళ్లిన ఏక్‌నాథ్‌షిండే ఆదివారం సాయంత్రం ముంబైకు రాకుండా థానే వెళ్లారు. శాఖల కేటాయింపుపై మహాయుతి భేటీని రద్దు చేసుకున్నారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో ఉండగా.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.
మరోవైపు నేడు విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయన పేరును ప్రకటించడంలో జాప్యం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి సమయం లేకపోవడంతో రేపు గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ముంబై సమవావేశాలకు షిండే తరుచూ గైర్హాజరు అవ్వడంపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో.. ప్రభుత్వ ఏర్పాటులో తాను అడ్డంకి కాబోనని, ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాపైనే వదిలేశానని షిండే స్పష్టం చేశారు.
ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబర్ అయిదున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాఫ్ట్ర భీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు. సీఎం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరో ఈనెల 4న జరిగే భేటీలో వెల్లడిస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.
ఈ ఉదయం విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది, ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యున్నత పదవికి బిజెపి తన ఎంపికను ప్రకటించడంలో జాప్యం ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment