Devendra Fadanvis
-
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
బాబుకు ఆ ఛాన్సే లేకుండా చేసిన రేవంత్!
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారు. ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి దావోస్ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ అనుభవం 15 నెలలు మాత్రమే. అయినా రేవంత్ తెలంగాణకు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా ఎలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇది ఆసక్తికరమైన పరిశీలన. 👉దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అతి పెద్ద విజయం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 👉దావోస్తోనే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా చూస్తూంటారు. ఈ విషయాన్ని రేవంత్ అంగీకరించకపోయినా జనం దృష్టిలో వారిది బాగా దగ్గరి అనుబంధమే. ఓటుకు నోటు కేసు తర్వాత అది మరింత బలపడిందని భావిస్తూంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు చెప్పే వెళ్లారు. తన తెలివితోపాటు కాలం కలిసి వచ్చి రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబును మరోసారి అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీరిద్దరి మాటలలో ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ప్రశ్న. రేవంత్ చెప్పినదాని ప్రకారం 25 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఒక్క అమెజాన్ సంస్థే రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు వచ్చిన రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోల్చితే తెలంగాణకు వచ్చింది తక్కువే కావచ్చు. కాని అసలు ఒక్క రూపాయి పెట్టుబడి రాని ఏపీతో కనుక పోల్చుకుంటే తెలంగాణ బాగానే సాధించినట్లు ఒప్పుకోవాలి. అందుకే రేవంత్ ధైర్యంగా.. ‘‘ఇది మా ప్రభుత్వ విజయం’’ అని చెప్పుకోగలిగారు. చంద్రబాబు మాత్రం దావోస్ ఒక మిథ్య అంటూ వేదాంతం చెప్పారు. తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం.. తెలియకపోతేనే వేదాంతం అని ఒక కవి వ్యాక్యం. చంద్రబాబు పద్దతికి ఇది సరిపోతుంది. తనకు అనుకూలంగా ఉంటే అంతా బ్రహ్మాండం అని చెబుతారు. తను విఫలం అయితే వేదాంతంతో మాట్లాడి అంతా మిథ్య అని అంటారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మామూలుగా అయితే రేవంత్ మండి పడాలి. కాని ఎంతైనా గురువు కదా! దానిపై నేరుగా స్పందించలేదు. కాకపోతే పెట్టుబడులే కాకుండా.. ప్రపంచం పోకడ తెలుసుకోవడానికి కూడా దావోస్ వెళతామని రేవంత్ అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లను తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నవి కూడా ఉత్తుత్తి అగ్రిమెంట్లుగా కనిపించాలి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ సదస్సుకు వెళ్లి సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం దేశంలోని పారిశ్రామికవేత్తలతో అక్కడకు వెళ్లి పెట్టుబడులు తెచ్చామంటే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఈసారి చంద్రబాబు వెళ్లి ఆ మేరకైనా దేశీయ కంపెనీలతో కూడా అవగాహన కుదుర్చుకోలేకపోవడం పెద్ద వైఫల్యం. అందువల్లే రేవంత్ తమ ప్రగతిశీల విధానాల వల్లే పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. అయితే.. చంద్రబాబుకు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు,మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి అభివృద్ది విధానాలు కాకుండా, రెడ్ బుక్ పాలసీని అమలు చేస్తుండడం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. దానికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై తప్పుడు కేసు పెట్టడానికి ఒక మోసకారి నటిని ఉపయోగించుకున్న వైనం కూడా ఏపీకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. జిందాల్‌ను కూటమి ప్రభుత్వం తరిమేసిందని వార్తలు వచ్చాయి. ఆయన వెళ్లి మహారాష్ట్రలో రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇటు.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే తెలంగాణలో ఉండే మెఘా కంపెనీ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దావోస్‌లో ఒప్పందం అవడాన్ని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. దానికి రేవంత్ సమాధానం ఇస్తూ పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్కు అక్కసని ధ్వజమెత్తారు. అమీర్పేట్లోనే ఒప్పందం చేసుకోవాలా? అని మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వంతో దావోస్‌లో అగ్రిమెంట్ చేసుకుంటే ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అపోహలు సృష్టించే యత్నం చేశారని, ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు జరిగాయని రేవంత్ అన్నారు. ఈ-ఫార్ములా రేస్ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారని ఆయన బీఆర్ఎస్పై ఆరోపించారు. నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ.. ఇలాంటి ఆరోపణలవల్లే దెబ్బతింటుందని రేవంత్ గుర్తించాలి. అచ్చం చంద్రబాబు భాషలో కాకుండా రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఉన్న విశాఖ, రాయలసీమ ప్రాంతాలను పక్కనబెట్టి మూడు పంటలు పండే, వరద ముంపు అవకాశం ఉన్న భూములలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇందు కోసం వేల కోట్ల వ్యయం చేస్తున్నారు. దాని వల్ల కూడా ఏపీకి నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించకుండా ఎంతసేపు ఏపీ పేద రాష్ట్రం అయిపోయిందని, ఐదేళ్లుగా ఏదో జరిగిపోయిందని అంతర్జాతీయంగా కూడా అసత్యాలు ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు వస్తారన్నది చాలా మంది ప్రశ్నగా ఉంది. ఇక.. ఏపీలో స్థానిక కంపెనీలు కూడా ఎవరూ పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దావోస్ వెళ్లి లోకేష్‌ను కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పిందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చినట్లు కనిపించ లేదు. చంద్రబాబు, లోకేష్‌ల దావోస్ పర్యటనకు ముందు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళుతున్నారని వార్తలు రాసిన ఎల్లో జాకీ మీడియా, టూర్ ముగిశాక పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వెళ్లారని మాట మార్చేసింది. పైగా ఏపీ బ్రాండ్ అంటూ కహానీలు ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాని ఆయన కూడా ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ నెలకొల్పడానికి హామీ ఇవ్వలేదట. పదేళ్ల క్రితమే చంద్రబాబు దాని గురించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు 1995 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు దావోస్వెళ్లి వచ్చారు. ఆ సందర్భాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని చెప్పేవారు. కాని ఈసారి పెట్టుబడి రాకపోవడంతో అదంతా ‘మిథ్య’ అని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక విషయం చెప్పారు. మహారాష్ట్రకు ముంబై ఉండవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారట. మరి చంద్రబాబును చూసి పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఫడ్నవీస్ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా తీసుకు వెళ్లగలిగారు? ఏది ఏమైనా చంద్రబాబువి కబుర్లు అయితే.. ఫడ్నవీస్, రేవంత్ లు పెట్టుబడులు తెచ్చుకున్నారన్నమాట. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకున్నా, దావోస్ వెళితే పరిశ్రమలు వస్తాయనుకోవడం మిథ్య అని చంద్రబాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారా?.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
ప్రతిపక్షాలకు రాజ్యాంగంపై విశ్వాసం లేదు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నాగ్‌పూర్: ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగంపై నమ్మకం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ, డిసెంబర్ 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల కోసం ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా నా జన్మభూమి, కర్మభూమికి (స్వస్థలం, పార్టీ కార్యాలయం) రావడం చాలా సంతోషకరమైన క్షణం. నాగ్‌పూర్ నా కుటుంబం, నా కుటుంబం నేడు నాకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని మహాయుతి (కూటమి) పేదలు, గిరిజనులు, రైతులు, దళితులు, ఓబీసీలు ఇతరుల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా మహిళలు, లడ్కా, షెత్కారీ (రైతులు), లడ్కే , ధంగార్లు, మరాఠాలు, ఇతరులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వంపై నమ్మకముంచినందువల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. మహాయుతిని ఆశీర్వదించి, నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు 14 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు తమకు సేవ చేసేందుకు, వారి జీవితాలను, మహారాష్ట్రను మార్చేందుకు మహాయుతిని ఎంచుకున్నారు. ప్రజల కలను నెరవేర్చేందుకు నేను, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి పనిచేస్తాం. ‘ఈ ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ నిబద్ధతతో పనిచేస్తుంది’అన్నారు. నిరాశతోనే ప్రేలాపనలు.. ఈవీఎంల వ్యవహారంపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడం పట్ల ఫడ్నవీస్‌ను ప్రశి్నంచగా, ‘‘ఈ వ్యక్తులు (ప్రత్యర్థులు) నిరాశ చెందారు, వారికి ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్‌పై విశ్వాసం లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌పై నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విశ్వసించరు. ’అని మండిపడ్డారు. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించి మహాయుతి కూటమి విజయం సాధించడంతో డిసెంబర్ 5న ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు ‘భూమిపుత్రుడికి’ స్వాగతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన తరువాత సీఎంగా నాగ్‌పూర్‌కు చేరుకున్న ఫడ్నవీస్‌కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ధరంపేట్‌లోని ఫడ్నవీస్ నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫడ్నవీస్ తన భార్య అమృతా ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతరులతో కలిసి అలంకరించబడిన ఓపెన్–టాప్ వాహనంలో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగే దారి పొడవునా ‘మట్టి కుమారుడికి స్వాగతం’ పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. ఈసందర్భంగా ఫడ్నవీస్ తన మద్దతుదారులను ఉద్దేశించి ’ఏక్ హై తో సేఫ్ హై’, ’మోడీ హై తో ముమ్కిన్ హై’ నినాదాలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ -
మహారాష్ట్రలో కొలువుదీరనున్న కేబినెట్.. శివసేన నుంచి ముగ్గరు ఔట్!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్లో స్థానం లేనట్టుగా సమాచారం.మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
సర్కారు ఓకే : మరి 26 ఏళ్లుగా నిలిచిపోయిన భర్తీల మాటేంటి?
దాదర్: ప్రమాణస్వీకారం తంతు పూర్తికావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్, మంత్రాలయలోని తమ తమ క్యాబిన్లలో ఆసీనులయ్యేందుకు సిద్ధమైతున్నారు. ఇందుకోసం మంత్రాలయ సామాన్య పరిపాలన విభాగం ఆయా శాఖల మంత్రుల క్యాబిన్లను సిద్ధంగా ఉంచింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అంటెండర్లు, బంట్రోతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సామాన్య పరిపాలన విభాగంలో కేవలం 30 మంది పర్మినెంట్ అటెండర్లు ఉన్నారు. కొరతను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో శ్రేణి ఉద్యోగులను భర్తీ కోసం తరుచూ ప్రతిపాదనలు అందుతున్నప్పటికీ సామాన్య పరిపాలన విభాగం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది. 1998కి ముందు 120 మంది... ఈ నెల 15వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేప ట్టే అవకాశాలున్నాయి. ఆ తరువాత నాగ్‌పూర్ లో 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ప్రత్యేక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుసహా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులందరూ మంత్రాలయలో విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటెండర్లు, బంట్రోతుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 1998 ముందు సామాన్య పరిపాలన విభాగంలో 120 మంది అటెండర్లు, బంట్రోతులు, సిపాయిలు ఉండేవారు. ఎవరైనా పదవీ విమరణ చేస్తే వారి స్థానంలో ఇతరులను నియమించడం, పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తిచేసేవారు. కాని 1998 తరువాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పదోన్నతులు నిలిపివేయడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక మంది పదవీ విరమణ చేయడం, సిపాయి పోస్టులను రద్దు చేయడంతో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్టు అంతాకలిపి 40 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. వీరిని సామాన్య పరిపాలన విభాగం వివిధ శాఖలకు కేటాయించింది. ఇప్పుడైనా ఆమోదం లభించేనా? ముఖ్యంగా సామాన్య పరిపాలన విభాగం ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కా ముఖ్యమంత్రికి ఇద్దరు సూపర్వైజర్లు, ఒక బంట్రోతు, ఉప ముఖ్యమంత్రులకు ఒక సూపర్వైజర్, ఒక బంట్రోతు చొప్పున, క్యాబినెట్‌లోని మంత్రులందరికి ఒక బంట్రోతు, ఒక అటెండర్ చొప్పున సామాన్య పరిపాలన విభాగం కేటాయిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉభయ సభల్లో అధికార పార్టీకి 8 మంది, ప్రతిపక్ష పార్టీకి 8 మంది ఇలా 16 మంది అటెండర్లను సామాన్య పరిపాలన విభాగం సమకూర్చి ఇస్తుంది. కానీ గత 26 ఏళ్లుగా భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, పదోన్నతులు నిలిపివేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొనసాగిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఆరేడుగురు మంత్రులు అటెండర్లు, బంట్రోతులు లేకుండానే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వం ఇప్పుడైనా భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుందని మంత్రాలయ సిబ్బంది భావిస్తున్నారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. షిండేకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!
ఢిల్లీ: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. మహాయుతి కూటమి ప్రభుత్వంలో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శివసేన ఆశిస్తున్నట్టు హోంశాఖ వారికి దక్కే చాన్స్ లేనట్టు కీలక నేత ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు.మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో మంత్రి విస్తరణ కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై అమిత్ షా, నడ్డాతో ఫడ్నవీస్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 14 నాటికి విస్తరణ జరగనుంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీఎం పదవితో సహా 21 నుండి 22 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్లో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఖాళీగా ఉంచవచ్చని ఆయన చెప్పారు.ఇదే సమయంలో సదరు కీలక నేత మరో బాంబు పేల్చారు. మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేనకు వారు కోరుకున్నట్లు హోం శాఖ దక్కే అవకాశం లేదన్నారు. అలాగే, మరో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా శివసేనకు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ఇక, చివరకు శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు. దీంతో, శివసేన నేతల్లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ మహాయుతి కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.#MaharashtraGovtFormation | Maharashtra Chief Minister Devendra Fadnavis met Home Minister Amit Shah, Deputy Chief Minister Eknath Shinde skips meeting as per sources; talks likely on portfolio allocation pic.twitter.com/g9aM3hXP2x— NDTV (@ndtv) December 12, 2024ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజుల అనంతరం వివిధ నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
మహారాష్ట్రలో ట్విస్ట్.. శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యల అర్థమేంటి?
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్రలో 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11-16 మధ్య క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. శివసేన నేతలకు కీలక శాఖలు వచ్చే అవకాశం ఉంది. మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని మాజీ సీఎం ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే భరత్.. షిండేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.ఇక, గత మహాయుతి ప్రభుత్వంలో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు కూటమిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో శివసేన ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా శిందే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, బీజేపీ హోంశాఖను నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే, గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. -
నేను అడిగాకే.. డిప్యూటీ సీఎంగా షిండే ఒప్పుకున్నారు: ఫడ్నవీస్
ముంబై: తాను అడిగితేనే శివసేన అధినేత ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండటానికి అంగీకరించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే షిండేతో భేటీ అయ్యానని, అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఓ జాతీయ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఫడ్నవీస్ ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ‘అయితే షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని, కూటమి సజావుగా సాగేందుకు సమన్వయ కమిటీకి నేతృత్వం వహించాలని శివసేనలోని ఒక వర్గం భావించింది. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు కోరుకునేవారు. కానీ, మా మనసులో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా షిండేతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఆయనను కలిసిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించారు’ అని తెలిపారు.అయితే గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు షిండే అంగీకరించడంతో ఆ ఊహాగానాలకు చెక్ పడింది. -
అమృత ఫడ్నవీస్ : ఆయనతో పెళ్లంటే మొదట్లో భయపడింది, కానీ
తెలుగు పంచాంగం ప్రకారం రోజులో కొంత సమయాన్ని ‘అమృత ఘడియలు’ అంటారు.కొందరికి మాత్రం ఆత్మీయులు దగ్గర ఉంటే ఎప్పుడూ అమృత ఘడియలే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు అమృత భార్య మాత్రమే కాదు... ఆత్మీయ నేస్తం. ప్రముఖ రాజకీయ నాయకుడి భార్యగానే కాదు...‘మల్టీ టాలెంటెడ్ స్టార్’గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది అమృత ఫడ్నవీస్... ‘మీరు ఎప్పుడూ ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు తెలుసు’ అంటారు సన్నిహితులు దేవేంద్ర ఫడ్నవీస్‌తో సరదాగా. ఆ రహస్యంలో ‘అమృత’ పేరు దాగి ఉంది. దేవేంద్ర భార్య అయిన అమృత మల్టీటాలెంట్కు మారుపేరు. నిత్య ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్. ఫైనాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, స్పోర్ట్స్... పలు రంగాల్లో ప్రతిభ చాటుకున్న అమృత ఫడ్నవీస్ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది.నాగ్‌పూర్‌కు చెందిన అమృత డిగ్రీ వరకు అక్కడే చదువుకుంది. పుణేలో ఎంబీఏ చేసింది. యాక్సిస్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా ఆమె ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అమృతకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. తన గానంతో శ్రోతల ప్రశంసలు అందుకునేది. ప్రకాష్ ఝా సినిమా ‘జై గంగా జల్’లో ఒక పాట కూడా పాడింది. సామాజిక సందేశంతో కూడిన పాటలను రూపొందించడంలో ముందు ఉండే అమృత నది కాలుష్యం నుంచి గృహహింస వరకు ఎన్నో అంశాలపై పాటలు ఆలపించింది. స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాటలు రూపొందించింది. ఆపదలో ఉన్న ప్రజలు, అణగారిన వర్గాల పిల్లల సహాయం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.అమృత ప్రతిభలో పాటే కాదు ఆట కూడా ఉంది. స్టేట్–లెవెల్ టెన్నిస్ ప్లేయర్‌గా అండర్–16 టోర్నమెంట్స్‌లో ఆడింది. ‘సోషల్ మీడియా స్టార్’గా కూడా బాగా పాపులర్ అయిన అమృతకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆమె ఇన్స్పైరింగ్ పోస్ట్‌లకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కెరీర్, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న అమృత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అక్షరాలా ఆత్మీయ బలం.పెళ్లికి మొదట్లో భయపడింది!దేవేంద్ర–అమృత వివాహం ప్రేమ వివాహం అనుకుంటారు చాలా మంది. కాని వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమృత తండ్రి శరద్ రానడే, తల్లి చారులత... ఇద్దరూ వైద్యులే. అయితే తమలాగే కూతురు కూడా డాక్టర్ కావాలని వారు అనుకోలేదు. కుమార్తెకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇక పెళ్లి విషయానికి వస్తే... పెళ్లికి ముందు దేవేంద్ర, అమృత ఒకరికొకరు అపరిచితులు. వీరిని ఒక కామన్ ఫ్రెండ్ శైలేష్ జోగ్లేక్ ఇంట్లో పెళ్లి కోసం తీసుకువచ్చారు పెద్దలు. అప్పటికే దేవేంద్ర శాసనసభ్యుడు అయ్యాడు.‘రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవడం గురించి మొదట్లో భయపడ్డాను. అయితే ఆయన నిరాడంబర వ్యక్తిత్వంతో నాలో భయం ఎగిరిపోయింది. నా అభిప్రాయం మారిపోయింది’ అని భర్త దేవేంద్ర గురించి చెబుతుంది అమృత.చాలామంది రాజకీయనాయకులలాగే దేవేంద్ర కూడా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన సరదాగా ఉండేలా, అదేపనిగా నవ్వేలా చేయడం అంటే ఆషామాషీ కాదు. అయిననూ... శ్రీమతి అమృత భర్త దేవేంద్రను నవ్విస్తూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పెదాలపై కనిపించే నవ్వు... అమృత సంతకం! -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. ‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. -
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం
-
ఫలించిన బీజేపీ ప్లాన్.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. ఈ కార్యక్రమానికి.. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
-
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్షం బుధవారం ముంబైలో సమావేశమై ఆయన్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పేరు ఖరారైంది. ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడంపై ఏ విషయమూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. డిప్యూటీగా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఫడ్నవీస్ ఆయన్ను కోరారు. బీజేపీ అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వారికి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఫడ్నవీస్‌ను ప్రతిపాదిస్తున్నా: షిండేఅనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలో షిండే, అజిత్ సహా మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఎన్నికైనట్లు లేఖ అందజేశారు. కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహా్వనించారు. గురువారం సాయంత్ర 5.30కు ఆజాద్ మైదాన్‌లో కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ‘‘సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు’’ అని తెలిపాయి. అనంతరం షిండే, అజిత్‌లతో కలిసి ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా కొత్త ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయి. కలిసుంటే క్షేమంగా ఉంటాం. ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమే. సీఎం పదవి కేవలం సాంకేతిక సర్దుబాటే. మహాయుతి పక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి. షిండే, అజిత్ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తాం’’ అన్నారు. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రెండున్నరేళ్లపాటు సీఎంగా చేశానని, అందుకు సంతృప్తిగా ఉన్నానని షిండే పేర్కొన్నారు. ‘‘నాడు నన్ను సీఎం పదవికి ఫడ్నవీస్ ప్రతిపాదించారు. నేడు ఆయనను ఆ పదవికి నేను ప్రతిపాదిస్తున్నా. మేమంతా బృందంగా కలిసికట్టుగా పని చేస్తాం’’ అన్నారు.పరస్పర ఛలోక్తులు మీడియా భేటీలో మహాయుతి నేతలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా సాయంత్రం దాకా వేచి చూడండని షిండే బదులిచ్చారు. అజిత్ కల్పించుకుని తాను మాత్రం కచ్చితంగా ప్రమా ణం చేస్తానని అనడంతో గొల్లుమన్నారు. ‘‘అవునవును. ప్రమాణ స్వీకారాల్లో దాదా (అజిత్)కు చాలా అనుభవముంది. ఉదయం, సాయంత్రం ప్ర మాణం చేసిన అనుభవముంది’’ అనడంతో మరో సారి నవ్వు లు విరిశాయి. 2019లో అజిత్ తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. పదవి తీసుకోండి షిండేపై సొంత ఎమ్మెల్యేల ఒత్తిడి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటూ షిండేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు. బుధవారం షిండేతో భేటీలో వారు స్పష్టం చేశారు. ఫడ్నవీస్ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టును షిండే తీసుకుంటే పొత్తు ధర్మాన్ని గౌరవించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో చేరితే పార్టీనీ బలోపేతం చేసుకోవచ్చన్నారు. -
బీజేపీ ప్లాన్ అదే.. షిండే ముందున్న మార్గమిదే: అథవాలే
ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్ చేశారు.మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. ఏక్నాథ్ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు. #WATCH | Delhi: On the question of Maharashtra CM, Union Minister Ramdas Athawale says, "I believe in the meeting that is going to take place tomorrow, BJP observers will listen to all the MLAs and the name of Devendra Fadnavis can be announced tomorrow...Eknath Shinde does not… pic.twitter.com/52QJ0bMn07— ANI (@ANI) December 3, 2024 -
‘మహా’ కేబినెట్.. షిండే, అజిత్ పవార్ వాటాకు ఎన్ని మంత్రి పదవులంటే?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకబూనిన షిండే.. ఎట్టకేలకు ముంబై చేరుకున్నారు. దీంతో.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక.. బీజేపీ నేతృత్వంలోనే ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. దీనిపై రేపు కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు.మహారాష్ట్ర నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదిక కానుంది. అయితే మహాయుతి కూటమిలో.. ఏ పార్టీ ఎన్ని పోర్టుపోలియోలు ఆశిస్తుందనే అంచనాలతో జాతీయ మీడియా సంస్థలు, అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బీజేపీ(132 సంఖ్యా బలం) : ముఖ్యమంత్రితో పాటు హోం,రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్,శాసనమండలి చైర్మన్ పదవులను కూడా ఆశిస్తోంది. శివసేన(57): ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. తమకు 16 మంత్రిత్వ శాఖలను కేటాయించాలని పట్టుబడుతోందంట. వాటిల్లో పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి బీజేపీ ఓకే చెబుతుందో చూడాలి. మరోవైపు.. గత అసెంబ్లీలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన చేతుల్లో ఉండగా.. ఈసారి శాసనమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.ఎన్సీపీ(41): అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం.. తాము సీఎం సీటును త్యాగం చేశామనే ప్రకటనలు ఇచ్చుకుంది. వాటి ఆధారంగా కీలక శాఖలనే కోరే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌తో సహా 9 నుంచి 10 మంత్రిత్వ శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బుధవారమైనా తేలుస్తారా?ఆరు రోజులుగా మహారాష్ట్ర సీఎం పంచాయితీ ఎడతెగకుండా నడుస్తోంది. అయితే.. మహాయుతిలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాకు మరోసారి ఓకే అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. వీటిపై బుధవారం ఉదయం స్పష్టత రానుంది. ఎందుకంటే.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారన్నది ఆ కథనాల సారాంశం.ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారంమహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మహాయుతి కూటమి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
మహరాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా షిండే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. -
సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు
మహారాష్ట్ర సీఎం ఎవరూ.. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. ముఖ్యంగా సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపినప్పటికీ సీఎం పీఠముడి వీడటం లేదు. ఓవైపు సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, గ్యాలరీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు మహాయుతి నేతలుగవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవలేదు. నిజానికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మంగళవారం వేర్వేరు నగరాల్లో ఉన్నారు.జ్వరం, గొంతు నొప్పితో శుక్రవారం సాయంత్రం సొంతూరికి వెళ్లిన ఏక్‌నాథ్‌షిండే ఆదివారం సాయంత్రం ముంబైకు రాకుండా థానే వెళ్లారు. శాఖల కేటాయింపుపై మహాయుతి భేటీని రద్దు చేసుకున్నారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో ఉండగా.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.మరోవైపు నేడు విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయన పేరును ప్రకటించడంలో జాప్యం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి సమయం లేకపోవడంతో రేపు గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ముంబై సమవావేశాలకు షిండే తరుచూ గైర్హాజరు అవ్వడంపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో.. ప్రభుత్వ ఏర్పాటులో తాను అడ్డంకి కాబోనని, ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాపైనే వదిలేశానని షిండే స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబర్ అయిదున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాఫ్ట్ర భీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు. సీఎం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరో ఈనెల 4న జరిగే భేటీలో వెల్లడిస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.ఈ ఉదయం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది, ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యున్నత పదవికి బిజెపి తన ఎంపికను ప్రకటించడంలో జాప్యం ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా!
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధిలో కొందరు అభ్యర్ధులు మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి విజయ దుందుభి మోగించారు. కొందరు హ్యాట్రిక్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచారు. మరికొందరు ఓటమనేదే లేకుండా వరుసగా విజయం సాధిస్తూ రికార్డులు సృష్టించారు. వీరిలో కొందరు ఐదు, ఆరు సార్లు విజయం సాధించగా ఒకరైతే ఏకంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సష్టించారు. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల ఆదరణతో అనేక పర్యాయాలు గెలుస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలెవరు, ప్రజల్లో వారికున్న క్రేజ్, ఆదరణ ఎలాంటిదో ఓసారి పరిశీలిద్దాం. వడాలాలో కాలీదాస్ విజయఢంకా... బీజేపీ నేత కాలీదాస్ కోళంబ్కర్ వడాల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా తొమ్మిదిసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 72 ఏళ్ల కాలీదాస్ తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈసారి గెలిస్తే తన పేరు గిన్నిస్‌బుక్‌లో నమోదవుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆ నియోజక వర్గ ప్రజలు భారీగా ఓట్లువేసి ఆయన్ను గెలిపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన స్నేహల్ జాధవ్, శివసేన(యూబీటీ) అభ్యర్థి శ్రద్ధా జాధవ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాలీదాస్ 24 వేల ఓట్ల అధిక్యంతో గెలిచారు. ఈ సారి కాలీదాస్ను ఎలాగైనా ఓడించాలని ఇరువురు అభ్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కాలీదాస్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. 2009, 2014లో కాంగ్రెస్ టిక్కెటుపై ఇదే వడాలా నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయ ఢంకా మోగించారు. మలబార్హిల్లో ఏడోసారి మంగల్ ప్రభాత్ లోధా జయకేతనం మలబార్ హిల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మంగళ్‌ప్రభాత్ లోధా ఏడో సారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన లోధా తన ప్రత్యర్థి, శివసేన(యూబీటీ)అభ్యర్ధి భేరులాల్ చౌధరీపై 6,8091 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాష్ట్రంలో అత్యంత ధనిక అసెంబ్లీ నియోజకవర్గంగా పేరుగాంచిన మలబార్ హిల్‌లో గెలవడం అంత సులువు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసమైన వర్షా బంగ్లాతోపాటు అనేకమంది ఉన్నత వర్గాల నివాసాలు, ధనవంతుల బంగ్లాలుంటాయి. ఇక్కడ సామాన్యులతోపాటు గుజరాతి, జైన్, మార్వాడి వర్గాల ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. లోధా, చౌధరి ఇరువురు జైన్ సమాజానికి చెందినవారు. దీంతో గుజరాతీ, జైన్, మార్వాడి ఓట్లు తమకే దక్కుతాయన్న ఆలోచనతో ఇరువురు ఎన్నికల బరిలోకి దిగారు.లోధాను ఓడించాలని మహావికాస్ ఆఘాడీకి చెందిన బడా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు లోధా విజయకేతనం ఎగురవేశారు. వరుసగా ఐదుసార్లు ఫడ్నవీస్, ఛగన్ భుజబల్ విజయదుందుభి...‘నేను మళ్లీ వస్తాను’అంటూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దక్షిణ–పశ్చిమ నాగ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఏకంగా ఆరు సార్లు విజయ కేతనం ఎగురవేశారు. తనకు ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ప్రపుల్ గుడధేను 39,710 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఎన్సీపీ అజీత్ పవార్ వర్గానికి చెందిన ఛగన్ భుజబల్ యేవ్లా అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించారు. తన ప్రత్యర్ధి ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాణిక్‌రావ్ శిందేను 26,400 ఓట్ల అధిక్యంతో భుజబల్ ఓడించారు.నాలుగుసార్లుగా ఏక్నాథ్ శిందే, జితేంద్ర అవ్హాడ్ విజయం.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే 2009 నుంచి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. థానేలోని కోప్రి–పాచ్పాఖాడీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ శివసేన నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండనున్నాయనే అంశం అందరిలోనూ ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలో తన పంథాను కొనసాగిస్తూ శివసేన(శిందే) అభ్యర్ధి కేదార్ దిఘేపై ఘన విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించినట్లైంది. ముంబై ఉప నగరమైన ముంబ్రా–కల్వా అసెంబ్లీ నియోజక వర్గంలో గురుశిష్యులు నజీబ్ ముల్లా , జితేంద్ర అవ్హాడ్ మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. చివరకు ఎన్సీపీ (ఎస్పీ)అభ్యర్థి జితేంద్ర అవ్హాడ్‌ను నాలుగోసారి విజయం వరించింది. 2023లో ఎన్సీపీ రెండుగా చీలిపోవడంతో ఎస్పీ వర్గం నుంచి అవ్హాడ్‌కు అభ్యరి్ధత్వం లభించింది. దీంతో ఆగ్రహానికి గురైన నజీబ్ ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఒకేపార్టీకి చెందిన గురు, శిష్యుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ఇక్కడ ముస్లీం ఓటర్ల సంఖ్య అధికం. దీంతో ముల్లా విజయం ఖాయమని భావించారు. కాని గత 15 ఏళ్ల నుంచి అవ్హాడ్ చేసిన అభివద్ధి పనులే ఆయనకు విజయం చేకూర్చాయి. విక్రోలీ, కలీనా, దిండోషీ, శివ్డీల్లో హ్యాట్రిక్ విక్రోలీ అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి, శివసేన(యూబీటీ) అభ్యర్ధి సునీల్ రావుత్ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే . హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ . చివరకు ఓటర్లు శివసేన(శిందే)అభ్యర్థి సువర్ణ కరంజేకు పట్టం కట్టారు. కలీనా అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి యూబీటీ అభ్యర్ధి సంజయ్ పోతి్నస్ హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్ధి అయిన బీజేపీ అభ్యర్ధి అమర్జీత్ సింగ్‌ను భారీ అధిక్యంతో ఓడించారు. ఒక్కడ ఎమ్మెన్నెస్, వంచిత్ ఆఘాడీ పార్టీ సహా మొత్తం 16 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ పోత్నీస్ జయకేతనం ఎగరేశారు.దిండోషీ అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన(యూబీటీ)అభ్యర్థి సునీల్ ప్రభు భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్థి శివసేన(శిందే) అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌ను 6,058 ఓట్ల తేడాతో ఓడించారు. శివ్డీ అసెంబ్లీ నియోజక వర్గంలో యూబీటీ అభ్యర్ధి అజయ్ చౌధరి హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ రెబల్ అభ్యర్ధి నానా అంబోలే ఇరువురినీ ఓడించి 7,140 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. బాలా నాంద్గావ్కర్ను గెలిపించేందుకు స్వయంగా రాజ్ ఠాక్రే ప్రత్యేకంగా అక్కడ ఓ సభ నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు ఆయన్ను తిరస్కరించారు.న్యూముంబైలోని బేలాపూర్‌లో బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే, ఎన్సీపీ (ఎస్పీ) వర్గం అభ్యర్ధి సందీప్ నాయిక్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇద్దరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. చివరి రౌండ్ వరకు ఇద్దరూ దాదాపు సమానంగా ఉన్నారు. కానీ చివరి రౌండ్ ముగిసే సరికి కేవలం 377 ఓట్ల తేడాతో మందా మాత్రే విజయం సాధించారు. -
షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది?
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఢిల్లీ పెద్దల దౌత్యంతో.. ఏక్నాథ్ షిండే బెట్టు వీడారనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్‌కు లైన్ క్లియర్ అయ్యాయనే విశ్లేషణలు నడుస్తున్నాయి. మరి సీఎం పదవి వదులుకునే విషయంలో షిండే నిజంగానే హ్యాపీగా ఉన్నారా?. శివసేన అందుకు ఒప్పుకుంటోందా?.. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచి మూడు రోజులవుతుంది. కానీ ఇంతవరకు సీఎం ఎవరనేది బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎటూ తేల్చలేకపోతున్నాయి. ఈ తరుణంలో 14వ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా గవర్నర్‌కు సమర్పించారు. ఆపద్ధర్మ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయనే కొనసాగుతారు. ఇక.. ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలని బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో.. సీఎం సీటు ఎవరికి అనే దానిపై బలనిరూపణ చేయాలంటూ షిండే వర్గం కొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. అయితే ఆ వాదన అసంబద్ధమని తన వర్గీయులను షిండే వారించినట్లు సమాచారం. ‘‘మహాయుతి కూటమి గొప్ప విజయం తర్వాత రాష్ట్రంలో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడనుంది. మహాకూటమిగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం.నేటికీ కలిసి ఉన్నాం. నాపై ప్రేమతో.. అందరూ కలిసి ముంబైకి రావాలి’’ అని తాజాగా ఈ ఉదయం ట్వీట్లో ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. ఈలోపు..महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్చలు మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయానికల్లా ఓ కొలిక్కి రావొచ్చని శివసేన నాయకుడు సంజయ్ శిర్సత్ తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు చర్చిస్తున్నారని. ఇవాళో, రేపో కచ్చితంగా తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే.. ఇదే శిర్సత్.. షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిన్నటిదాకా మీడియా ముందు హడావిడి చేశారు.మహా ల్లో ప్రజాదరణ ఉన్న నేత ఏక్నాథ్ షిండే అని, ఆయన నాయకత్వంలో శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద కూటమి పార్టీగా అవతరించిందని, కాబట్టి ఏక్నాథ్ షిండే సీఎం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీహార్ ఫార్ములా డిమాండ్ లేవనెత్తిన శివసేన నరేష్ కూడా.. ఇప్పుడు షిండే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం గమనార్హం. ఈ లిస్ట్‌లో ఇవాళ షిండే వర్గీయులు చాలామందే చేరారు. దీంతో.. శివసేనలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. షిండే వెనక్కి తగ్గాలి : కేంద్రమంత్రిమహరాష్ట్ర సీఎం ఎవరు? అనే అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ‘‘మహారాష్ట్ర వివాదం త్వరలో ముగియాలి. దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంను చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తిని పోగొట్టాలి. అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది కాబట్టి బీజేపీ అందుకు ఒప్పుకోదు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్లాగా ఏకనాథ్ షిండే కూడా రెండు అడుగులు వెనక్కి వేయాలి. లేదంటే ఫడ్నవీస్ నాలుగు అడుగులు వెనక్కి వేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పని చేయాలి. లేదా ప్రధాని మోదీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలి. ఏక్నాథ్ షిండేతో పాటు ఆయన 57 మంది ఎమ్మెల్యేలు..త్వరగా రాజీ కుదుర్చుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలి’’ అని అన్నారు.ఒక పార్టీ మద్దతుంటే చాలుమహరాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 132 మంది ఎమ్మెల్యేలు, శివసేన 57, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో 288 మంది సభ్యుల అసెంబ్లీలో 145 మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడానికి బీజేపీ మహాయతి కూటమిలోని రెండు మిత్రపక్షాలలో ఒక మిత్ర పక్షం మద్దతుంటే సరిపోతుంది. -
షిండేనే మహారాష్ట్ర సీఎం.. తెరపైకి బీహార్ మోడల్!
ముంబై : మహరాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌నే సీఎంను చేయాలని బీజేపీ భావిస్తుండగా.. ఏక్నాథ్ షిండే అడ్డు పడుతున్నారు. అయితే.. ఫలితాలు వెలువడ్డాక సీఎం రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. ఇప్పుడు ఫడ్నవిస్‌కే మద్దతు ఇవ్వబోతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తునాయి. ఈలోపు.. బీహార్ మోడల్‌ను తెరపైకి తెచ్చారు ఓ ఎంపీ. బీహార్ మోడల్ ప్రకారం.. ఏక్నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మ్హస్కే డిమాండ్ చేస్తున్నారు. . అలా జరిగితే.. తన మిత్ర పక్షాల్ని రాజకీయావలసరాల కోసం వాడుకుని, ఆపై వదిలేస్తుందనే విమర్శలకు బీజేపీ ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని నరేష్ అంటున్నారు. బీహార్ మోడల్ ఏంటంటే..2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 243 స్థానాలకు గానూ.. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 74, జేడీ(యూ) 43 స్థానాలు దక్కించుకుంది. అయితే.. బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. నితీశ్ కుమార్‌ను సీఎంను చేసి పెద్ద త్యాగమే చేసింది. ఆ టైంలో శివసేన పత్రిక సామ్నా ఈ పరిణామంపై సెటైర్లు కూడా వేసింది.2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే సీఎం పదవిని బీజేపీ వదులుకోకపోవడంతో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గం చీలికతో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. షిండేనే బీజేపీ సీఎంను చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే, సీఎం విషయమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం బాధ్యతల్ని అప్పగించేందుకు మొగ్గు చూపుతుంది. అజిత్ పవార్ నేతృత్వరంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. కానీ, శివసేన నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు. ఈ తరుణంలో సోమవారం (నవంబర్ 25న) మహాయుతి కూటమి వర్గం కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే,అజిత్ పవార్లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ పెద్దలు రాత్రికల్లా తేల్చే అవకాశం ఉంది. -
మోదీ వెంటే మహారాష్ట్ర: దేవేంద్ర ఫడ్నవిస్
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్‌నేత దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం(నవంబర్23) మీడియాతో మాట్లాడారు.‘మహాయుతి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు మహారాష్ట్ర అంతా ఒక్కటిగా ఉంది.మహారాష్ట్ర మొత్తం మోదీ వెంట నిలిచింది. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవ లేదు.పరస్పర అంగీకరాంతో సీఎంను ఎన్నుకుంటాం.షిండే శివసేననే అసలు శివసేన అని ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో ఝార్ఖండ్‌లో ఎందుకవవో విపక్షాలే చెప్పాలి’అని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. -
థ్యాంక్యూ అమ్మ.. తల్లితో దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైందిఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోన్ కాల్లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe— TIMES NOW (@TimesNow) November 23, 2024 -
బ్యాగుల తనిఖీ: ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ కౌంటర్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాగులు తనిఖీ చేయటం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సోమవారం యావత్మాల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారలు సోదా చేయటం వివాదం రేపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల లగేజీని ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీ చేస్తారా? అని నిలదీశారు. అయితే దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లను కూడా విమానాశ్రయ అధికారులు అదే విధంగా తనిఖీ చేసిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. కొందరు నాయకులకు ప్రదర్శనలు ఇవ్వడం అలవాటని పేర్కొంది. ‘‘రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకువెళ్లడం మాత్రమే సరిపోదు. రాజ్యాంగ ప్రక్రియలను కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరూ గౌరవ భావాన్ని కలిగి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని బీజేపీ తెలిపింది. ఇక.. నవంబర్ 5న కొల్హాపూర్ విమానాశ్రయంలో ఫడ్నవీస్ బ్యాగ్‌ని అధికారులు తనిఖీ చేశారు.जाऊ द्या, काही नेत्यांना तमाशा करण्याची सवयच असते! हा व्हीडिओ पहा, 7 नोव्हेंबरला यवतमाळ जिल्ह्यात आमचे नेते मा. देवेंद्रजी फडणवीस यांच्या बॅगची तपासणी झाली. पण, त्यांनी ना कोणता व्हीडिओ काढला, ना कोणती आगपाखड केली. तत्पूर्वी, 5 नोव्हेंबर रोजी कोल्हापूर विमानतळावर सुद्धा मा.… pic.twitter.com/ebkuigJE2E— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) November 13, 2024మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే బ్యాగు తనికీ చేయటంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికలవేళ ప్రామాణిక నియమావళి(ఎస్ఓపీ) మేరకే వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లలో తనిఖీలు చేపడుతున్నట్లు ఈసీ వివరించింది. -
బీజేపీ మూడో జాబితా విడుదల.. 146 మంది అభ్యర్థుల ఖరారు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. దీంతోపాటు నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు అభ్యర్థిని కూడా ప్రకటించింది.ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడిగా అనేక సంవత్సరాలు పనిచేసిన సుమిత్ వాంఖడే బరిలోకి దిన్నారు. 2019లోనూ ఫడ్నవీస్ మాజీ పీఏ అభిమన్యు పవార్‌కు అవుసా నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపొందారు.ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ముంబై వెస్ట్‌లోని వెర్సోవా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్, లాతూర్ సిటీ నుంచి అర్చన శైలేష్ పాటిల్ చకుర్కర్, పాల్ఘర్ జిల్లాలోని వాసాయి స్థానం నుంచి స్నేహ దుబే, వాషిమ్‌లోని కరంజా నుంచి సాయి ప్రకాష్ దహకే ఉన్నారు.ఘట్కోపర్ ఈస్ట్ నుంచి పరాగ్ షా, బోరివాలి నుంచి సంజయ్ ఉపాధ్యాయ్‌ను ముంబై నుంచి పోటీకి నిలిపింది. కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై స్థానిక నేత అవినాష్ బ్రహ్మాంకర్ను బీజేపీ బరిలోకి దించింది. అస్తి స్థానం నుంచి సురేష్ ధాస్, మల్షిరాస్ నుంచి సత్పుటే, డెగ్లూర్ నుంచి జితేష్ అంతపుర్కర్, సావ్నర్ నుంచి ఆశిష్ దేశ్ ముఖ్ వంటి ప్రముఖ నేతలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గత వారం విడుదల చేసిన తొలి జాబితాలో అత్యధికంగా 99 మంది అభ్యర్థులున్నారు. శనివారం రెండో జాబితాలో 22 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. తాజా వాటితో కలిపి మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న జార్ఖండ్‌తోపాటు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. -
దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే రహస్య మీట్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు. మాజీ సీఎంలైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.ఏ విషయంపై మాట్లాడుతకున్నారో తెలియలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.అనంతరం ఉద్ధవ్ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఠక్రే సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు 1965లో విడుదలైన జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుఉకోకకుండా తామిద్దరం కలిసినట్లు చెప్పారు.#maharashtraassembly : Uddhav Thackarey and Devendra Fadnavis in same lift. pic.twitter.com/YzgcZAcoJi— Sonu Kanojia (@NNsonukanojia) June 27, 2024 మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్ చాక్లెట్ బార్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు.కాగా ఈ ప్రభుత్వంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల అధికార కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30, ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకుంది. -
సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్..
ముంబై: గురువారం ముంబైలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన సీటులో కూర్చోవడంతో ఆయన నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ మనసులోని మాటను ఈ విధంగానైనా బయట పెట్టారంటున్నారు నెటిజనులు. మహారాష్ట్రలో ఎన్సీపీ తిరుగుబాటు చేసిన నాటినుండి మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతి సీను క్లైమాక్సును తలపిస్తూ సాగుతున్న అక్కడి రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న కుతూహలంతో ఎదురు చూస్తున్నారు రాజకీయ ఔత్సాహికులు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పార్టీలో అధమస్థాయి ప్రాధాన్యతను తట్టుకోలేక తిరుగుబాటు పర్వానికి శ్రీకారం చుట్టి బీజేపీ- శివసేన సర్కారుకు జైకొట్టి అజిత్ పవార్ ఎలాగోలా డిప్యూటీ సీఎం కుర్చీ వరకు చేరుకోగలిగారు. తర్వాతి మెట్టు కోసం అజిత్ పవార్లో కోరిక లేకపోయినప్పటికీ ఆయన చేతల్లో మాత్రం ఆ కుతూహలం బయటపడుతుంటే రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో అజిత్ పవార్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు ఆయన మనసులో ఏముందో గానీ ఆయన ఏమి చేసినా కూడా అది అధికారం కోసమే అన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఉండడడం విశేషం. తాజాగా ఎమ్మెల్యే నివాసాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన నేరుగా వెళ్లి సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అజిత్ రాకను గమనించి స్పీకర్ నర్వేకర్ కుర్చీకి అంటించి ఉన్న సీఎం పేరున్న స్టిక్కరును తొలగించారు. మొదట అజిత్ వేరే కుర్చీలో కూర్చున్నప్పటికీ సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ కుర్చీలో కూర్చోమని పక్కనున్నవారు అజిత్ ను ఆహ్వానించారు. ఇదే వేదికపై ఉన్న మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే ఈ సన్నివేశం జరగడం విశేషం. ఈ వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో మహాజోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఎన్సీపీ వర్గాలు అజిత్ పవార్ నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా -
మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) July 1, 2023 అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?
ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని, ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్‌లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్ థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. देखिए उद्धव जी, आपके पिता वंदनीय बाला साहेब ठाकरे जी का ये वीडियो... सुनिए बाला साहेब जी ने लालू प्रसाद यादव को क्या कहा. ये व्हिडीओ देखकर आप समझ जाएंगे कि आपने बाला साहेब ठाकरे जी के विचारों को कैसे मिट्टी में मिला दिया…@OfficeofUT बाला साहेब की भाषा में कहें तो 'लालू के… pic.twitter.com/a85OzVCi70 — Chitra Kishor Wagh (@ChitraKWagh) June 23, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ!
మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్ధించినందుకు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన సందర్బంగా ఔరంగజేబు చాలా కాలం దేశాన్ని పరిపాలించారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. హిట్లర్ కూడా జర్మనీ దేశాన్ని చాలాకాలం పాలించాడు. అంతమాత్రాన అక్కడివారికి హిట్లర్ దేవుడు అవుతాడా? ఈ సందర్బంగా అంబేద్కర్ చర్యను మీరెలా సమర్ధిస్తారని ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. మీరిద్దరూ పొత్తు పెట్టుకున్న కారణంగానే అసలేం మాట్లాడటం లేదా? అనడిగారు. అసలు పరాయి దేశం నుంచి వచ్చిన ఔరంగజేబు మన నాయకుడెలా అవుతాడు? ఛత్రపతి శివాజీ ఒక్కడే మన నాయకుడని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న ముస్లింలు ఔరంగజేబు వారసులు కారని.. వారసలు ఆ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా అంగీకరించరని అన్నారు. వారు సైతం ఛత్రపతి శివాజీనే తమ నాయకుడిగా చెప్పుకుంటారన్నారు. ఒకప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చెట్లు కలపాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీని శాశ్వతంగా మూసివేస్తానన్న మాటను గుర్తుచేసి మీ తీరు మాత్రం భిన్నంగానూ మీ నాన్న గారికి వ్యతిరేకంగానూ ఉందన్నారు. ఇక బీహార్‌లో ఈ నెలలో జరగనున్న విపక్ష ఐక్య కూటమి సమావేశం గురించి ప్రస్తావించగా పనికిరాని వంద పాదులు ఏకమైనా ఒక మర్రిచెట్టుకు సమానం కావన్నారు. గతంలో మోదీ వ్యతిరేకంగా ఇంతకంటే పెద్ద కూటమే వచ్చింది. అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
సీఎం కొడుకు నుంచి ప్రాణహాని.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై : ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ శిండే నుంచి తనకు ప్రాణానికి హాని ఉందని రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్ ముంబై పోలీసులకు లేఖ రాశారు. తనను చంపమని థానేకు చెందిన నేరస్తుడు రాజా ఠాకూర్‌కు శ్రీకాంత్ శిండే సుపారీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా పోలీసులకు తెలియజేస్తున్నానన్నారు. లేఖను ముంబై పోలీస్ కమిషనర్‌తోపాటు హోంశాఖ మంత్రిగా ఉన్న ఉన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం పంపించారు. దీనిపై మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించాల్సి ఉంది. కానీ.. దురదృష్టవశాత్తు ద్రోహుల వర్గం పట్టించుకోవడం లేదన్నారు. ముంబైలోని మాహింలో ఒక ఎమ్మెల్యే ఫైరింగ్ చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. కాగా సంజయ్ రౌత్ పోలీసులకు రాసిన లేఖపై డిప్యూడీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆరోపణలు చేశారని సంజయ్ రౌత్‌పై విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు. దాని వల్ల తనకు కొంత సానుభూతి వస్తుందని అనుకోవచ్చు. కానీ బూటకపు ఆరోపణలు చేసి సానుభూతి పొందొద్దు.’ అని అన్నారు. అంతేగాక రౌత్‌కు అదనపు రక్షణ కల్పించడంపై ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కొంతమంది నాయకులకు రక్షణ కల్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక నిర్దిష్ట నాయకుడికి రక్షణ కల్పించాలా లేదా పెంచాలా వద్దా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ అధిపతి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ప్యానెల్ రౌత్ లేఖను పరిగణలోకి తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు రౌత్ ఆరోపణలపై ఏక్నాథ్ శిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సాట్ మాట్లాడుతూ.. అవి సానుభూతికోసం ఠాక్రే సేన వేస్తున్న చిల్లర వేషాలని అన్నారు. ఒకవేళ బెదిరింపుపై ఏమాత్రం నిజమున్న సమగ్ర విచారణ జరిపిస్తామని, కానీ శ్రీకాంత్ శిండే అలా చేస్తారని తాను నమ్మనని స్పష్టం చేశారు. -
'మమ్మల్ని వెన్నుపోటు పొడిచినప్పుడే ఉద్ధవ్ తలరాత డిసైడ్ అయ్యింది'
ముంబై: బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్సీపీతో చేతులు కలిపినప్పుడే ఉద్ధవ్ థాక్రే తలరాత ఖరారైందని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిప్పుడు ఆయనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్సీపీతో జతకట్టాలని ఉద్ధవ్ ముందుగానే నిర్ణయించుకున్నారని చెప్పారు. అది అసహజ కూటమి అన్నారు. ఆ రోజు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వడం ఎవరికీ ఇష్టం లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలంతా తననే ముఖ్యమంత్రి కావాలనుకున్నారని, కానీ అలా జరగకపోయేసరికి బాధపడ్డారని తెలిపారు. తాము అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పనిచేస్తున్నామని నిరూపించేందుకే షిండేకు సీఎం బాధ్యతలు అప్పగించామని ఫడ్నవీస్ వివరించారు. బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని ఫడ్నవీస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీ చేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు -
Maharashtra political crisis:...ఇక ముంబై వంతు!
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి రోజుకో మలుపుతో థ్రిల్లర్‌లా పది రోజుల దాకా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొసమెరుపుతో ముగిసింది. శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండేకు అనూహ్యంగా సీఎం కుర్చీ అప్పగించి బీజేపీ తన రాజకీయ చతురత చాటుకుంది. అటు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఇటు సీఎం పదవి ఆశించిన సొంత నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు గమ్మత్తయిన జవాబు చెప్పింది. రాజకీయ పండితులు కూడా కలలోనైనా ఊహించని ట్విస్ట్ ఇది. షిండే తిరుగుబాటు సాయంతో ఉద్ధవ్‌ను కోలుకోలేని దెబ్బ తీసిన బీజేపీ అగ్ర నాయకత్వం, అదే షిండేను రాజును చేయడం ద్వారా రెండోసారి సీఎం పీఠమెక్కుదామనుకున్న ఫడ్నవీస్‌ను దూకుడు కాస్త తగ్గించాలని అన్యాపదేశంగా చెప్పింది. ఒక ఆట ఈ విధంగా ముగిసినా, అసలైన రసవత్త రాజకీయానికి త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వేదిక కానున్నాయి. ఉద్ధవ్ శివసేనకు చావో రేవో కావడంతో పాటు ఆయన రాజకీయ భవితవ్యానికీ పెను పరీక్షగా నిలవనున్నాయి. ప్రతిష్టాత్మకమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అక్టోబర్–నవంబరులో జరగనున్నాయి. షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వీటిని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోదు. బీఎంసీపై పట్టు బిగించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా, నగర పరిషత్ ఎన్నికలూ ఉన్నా బీఎంసీయే కీలకంగా నిలవనుంది. ఉద్ధవ్ శివసేన, షిండే శివసేన రెండింటికీ ఇదే ప్రతిష్టాత్మకం. 1977 నుంచీ బీఎంసీ శివసేన అధీనంలోనే ఉంది. బీఎంసీ తర్వాత థానే, కల్యాణ్–డోంబీవలి మహానగర్ పాలిక రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయి. ఈ రెండింట్లోనూ షిండేకు పూర్తి పట్టుందని చెబుతారు. కనుక ఉద్ధవ్ తన దృష్టినంతా బీఎంసీపైనే కేంద్రీకృతం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఒకరకంగా షిండేపై ప్రతీకారానికి కూడా ఆయనకిది మంచి అవకాశం. అప్పట్లో రాజ్ దెబ్బ... ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన తొలిసారిగా 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగింది. టికెట్ల పంపిణీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఈ సమయంలోనే తన అనుయాయులకు టికెట్లివ్వడానికి నిరాకరించిన ఉద్ధవ్‌తో రాజ్ ఠాక్రే తెగదెంపులు చేసుకుని వేరుకుంపటి పెట్టుకున్నారు. అయినా ఉద్ధవ్ బీఎంసీని ఎలాగోలా చేజిక్కించుకున్నారు. రాజ్ నిష్క్రమణతో బలహీనపడ్డ శివసేన క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. బీజేపీ కూడా బీఎంసీలో తన బలాన్ని పెంచుకుంటూ పోయింది. రాజ్ నేతృత్వంలోని ఎంఎన్ఎస్ దెబ్బకు 2012 బీఎంసీ ఎన్నికల్లో శివసేనకు దాదాపు ఓడినంత పనైంది. సాయం కోసం బీజేపీ వైపు చూడక తప్పలేదు. అలా శివసేన–బీజేపీ సంకీర్ణం బీఎంసీని హస్తగతం చేసుకుంది. బీజేపీతో కయ్యం... మరో ఐదేళ్లకు 2017లో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో మాత్రం పరస్పరం పోటీ పడ్డాయి. బీజేపీ తన బలాన్ని 31 సీట్ల నుంచి ఏకంగా 82కు పెంచుకుంది. శివసేన గట్టిపోటీ నడుమ 84 సీట్లు గెలవగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు షిండే సవాలును తట్టుకుని ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సిందే. ఒకవైపు బీజేపీ, మరోవైపు షిండే దాడిని ఉద్ధవ్ ఏ మేరకు కాచుకుంటారన్నది ప్రశ్నార్థకమే. వాటికి తోడు రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఎటూ పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌కు పెద్దగా సీన్ కనిపించడం లేదు. మరాఠా ఓటర్లంతా తమవైపేనన్నది ఉద్ధవ్ శివసేన ధీమా అయితే గుజరాతీలు, జైన్లు, ఉత్తరాది వారివంటి మరాఠేతర ఓటర్లు తమను విడిచిపెట్టరన్నది బీజేపీ ధీమా. నిజానికి శివసేనకు ముంబై పెట్టని కోటగా ఉండేది. కానీ దాదర్, మాహిం, కుర్లా, చాందివలి ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గంలో చేరడంతో బీఎంసీ ఎన్నికల్లో వారి అనుయాయులు, కార్యకర్తల మద్దతు ఉద్ధవ్‌కు లేకుండా పోయినట్టే. ఇది ఆయనకు ఒకరకంగా గట్టి దెబ్బే. కనీసం 90 సీట్లన్నా రాకుంటే బీఎంసీ పీఠం ఉద్ధవ్ సేనకు దక్కడం కష్టమే. అయితే బీజేపీకి దూరమైంది గనుక ముంబై ముస్లింలు ఈసారి ఉద్ధవ్‌కు ఓటేసే అవకాశముంది. ఇది ఆయనకు కాస్త కలిసొచ్చే పరిణామమే. కాకపోతే, ఇది ఉద్ధవ్‌ను ఘోర పరాజయం గట్టెక్కించడానికి మాత్రమే పనికొస్తుందన్న అంచనాలున్నాయి. బీజేపీ ఆశీస్సులతో సీఎం పీఠం మాదిరిగానే బీఎంసీని కూడా ఉద్ధవ్ నుంచి షిండే లాక్కోవడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకూ బీఎంసీ ఎన్నికల నాటికి సిసలైన శివసేనగా గుర్తింపు, పార్టీ గుర్తు ఉద్ధవ్, షిండేల్లో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికర అంశం. వేచి చూద్దాం. -
మెజారిటీ నిరూపించుకోమనండి.. మహారాష్ట్ర సంక్షోభంలో కీలక మలుపు
ముంబై/న్యూఢిల్లీ/గువాహటి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మంగళవారం కీలక మలుపు తిరిగింది. వారానికి పైగా వేచిచూసే ధోరణి అవలంబించిన బీజేపీ నేరుగా రంగంలోకి దిగింది. విపక్ష నేత, బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాత్రి గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘శివసేనపై 39 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటు చేసి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో పాలక మహా వికాస్ అఘాడీ కూటమి మైనారిటీలో పడింది. అందుకే అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు లేఖ సమర్పించాం’’ అని వివరించారు. అంతకుముందు మంగళవారం రోజంతా బీజేపీ శిబిరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ఉదయమే ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ వ్యూహంపైనే వారు చర్చించినట్టు చెబుతున్నారు. రాత్రికి ముంబై తిరిగి రాగానే పదింటికి ఫడ్నవీస్ నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మరోవైపు షిండే శిబిరంలో చేరిన 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్‌ను మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఈ మెయిల్ ద్వారా కోరినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై రానున్నట్టు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వస్తే అన్ని విషయాలూ చర్చించుకుందామంటూ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘‘రెబల్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తిరిగొచ్చి నాతో మాట్లాడితే సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది’’ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం క్రమంగా క్రైమాక్స్‌కు చేరుతున్నట్టు కన్పిస్తోంది. షిండే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ముంబై తిరిగొచ్చి బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరతారన్న వార్తలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. దమ్ముంటే పేర్లు చెప్పండి: షిండే 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నారన్న శివసేన వ్యాఖ్యలను షిండే కొట్టిపారేశారు. దమ్ముంటే వారి పేర్లు చెప్పాలని సవాలు చేశారు. ఉద్ధవ్‌పై ఆయన తిరుగుబావుటా ఎగరేయడం, తన వర్గం ఎమ్మెల్యేలతో వారం రోజులుగా అసోంలోని గువాహటిలో ఓ స్టార్ హోటల్లో మకాం వేయడం తెలిసిందే. శిబిరంలో ఇప్పటికే 39 మంది సేన ఎమ్మెల్యేలు, మరో 10 మందికి పైగా స్వతంత్రులున్నారు. 19 మంది శివసేన లోక్‌సభ సభ్యుల్లో కూడా ఏకంగా 14 నుంచి 16 మంది షిండే వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. వారిలో కనీసం 12 మంది ఇప్పటికే శిబిరంలో చేరినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హోటల్ బయట షిండే విలేకరులతో మాట్లాడారు. తన వర్గం ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై వస్తానని ప్రకటించారు. బాల్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారంతా స్వచ్ఛందంగా తనతో కలిసొచ్చారని పునరుద్ఘాటించారు. బీజేపీ దూకుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలకు బీజేపీ పదును పెంచింది. అధికార సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభంతో తమకు ఏ సంబంధమూ లేదని పార్టీ అంటున్నా, ఈ మొత్తం వ్యవహారంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర అని భావిస్తున్నారు. మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లిన ఆయన ముందుగా అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ, సీనియర్ లాయర్ మహేశ్ జఠ్మలానీ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది! సేన రెబల్స్, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. అనంతరం ఫడ్నవీస్ నడ్డా నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇదీ నంబర్ గేమ్ సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు) మెజారిటీ మార్కు: 144 షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది పాలక కూటమి వాస్తవ బలం: 168 షిండే తిరుగుబాటు తర్వాత: 119 బీజేపీ కూటమి వాస్తవ బలం: 113 షిండే కూటమి మద్దతిస్తే: 162 -
చిక్కుల్లో ఫడ్నవీస్.. మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు
ముంబై: అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసులో తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు బీజేపీ నేత, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. నోటీసులు అందిన అనంతరం ఆయన వీటిని ట్వీటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్ అయ్యారు. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా ఏమీ చేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు అందాయి. అయినా తాను ఇలాంటి వాటికి భయపడనని ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీల కుంభకోణాన్ని తాను బయటపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ఫడ్నవీస్ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది. -
కాంగ్రెస్ మోసానికి చిరునామా! : మాయావతి
కాంగ్రెస్ మోసానికి చిరునామా! కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి చిరునామా అని బీఎస్పీ నేత మాయావతి తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో మాయావతి రహస్య ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘బీఎస్పీలో బీ అంటే బీజేపీ’’ అని యూపీ కాంగ్రెస్ ఒక ట్వీట్లో విమర్శించింది. దీనిపై మాయావతి పలు ట్వీట్లతో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు యూపీలో అడ్రస్ లేదని, కాంగ్రెస్ విమర్శలు అభ్యంతర కరమని, బీఎస్పీలో బీ అంటే బహుజనులని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో సీ అంటేనే కన్నింగ్ అని విమర్శించారు. బహుజనుల ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంతరం వారిని వదిలేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. అయితే బీజేపీకి బీఎస్పీ బీటీమ్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసని, ఇప్పటికైనా మాయావతి నిజాలను ఒప్పుకోవాలని యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ ఎద్దేవా చేశారు. బీజేపీ– శివ సేన శత్రువులు కావు! కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలున్నంత మాత్రాన తమ పార్టీ, తమ మాజీ నేస్తం శివసేన శత్రువులు కావని బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావీస్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అది జరగవచ్చు, ఇది జరగకూడదని లేదన్నారు. భవిష్యత్‌లో ఇరువురూ మరలా కలుస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, సరైన సమయంలో, పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలుంటాయన్నారు. 2019 ఎన్నికల్లో తమతో కలిసే సేన పోటీ చేసిందని, కానీ ఫలితాల అనంతరం వేరేవారితో(ఎన్సీపీ, కాంగ్రెస్) చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. ఎవరిపైన పోటీ పడిందో వారితోనే సేన జట్టుకట్టిందని రాష్ట్ర అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో పలు కేసులను దర్యాప్తు చేస్తున్నాయని, వీటిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. ఒవైసీ సవాలుకు మేము సిద్ధం: యోగి ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయబోమంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనీ, దీనిపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు. ‘ఒవైసీ ప్రముఖ జాతీయ నేత. ఆయన దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆయనకు సొంత ఆదరణ ఉంది. బీజేపీని ఆయన సవాల్ చేస్తే స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుంది. దీనిపై సందేహమే లేదు’అని ఆయన అన్నారు. అంతకు ముందు ఒవైసీ ‘యూపీలో మరోసారి యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం కానివ్వబోం. మేం కష్టపడితే, ప్రతి ఒక్కటీ సాధ్యమే. మా ప్రయత్నం సఫలమైతే యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు’అని అన్నట్లు వార్తలొచ్చాయి. రఫేల్ డీల్‌పై రాహుల్ విమర్శలు రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలంటూ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ..ఆదివారం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించింది. జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ ఆపార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్లైన్లో సర్వే చేపట్టారు. ఈ ప్రశ్నకు రాహుల్ నాలుగు ఆప్షన్లు ఉంచారు. వాళ్లకు కమీషన్ అందలేదనే.. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. భారత వైమానిక దళం బలం క్షీణించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల అవసరాలకు అనుగుణంగా విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించింది. ఆశించినంత మేర కమీషన్ గాంధీ కుటుంబానికి అందకపోవడమే కారణమా? అని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర నిలదీశారు. -
వెంటాడిన దురదృష్టం: వీళ్లకు సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటే!
వెబ్‌డెస్క్: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు... దేవేంద్ర ఫడ్నవిస్- మహారాష్ట్ర బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. బీఎస్ యడియూరప్ప- కర్ణాటక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు. జగదాంబికా పాల్- ఉత్తరప్రదేశ్ 1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్‌సింగ్ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్ తన పదవికి రాజీనామా చేశారు. హరీశ్ రావత్- ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్ రావత్. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ఓం ప్రకాశ్ చౌతాలా- హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. నితీశ్ కుమార్- బిహార్ జనతా దళ్ నేత నితీశ్ కుమార్ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. -
కరోనా నిబంధనలు బ్రేక్..నెటిజన్ల ట్రోల్స్
పూణె : కరోనా నిబంధనలు పాటించాలని కేంద్రం ఓ వైపు హెచ్చరికలు చేస్తున్నా సొంతపార్టీ నేతలే వాటిని బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోలాపూర్‌లోని మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే రామ్ సత్పుటే వివాహం సోమవారం పూణెలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు హాజరైన బీజేపీ అగ్రనేతలు చాలామంది కరోనా నిబంధనల్ని బ్రేక్ చేశారు. మాస్కులు ధరించకపోవడంతో పాటు కనీసం భౌతికదూరం కూడా పాటించలేదు. (‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్’ ) అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం, వివాహ వేడుకకు 50 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, వెయ్యి మందికి పైగా రిసెప్షన్‌కు హాజరయ్యారు. వీరిలో మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. నిబంధనల్ని తుంగలో తొక్కి గుంపులు, గుంపులుగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ కావడంతో నెటిజన్లు పలువురు నేతలను ట్రోల్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక ప్రజలకేం చెబుతారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్! ) -
గ్రేటర్లో అందరికీ ఉచితంగా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగర్ వాసులపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్శించేందుకు మేనిఫెస్టోను తయారుచేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవిస్ గురువారం పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రయోగాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కాషాయదళం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను అందిస్తామని హామీనిచ్చింది. అంతేకాకుండా విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేనిఫెస్టో ఉంటుందని ఫడ్నవిస్ అన్నారు. పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకు చెందిన విధంగా మేనిఫెస్టో రూపొందించ బడిందని పేర్కొన్నారు. (గ్రేటర్ పోరు: మాటల యుద్ధం.. వివాదాస్పదం!) మేనిఫెస్టోలోని అంశాలు.. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం గ్రేటర్లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీఎల్ఆర్ఎస్ రద్దుతో15 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా విముక్తి వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్లో పడుతాయి ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు మెట్రో రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆన్లైన్ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్‌లు ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించడం మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు గ్రేటర్లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ -
‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘడీ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమిలోని మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయిని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కవ కాలం పరిపాలన కొనసాగించలేదని పేర్కొన్నారు. శివసేన సర్కార్ పడిపోయిన వెంటనే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామమని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’ ) గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని’ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఫడ్నవిస్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు బీజేపీకి ఓటేశారని, నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసొచ్చిందని అన్నారు. బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే 125 సాధించింది. అందులో బీజేపీకి 74, జేడీయూకు 43, వికాశిల్ ఇసాన్ పార్టీకి 4, హిందుస్తానీ అవాం మోర్చాకి 4 సీట్లు వచ్చాయి. ప్రత్యర్ధి మహాఘట్ బంధన్ కి 110 సీట్లు రాగా, వీటిలో ఆర్జేడీ 75 , కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు సాధించాయి. ( చదవండి: ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు ) -
సుశాంత్ మరణం పొలిటికల్ టర్న్ తీసుకుందా?
పాట్నా : ఈ ఏడాది చివర్లో బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఆయనకు పలు సూచనలు అందినట్లు సమాచారం. బిహార్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించనున్నారు. బిహార్‌లో నిన్న (గురువారం) జరిగిన ఓ ముఖ్యమైన పార్టీ సమావేశానికి సైతం ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపై ఎన్నికలకు సంబంధించి ఆయనే కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ నాయకులకు పలు సూచనలు అందాయి. (ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసలు) బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ర్ట, బిహార్ ప్రభుత్వాల మధ్య రాజకీయ చిచ్చు రగులుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సొంత రాష్ర్టమైన బిహార్ అతని మరణాన్ని సైతం రాజకీయాలకు వాడుకుంటోందని మహారాష్ర్ట ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికే ఉద్దవ్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసు విచారణకు అడ్డం పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా మహారాష్ర్ట సర్కార్‌పై పలు వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సుశాంత్ మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో ఫడ్నవిస్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బిహార్ బీజేపీ కోర్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ ఉన్నారు. భూపేంద్ర యాదవ్ గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. బిహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 29 తో ముగియడంతో అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరగునున్నట్లు సమాచారం. అయితే కరోనా కారణంగా ఎన్నికల తేదీలపై ఇంకా తేదీ వివరాలు వెల్లడికాలేదు. (ప్రజలకు సుశాంత్ సోదరి విజ్ఞప్తి) -
బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
-
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
ముంబై : ‘రాహుల్ సావర్కర్’ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ‘నేను సావర్కర్’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. అసెంబ్లీ బయటకూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ టోపీలు ధరించి ఆందోళన చేపట్టారు. హిందుత్వ సిద్ధాంత కర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫడ్నవీస్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమం గురించి తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు. కాగా, ‘రేపిన్ ఇండియా’ వ్యాఖ్యలు చేసిన రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ‘ప్రాణాలు పోయినా సరే.. నిజం మాట్లాడి క్షమాపణలు చెప్పబోను’అని రాహుల్ తేల్చి చెప్పారు. ‘నేను రాహుల్ సావర్కర్‌ను కాదు’అని మాట్లాడి దుమారం రేపారు. ఇదిలాఉండగా.. రాహుల్ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం తెలిపింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన హిందుత్వ సిద్ధాంతకర్తను అగౌరపరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది విదితమే. -
ఫడ్నవిస్‌పై ఉద్ధవ్ థాక్రే ఘాటు వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం సమయంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పడాన్ని మాజీ సీఎం ఫడ్నవీస్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాక్రే ఘాటుగా సమాధానం ఇచ్చారు. నా తల్లిదండ్రుల పేర్లు, మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావనకు తేవడం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. కానీ.. నేను వారి పేర్లను సందర్భం వచ్చిన ప్రతిసారీ నేను ప్రస్తావిస్తాను. కన్న తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని వారు జీవించడానికి కూడా అనర్హులన్నారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడం మహారాష్ట్రలో నేరంగా ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాగా.. గురువారం ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రమాణ స్వీకారం నిర్దేశిత ఫార్మాట్లో లేదని, తండ్రి బాలాసాహెబ్ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావించడం సరికాదని ఫడ్నవీస్ విమర్శించిన సంగతి తెలిసిందే. అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. చదవండి: విశ్వాసం పొందిన ఉద్ధవ్ చదవండి: డిప్యూటీ సీఎంపై వీడని ఉత్కంఠ -
నాడు అజిత్‌ను జైలుకు పంపుతానన్న ఫడ్నవీస్
ముంబై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే మాట మరోమారు రుజువైనట్టు కనిపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఇరిగేషన్ స్కాంపై అజిత్ పవార్ జైలుకెళ్లక తప్పదని శపథాలు చేసిన ఫడ్నవీస్ తాజాగా అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, తాను సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. దీంతో 2014లో ఫడ్నవీస్ అజిత్‌పవార్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎన్సీపీని ‘నేచురల్లీ కరప్ట్ పార్టీ’గా అభివర్ణించిన మోదీ ప్రస్తుతం ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
‘శివసేన అత్యాశనే కొంప ముంచింది’
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మహారాష్ట్రలో శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని ఆయన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని శుక్రవారం రాత్రి వరకు అందరు అనుకున్నారు. కానీ, తెల్లారేసరికి ఎవరూ ఊహించని విధంగా ఉదయం ఎనిమిది గంటల లోపే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని పరిణామాలు రాష్ట్రంతోపాటు దేశంలోనే తీవ్ర కలకలం రేకేత్తించేలా చేశాయి. ఈ ఊహించని పరిణామాలపై ముంబైతోపాటు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలంటి నేపథ్యంలో తెలుగు ప్రజల అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.. రాజకీయాల్లో అవకాశవాదులదే ఆధిపత్యం ఓటు ఎవరికి వేసిన అది అవకాశ వాదుల చేతికి ఆయుధంగా మారుతుండటం విషాదకరం. ఓటర్ల మనోభావాలను క్రూరంగా అవహేళన చేస్తూ ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషం. కాని జనాదేశాన్ని కాదని మొదట్లో శివసేన పార్టీ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి, అధికారం కోసం వెంపడ్లాడడం, ఇప్పుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించడం. చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనం మాత్రమే అనిపిస్తోంది. అవకాశవాదులదే ఆధిపత్యం కొనసాగుతోంది. – సంగెవేని రవీంద్ర (మహారాష్ట్ర తెలుగురైటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి) ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఎవరు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తు అయితే బలపరీక్ష నిరూపణ మరో ఎత్తు కానుంది. రాజకీయాల్లో విలువలులేకుండా పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్రలో గత నెల రోజులుగా కొనసాగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దనేది అర్థంకాని పరిస్థితి. అందుకే ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా సరే రాష్ట్రప్రజల హితవు కోసం రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. – మాదిరెడ్డి కొండారెడ్డి (తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి). శివసేన అత్యాశనే కొంప ముంచింది ముఖ్యమంత్రి పీఠంపై పెంచుకున్న అత్యాశనే శివసేన పార్టీ కొంపముంచింది. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై అంతగా ఆశపెంచుకోకుంటే ఇలా జరిగేది కాదు. ఆర్పీఐ నేత రామ్‌దాస్ ఆఠావలే పేర్కొన్నట్టుగానే భారతీయ జనతా పార్టీకి మూడేళ్లు, శివసేన పార్టీకి రెండేళ్లపాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అంగీకరించి ఉండాల్సింది. ఈ విషయంపై చర్చలకు ఇరు పార్టీలు ముందుకు వచ్చినట్టయితే మహారాష్ట్ర రాజకీయాల్లో నేటి పరిస్థితి ఉద్బంవించి ఉండేది కాదు. – పుట్టపాక తిరుపతి (చర్నీ రోడ్డు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు) బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర హితవు కోసం బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది. ఓ వైపు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ రోజు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. మరోవైపు రాష్ట్రపతి పాలన కారణంగా రాష్టంలో రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇతర సమస్యలు పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఎంతో అవసరం. దీంతో బీజేపీ, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకుంది. – కొదురుపాక మహేష్ (కాందివలి) విశ్వాసం పోతోంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే రాజకీయాలతోపాటు రాజకీయ నాయకులపై విశ్వాసం పోతోంది. ఎవరిని నమ్మాలో..? ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. పార్టీ సిద్దాంతాలు లేవు. పదవులకోసం పాకులాటే కని్పస్తోంది. ఈ రోజు ఓ పారీ్టలో ఉన్నవారు రేపు ఏ పారీ్టలో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా పార్టీ నాయకులే కాకుండా రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు, ఎన్నికల తర్వాత మరొకరితో పొత్తు పెట్టుకుంటున్నాయి. మరోవైపు సొంత పారీ్టల ఎమ్మెల్యేలపై విశ్వాసం లేక రహస్య స్థలాల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడటం రాజకీయాల్లో అత్యంత శోచనీయం. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయాలపై సామాన్య ప్రజలకు విశ్వాసం పోతోంది. – పోతు రాజారాం (ఆంధ్ర మహాపభ ట్రస్టీ చైర్మన్) ఇది వెన్ను పోటే మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, అజిత్ పవార్‌తో కలిసి ప్రజాసామ్యానికి వెన్నుపోటు పోడిచారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖారారైన సమయంలో ఇలా చేయడం సబబుకాదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వంలో కూడా అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి లేదా ఇతర కీలక మంత్రి పదవి లభించి ఉండేది. కాని ఆయన వెన్నుపోటు పొడిచారు. – నాయన జగదీశ్ (థానే జిల్లా శివసేన సౌత్ సెల్ కార్యధ్యక్షులు) బల పరీక్షలో పరాజయం ఖాయం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మురిసిపోతుంది. కానీ, అజిత్ పవార్‌కు ఎన్సీపీ మద్దతు లేదు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టం. నవంబరు 30 వ తేదీన బీజేపీ బలపరీక్షలో పరాజయం అయిన తర్వాత మళ్లీ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం. – వాసాల శ్రీహరి (వంశి) (శివసేన) బీజేపీ చేస్తే తప్పా? కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జతకడితే తప్పులేదు. కాని బీజేపీ ఎన్సీపీతో జత కడితే తప్పా..? రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ అజిత్‌పవార్ మద్దతు తీసుకుంది. దీంట్లో బీజేపీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నించింది. కాని బీజేపీని పక్కనబెట్టాలని శివసేన చూసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం అవుతుండడంతో రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇలా ముందుకు వచి్చంది. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. –కోడూరు శ్రీనివాస్ (రాయిగడ్ జిల్లా బీజేపీ సౌత్ సెల్ ప్రధాన కార్యధర్శి) -
బీజేపీకి శివసేన చురకలు..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో భారతీయ జనతా పార్టీ విఫలమైన నేపథ్యంలో శివసేన రైతులపై ప్రతికార చర్యలకు పాల్పడవద్దని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడింది. ఆదివారం మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ట్విటర్ వేదికగా శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రేను ప్రజలకు ‘ఆత్మగౌరవం’ విలువను నేర్పించారని ప్రశంసిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆత్మ గౌరవం కాపాడుకోవాలి అంటూ ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో స్పందించింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనందుకు కేంద్ర ప్రభుత్వం రైతులపై పగ తీర్చుకుంటుందని విమర్శించింది. రైతులపై అలాంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికింది. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు కోరటంపై ఫడ్నవిస్ పరోక్షంగా విమర్శించినట్టుగా అర్థం వస్తోంది. దీంతో ఆత్మగౌరవంతో వ్యాపారం చేసే 105 మంది ఎమ్మెల్యేలను కలిగిన బీజేపీ.. శివసేనకు ఆత్మగౌరవం గురించి చెప్పుతుందా? అని సామ్నాలో ప్రశ్నించింది. బాల్ ఠాక్రే ఇచ్చిన ఆత్మగౌరవాన్ని శివసేన కోల్పోకుండా రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుందని పేర్కొంది. రైతులకు తక్కువ పరిహారం అంటూ ప్రశ్నించిన బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ ఉద్దేశిస్తూ.. ఆత్మగౌరవం కోసం పోరాడే స్థితిలో ఉన్నారా అని విమర్శించింది. మహారాష్ట్ర్ర గవర్నర్‌ను ‘సుల్తాన్’ అని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సుల్తాన్ అనుమతించటం లేదని తెలిపింది. ‘రాజా’ నుంచి ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయని.. కానీ తన దగ్గర నుంచి తగినంతగా స్పందన లేదని పేర్కొంది. రైతులకు హెక్టారుకు రూ. 25 వేలు ఇవ్వాలని శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహిరిస్తోందని.. ఆ పార్టీ చర్యలు చాలా ప్రమాదకరంగా మారాయని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. -
సుప్తచేతనావస్థలోకి మహారాష్ట్ర అసెంబ్లీ!
ముంబై: మహారాష్ట్రలో కనుచూపు మేరలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాని నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ తొలిసారి సమావేశపర్చేవరకూ 14వ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉంటుందని అసెంబ్లీ వ్యవహరాల మాజీ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం రాత్రితో ముగిసింది. అయితే బీజేపీ, శివసేనల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పీటముడి కొనసాగుతోంది. శనివారం అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అసెంబ్లీని సమావేశపర్చే వరకూ అంతే.. ‘కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపర్చనంత వరకూ మహారాష్ట్ర 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్తుంది’అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత కల్సే చెప్పారు. సుప్తచేతనావస్థలో ఎంత కాలం ఉంచాలన్న దానిపై నిర్దిష్ట సమయమేదీ లేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమయంలో జీతాలు, ఇతర అలవెన్సులు అందుకుంటారన్నారు. ‘రాష్ట్రపతి పాలనే చివరి ప్రత్యామ్నాయం. కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ కూడా కొత్త అసెంబ్లీని సమావేశపర్చలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లేదు’అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించండి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని కోరుతూ గవర్నర్ కోషియారీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు శనివారం లేఖ రాశారు. సీఎం పీఠం విషయంలో బీజేపీ, శివసేన మధ్య పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు. ఈ పరిణామంపై ఎన్సీపీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో శాసనసభలో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నడుపుతున్నాయి. -
‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసందే. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలకు సీట్లు తగ్గినప్పటికీ తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ శివసేన పట్టుబడుతోంది. మరోవైపు శివసేన డిమాండ్‌కు తలొగ్గని బీజేపీ.. సీఎం పీఠం తమదేనని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ సుపర్ స్టార్ అనిల్ కపూర్ సీఎంగా ఉండాలంటూ ఆయన అభిమానులు ట్విటర్ ద్వారా కామెంట్లు చేస్తున్నారు. కాగా 2001లో విడుదలైన ‘నాయక్’ సినిమాలో అనిల్ కపూర్ నటించిన ఒకరోజు సీఎంగా నటించిన విషయం తెలిసిందే. దీంతో అదే తరహలో నిజ జీవితంలో కూడా మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం తేలే వరకు ఆయనను సీఎంగా ఉండమంటూ.. ఈ విషయం గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, అదిత్య ఠాక్రే ఓసారి ఆలోచించాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కోరుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనిల్ కపూర్.. ‘ నేను నాయక్‌లో మంచి నటుడిని మాత్రమే’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. मैं nayak ही टीक हूँ 😎@vijaymau https://t.co/zs7OPYEvCP — Anil Kapoor (@AnilKapoor) October 31, 2019 దీంతో ఆయన అభిమానులు ‘హ హ్హ హ్హా సినిమాలో కూడా మొదట నిరాకరించి ఆ తర్వాత సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారంటూ’ అప్పటి నాయక్ సినిమాలోని ఆయన పాత్రను గుర్తు చేశారు. ఇక తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో వహించిన నాయక్(ఒకే ఒక్కడు రీమేక్)లో అనిల్ కపూర్‌తో పాటు రాణి ముఖర్జీ, అమ్రిష్ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది అనిల్ కపూర్ ఈ ఏడాది ‘ఏక్ లడ్కీ కో దేఖా ఐసేహీ హోగా’, ‘టోటల్ ధమాల్’లో చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. అలాగే కరణ్ జోహర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తఖ్త్’లో కూడా ఆయన నటిస్తున్నారు. కాగాఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
ఏకం చేసేది హిందూత్వమే
ముంబై: హిందూత్వ ఎజెం డాయే బీజేపీని, శివసేనను కలిపి ఉంచుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంచేశారు. రెండు పార్టీల కలయిక విజయం చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శుక్రవారం ముంబైలో ఆయన మాట్లాడారు. మొత్తం 288 సీట్లలో శివసేన 124, ఎన్డీయే మిత్రపక్షాలైన ఆర్పీఐ, ఆర్ఎస్పీలు 14, బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. రెబల్ అభ్యర్థులను రెండు రోజుల్లోగా వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతామని, లేకపోతే వారి స్థానమేంటో వారికే చూపిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌నేత ఖడ్సేకు టికెట్ రాకపోగా, ఆయన కుమార్తె రోహిణికి ముక్తయినగర్‌లో సీటు కేటాయించారు. ఖడ్సే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిత్య భారీ విజయం ఖాయం.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య భారీ మెజార్టీతో గెలుస్తారని ఫడ్నవిస్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఆదిత్యను సెక్రటేరియట్‌లోని ఆరో అంతస్తులో (ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఉండే చోటు) చూడాలనుకుంటున్నారని తెలిపారు. ఆదిత్య రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రెండు పార్టీల్లో పెద్దన్న (ఆధిపత్య పార్టీ) ఏదన్న చర్చలు లేనేలేవని పేర్కొన్నారు. -
ప్రధానికి విషెస్; సీఎం భార్యపై విమర్శలు!
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీని.. ‘ఫాదర్ ఆఫ్ కంట్రీ’గా సంభోందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మన జాతి పిత మహాత్మా గాంధీ అని.. ఆ విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అసలు విషయమేమిటంటే... మంగళవారం మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా అమృత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...‘ ఫాదర్ ఆఫ్ కంట్రీ నరేంద్ర మోదీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజాన్ని మెరుగుపరిచే క్రమంలో నిర్విరామంగా కృషి చేసేందుకు స్ఫూర్తినిస్తున్న వ్యక్తి ఆయన’ అని ఆమె ట్వీట్ చేశారు. విషెస్‌తో పాటు తాను స్టేజీపై గాన ప్రదర్శన ఇస్తున్న వీడియోను కూడా అమృత జతచేశారు. ఈ క్రమంలో అమృత ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు...‘ మన జాతి పిత మహాత్మా గాంధీ అని తెలుసు. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ దేశానికి తండ్రి అయ్యారా. ఇది ఎప్పుడు జరిగింది? ఓహో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఆర్థిక మాంద్యం.. బహుశా ఇదేనేమో సమాజాన్ని మెరుగుపరచటం అంటే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా 2016లో నేపథ్య గాయనిగా రంగ ప్రవేశం చేసిన అమృత పలు గీతాలు ఆలపించి సింగర్‌గా గుర్తింపు పొందారు. అదే విధంగా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇక అమృత నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో క్రూయిజ్ షిప్ అంచున కూర్చుని సెల్ఫీలకు ఫోజులిచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందుకు ఆమె క్షమాపణలు కూడా కోరారు. Wishing the Father of our Country @narendramodi ji a very Happy Birthday - who inspires us to work relentlessly towards the betterment of the society ! #HappyBDayPMModiJi #HappyBdayPMModi #HappyBirthdayPM #happybirthdaynarendramodi pic.twitter.com/Ji2OMDmRSm — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2019 -
థ్యాంక్యూ ఆమిర్ : సీఎం ఫడ్నవిస్
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమిర్ తాజాగా వరద బాధితులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీ వరదలు సంభవించడంతో అక్కడి జనజీవనం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమిర్‌ఖాన్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సహాయంగా సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. రైతులు, వరద బాధితులు, అమరవీరుల కుటుంబాలకు ఆయన ఆపన్న హస్తం అందించారు. అసోంకు వరదలు వచ్చినప్పుడు రూ.2 కోట్లను ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. అమీర్, అక్షయ్ బాటలోనే గాన కోకిల లతా మంగేష్కర్ రూ.11 లక్షలను, బాలీవుడ్ బిగ్‌బీ రూ. 51 లక్షలను విరాళంగా ప్రకటించారు. దీంతో మరికొంతమంది ప్రముఖులు కూడా ముందుకువచ్చి విరాళాలు ఇస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ రూ. 5 కోట్లను విరాళంగా ఇవ్వగా ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రూ. 5 కోట్ల చెక్కును సీఎంకు అందించారు. అలాగే ఆగస్టు 12న బాలీవుడ్ కపుల్ రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహరాష్ట్ర సీఎం ఆపన్న హస్తాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఫడ్నవీస్‌తో సహా వారి ఒకరోజు వేతనాన్ని రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.వరదల విజృంభన వల్ల పుణెలో ఇప్పటి వరకు 54 మంది చనిపోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. Thank you @aamir_khan for your contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund #MaharashtraFloods ! — Devendra Fadnavis (@Dev_Fadnavis) August 20, 2019 -
అసెంబ్లీ ఎన్నికలు.. ఆ పార్టీకి కఠిన పరీక్షే..!
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన కాంగ్రెస్ పార్టీకి.. మరో కఠిన పరీక్ష సవాలు విసురుతోంది. ఆ పార్టీకి కీలకమైన మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతల రాజీనామాలతో హస్తం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల వైఫల్యం అనంతరం.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పీసీసీలు, కీలక పదవుల్లో ఉన్న సీనియర్లు కూడా పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామం పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయడం.. మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రాష్ట్ర ప్రతిపక్ష నేత రాధాకృష్ణ ఊకే పాటీల్ ఇటీవల బీజేపీ చేరి.. ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని ఆపార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. దీని కోసం కేంద్ర హోంశాఖ మంత్రి, ఆ పార్టీ అధ్యక్షడు అమిత్ షా ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర శాఖను షా ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ఓటమితో కుదేలయిన ఆపార్టీని ఫిరాయింపులతో మరింత దెబ్బతీయాలని కమళ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరనున్నారని మంత్రి గిరీష్ మహజన్ ఇటీవల స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ఇతర పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నాట్లు ఆయన తెలిపారు. అలాగే కీలకమైన ఎన్నికల ముందు రాష్ట్రానికి కొత్త సారథిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 48 లోక్‌సభ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి 41 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్సీపీ 4 సీట్లను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా ఇటీవల ప్రారంభించిన విషయం విధితమే. -
సీఎం ‘వికాస్ యాత్ర’.. మరి వారిది ఏ యాత్ర..!
ముంబై : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్ బయటపడినట్టు లేదు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఇక ఎన్నికల ముందే రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా అదే బాటలో నడిచారు. అయితే, లోక్‌సభ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే అసహనంతో కాకుండా రాహుల్ రాజీనామా అనంతరం ఆయన పదవికి గుడ్‌బై చెప్పడం గమనార్హం. అయితే, ఈయేడు చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల వైఖరి బీజేపీకి మరింత బలం చేకూర్చేదిగా తయారైంది. బీజేపీని ఎదుర్కొంటుందా..! అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న మహారాష్ట్ర కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 48 సీట్లలో కాంగ్రెస్ 1 చోట మాత్రమే విజయం సాధించగా ఎన్డీయే కూటమి 41 సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఈయేడు చివరల్లో అసెంబ్లీ జరుగనుండటంతో అధికార బీజేపీ దూకుడు పెంచింది. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. లోక్‌సభ ఎన్నికల విజయంతో ఆగిపోవద్దని, మరింత కష్టపడి పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెద్దామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘వికాస్ యాత్ర’ పేరుతో ఆయన త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రంలోనూ నాయకత్వ కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పరిస్థితి జిల్లాల్లో మరింత గందగోళంగా తయారైంది. మంత్రి పదవి ఇచ్చి లాగేసుకున్నారు.. ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీనియర్ లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్‌ను బీజేపీ లాగేసుకుంది. ఆయనకు మంత్రిపదవి కూడా కట్టబెట్టింది. బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ కీలక నేతలు క్యూ కట్టారని రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ వంతి నేతలు చెప్తుండటం గమనార్హం. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా మాజీమంత్రి బాలాసాహెబ్ థారోట్ బాధ్యతలు చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, చవాన్ రాజీనామామై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తుకు ఎన్సీపీ సై..! అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు ఎన్సీపీ సిద్ధమైంది. ఈ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మల్లిఖార్జున ఖర్గేతో చర్చలు జరుపేందుకు సుముఖంగా ఉంది. అయితే, సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ ఎవరిని రంగంలోకి దించుతుందో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాయకుడు కరువైనవేళ ఏమేరకు బీజేపీతో ఢీకొంటుందో చూడాలి..!! -
రుణమాఫీ లిస్ట్‌లో ఓ ఎమ్మెల్యే పేరు!
సాక్షి, ముంబై : రైతుల రుణమాఫీ వ్యవహారం మహారాష్ట్రంలో రాజకీయంగా పెను కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల కోసం సొంత నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టడం, బీజేపీ ప్రభుత్వ తీరు నచ్చక మరో నేత ఎంపీ అయిన నానా పటోలే ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ రైతుల పేర్ల జాబితాలో శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ పేరు కనిపించటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొల్హాపూర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తరపున ఆయన రుణం కోసం దరఖాస్తు చేసినట్లు.. ఆయనకు 25 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఉంది. కరువు ప్రాంత రైతులకు అందించిన రుణమాఫీ కింద ఆయనకు రుణం కూడా రద్దు అయ్యింది. దీనిపై స్పందించిన కొల్హాపూర్ ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ తాను ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పటం విశేషం.‘‘ఆ వార్త మీడియాలోనే చూసి నేను తెలుసుకున్నా. షాక్‌కు గురయ్యాను. నేను ఎక్కడా నా పేరును నమోదు చేసుకోలేదు. ఆ రుణమాఫీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరాను’’ అని ఆయన చెప్పారు. కాగా, సుమారు 34 వేల కోట్ల రుణమాఫీ విషయంలో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని.. త్వరలో వాటిని సరిదిద్దుకుంటామని స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ఉండటంతో ప్రతిపక్షాలు ఫడ్నవిస్‌పై మండిపడుతున్నాయి. శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ -
ప్రతికూల వాతావరణంతో వెనక్కి మళ్లిన సీఎం ఛాపర్
రాజ్‌కోట్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో రెండు రాష్ట్రాల అధికారులు కలవరపాటుకు గురయ్యారు. రాజస్థాన్ లోని రాజ్ కోట్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ ఆథ్యాత్మిక క్షేత్రం పరబ్ వావధికి హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే టేకాఫ్ అయిన తర్వాత సీఎం హెలికాప్టర్ కు ప్రతికూల వాతావరణం ఎదురు కావడంతో 15 నిమిషాలకే వెనక్కితిరిగి వచ్చేసింది. దీంతో అధికారులు కలవరపడ్డారు. మరో 20 నిమిషాల అనంతరం సీఎం ఫడ్నవిస్ అదే హెలికాప్టర్ లో గమ్యానికి సురక్షితంగా చేరుకున్నారు.