ఎన్నికల్లో ఓడినందుకే ఈవీఎంలపై ఆరోపణలు
నాగ్‌పూర్ నా కుటుంబం, సీఎంగా ఇక్కడకు రావడం ఆనందకరం
అన్ని వర్గాల ఆదరణ వల్లే మరోమారు అధికారం
వారికోసం అహర్నిశలూ శ్రమిస్తామంటూ హామీ
మంత్రివర్గ విస్తరణ కోసం నాగ్‌పూర్‌కు సీఎం రాక
ఘనస్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు
నాగ్‌పూర్: ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగంపై నమ్మకం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ, డిసెంబర్ 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల కోసం ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా నా జన్మభూమి, కర్మభూమికి (స్వస్థలం, పార్టీ కార్యాలయం) రావడం చాలా సంతోషకరమైన క్షణం. నాగ్‌పూర్ నా కుటుంబం, నా కుటుంబం నేడు నాకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని మహాయుతి (కూటమి) పేదలు, గిరిజనులు, రైతులు, దళితులు, ఓబీసీలు ఇతరుల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా మహిళలు, లడ్కా, షెత్కారీ (రైతులు), లడ్కే , ధంగార్లు, మరాఠాలు, ఇతరులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వంపై నమ్మకముంచినందువల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. మహాయుతిని ఆశీర్వదించి, నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు 14 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు తమకు సేవ చేసేందుకు, వారి జీవితాలను, మహారాష్ట్రను మార్చేందుకు మహాయుతిని ఎంచుకున్నారు. ప్రజల కలను నెరవేర్చేందుకు నేను, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి పనిచేస్తాం. ‘ఈ ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ నిబద్ధతతో పనిచేస్తుంది’అన్నారు.
నిరాశతోనే ప్రేలాపనలు..
ఈవీఎంల వ్యవహారంపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడం పట్ల ఫడ్నవీస్‌ను ప్రశి్నంచగా, ‘‘ఈ వ్యక్తులు (ప్రత్యర్థులు) నిరాశ చెందారు, వారికి ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్‌పై విశ్వాసం లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌పై నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విశ్వసించరు. ’అని మండిపడ్డారు. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించి మహాయుతి కూటమి విజయం సాధించడంతో డిసెంబర్ 5న ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి: ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు
‘భూమిపుత్రుడికి’ స్వాగతం
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన తరువాత సీఎంగా నాగ్‌పూర్‌కు చేరుకున్న ఫడ్నవీస్‌కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ధరంపేట్‌లోని ఫడ్నవీస్ నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫడ్నవీస్ తన భార్య అమృతా ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, ఇతరులతో కలిసి అలంకరించబడిన ఓపెన్–టాప్ వాహనంలో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగే దారి పొడవునా ‘మట్టి కుమారుడికి స్వాగతం’ పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. ఈసందర్భంగా ఫడ్నవీస్ తన మద్దతుదారులను ఉద్దేశించి ’ఏక్ హై తో సేఫ్ హై’, ’మోడీ హై తో ముమ్కిన్ హై’ నినాదాలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
Comments
Please login to add a commentAdd a comment