
ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. అసెంబ్లీలో ఫడ్నీవీస్ నాగ్ పూర్ లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేకంగా మాట్లాడారు.
‘ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు. వారు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసి మరీ శిక్షిస్తాం. ఆఖరికి సమాధుల్లో దాక్కున్నా తప్పించుకోలేరు. ఈ దాడిలో 33 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కావడాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. ఇదొక అమానుష ఘటన అని, పక్క వ్యూహంతో హింసాత్మ ఘటనలకు పాల్పడ్డారన్నారు.
కాగా, ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో సోమవారం ఈ ఘర్షణ చెలరేగింది. తొలుత చిన్నపాటి ఘర్షణగా మొదలై, ఆపై తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలపాలయ్యారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment