
ముంబై: నాగపూర్‌లో గత రాత్రి నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు ఒక రకంగా ‘ఛావా’ సినిమానే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Aurangzeb Tomb)ని తొలగించాలనే డిమాండ్‌తో మొదలైన ఆందోళన కాస్త హింసాత్మకంగా మారడం.. ఆపై నెలకొన్న కర్ఫ్యూ పరిస్థితులపై ఆయన ఇవాళ అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడించారు.
ఇక్కడ నేను కేవలం ఒక సినిమాను మాత్రమే తప్పుపట్టాలని అనుకోవడం లేదు. కానీ, ఇలా మాట్లాడక తప్పడం లేదు. శంభాజీ మహరాజ్ చరిత్రను ఛావా చిత్రం ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభావాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబు మీద వ్యతిరేకత అంశం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అయితే..
ఇదంతా పక్కా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధి తొలగించాలనే డిమాండ్‌తో సోమవారం సాయంత్రం వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబు నకిలీ సమాధి ఒకదానిని ఏర్పాటు చేసి తగలపెట్టారు. కాసేపటికే మతపరమైన ప్రతులు తగలబెట్టారని ప్రచారం రేగింది. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాబట్టి ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అని అన్నారాయన.
#NagpurViolence: Maharashtra Chief Minister DevendraFadnavis says #Chhaava brought the history of Chhatrapati Sambhaji Maharaj to the fore and ignited public anger against Mughal ruler Aurangzeb.
Read: https://t.co/hLrV0crgkG pic.twitter.com/RrUt0qPfJ2— NDTV Profit (@NDTVProfitIndia) March 18, 2025
VIDEO Credits: NDTV Profit X Account
అయితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని.. కులం, మతం ఏదైనా సరే ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారాయన. అదే సమయంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవాళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయంతో పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. గత రాత్రి నాగ్‌పూర్(Nagpur)లో భారీ ఎత్తున విధ్వంస కాండ జరిగింది. రాళ్లు రువ్వుకుంటూ.. పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. పోలీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో.. కేవలం పోలీసులకే 33 మందికి గాయాలైనట్లు సమాచారం. అయితే సాధారణ పౌరులు ఎంత మంది గాయపడ్డారనేదిపై అక్కడి మీడియా ఛానెల్స్ తలా ఓ ఫిగర్ చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే..
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రంలో లీడ్ రోల్ శంభాజీగా విక్కీ కౌశల్(Vicky Kaushal), శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా(Akshay Khanna As Aurangzeb) తమ ఫెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ టైంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తారు. మరాఠా యోధుడు శంభాజీ పోరాటాన్ని, త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన ఈ చిత్రం నిజంగా ఓ అద్భుతమంటూ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment