tomb
-
ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!
పురాతన ఆచారాలు, సంస్కృతులు కాస్త వింతగా ఉంటాయి. అందులోనూ తవ్వకాల ద్వారా బయటపడ్డవి అయితే ఓ పట్టాన అర్థం కావు. చాలా విస్తుపోయాలా ఉంటాయి ఆనాటి ఆచారాలు. అలాంటి విచిత్రమైన ఆవిష్కరణ పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది. నాటికాలాలతో అంత్య క్రియలు ఇలాచేసేవారా..!అని నోరెళ్లబెడతారు..టర్కిలోని థార్సా నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి సమాధిని కనుగొన్నారు. ఇది అడయమాన్ శాన్‌ల్యర్ఫా హైవేపై కుయులు గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అత్యంత విచిత్రమైన సమాధి బయటపడింది. రోమన్ కాలాం నాటిదిగా గురించారు. ఈ సమాధి నాటికాలంలోని చరిత్రపై కొత్త ఆశను అందిస్తోంది. నాటికాలంలో ఉండే పురాతన నాగరికత, శ్మశాన వాటికల గురించి ఒక అవగాహన ఏర్పడేందుకు ఈ సమాధి దోహదపడుతుంది. థార్సా నగరంలోని నెక్రోపోలి ప్రాంతంలో 2024 నుంచి జరిపిన తవ్విన తవ్వకాల్లో ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రముఖంగా ఎద్దుల తల బొమ్మలతో అలంకరించినట్లు ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఎద్దు తలల పరివేక్షణలో సమాధి ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాటి రోమన్ అంత్యక్రియలు, ఆచారాలు కాలక్రమేణ అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. నేటి కాలంలో దహనం చేయడం వంటివి చేస్తున్నారు, కానీ క్రీస్తూ శకం రెండో శతాబ్దంలో అంత్యక్రియ ఆచారాలు వేరుగా ఉండేవని వెలుగులోకి వచ్చిన సమాధిని బట్టి తెలుస్తోందని చెప్పారు పురావస్తు శాస్త్రవేత్తలు. నాటికాలంలో మరణాంతరానికి సంబంధించిన ప్రబలమైన నమ్మకాలు బలంగా ఉండేవని ఈ సమాధి అలంకరణే అందుకు నిదర్శనమేనని అన్నారు.(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..) -
తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!
ఇటలీలో ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అరుదైన సమాధి ఉంది. మూసివేసి ఉన్న దీని ప్రవేశమార్గాన్ని తెరిచి, లోపలకు ప్రవేశించిన శాస్త్రవేత్తలకు ఇందులో అరుదైన కుడ్యచిత్రాలు కనిపించాయి. గ్రీకు పురాణాల్లో వర్ణించిన అధోలోకానికి సంబంధించిన దృశ్యాలు ఈ కుడ్యచిత్రాల్లో ఉండటం విశేషం. ఇది కనీసం రెండువేల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా. సమాధి లోపలి గోడలపై చిత్రించిన ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం గ్రీకుపురాణాల్లో వర్ణించిన మాదిరిగానే ఉండటంతో, అధోలోకంపై విశ్వాసం కలిగిన పూర్వీకులు ఈ సమాధిని అధోలోక ప్రవేశమార్గంలా నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రీకు పురాణాల ప్రకారం ‘సెర్బరెస్’ అనే మూడుతలల జాగిలం అధోలోకానికి కాపలాగా ఉంటుంది. ఇటలీలోని నేపుల్స్నగర శివార్లలోని గిగ్లియానో పట్టణం వద్ద ఈ పురాతన సమాధి బయటపడింది. ఈ పరిసరాల్లోనే పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇదివరకు కూడా రోమన్ సామ్రాజ్య కాలానికి చెందిన పలు సమాధులు బయటపడ్డాయి. అవన్నీ క్రీస్తుపూర్వం 510 నుంచి క్రీస్తుశకం 476 మధ్య కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాటిలో ఇంత స్పష్టమైన కుడ్యచిత్రాలు లేవని, తాజాగా బయటపడ్డ ఈ సమాధి వాటికి భిన్నంగా ఉందని చెబుతున్నారు. ఈ సమాధికి వారు ‘టోంబ్ ఆఫ్ సెర్బరెస్’ అని పేరు పెట్టారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కోట!) -
3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి
భూమి తన గర్భంలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటి గురించి నేటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే ఈ రహస్యాలు కాలక్రమేణా ప్రపంచం ముందు బయటపడుతూనే ఉన్నాయి. టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలియని పెద్ద రహస్యంగా నిలిచింది. 1922 నవంబర్‌లో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్, అతని బృందం ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించినప్పుడు అనేక రహస్యాలు ప్రపంచానికి తెలియవచ్చాయి. ఎడారి గర్భంలో దాగిన సమాధి టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ఎడారి గర్భంలోనే దాగి ఉంది. 1922, నవంబర్ 4న కార్టర్ బృందం ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వారు ఇసుకలో ఖననం చేసిన సమాధి మెట్లను కనుగొన్నారు. తరువాత ఆ బృందం మెట్ల దారిని శోధించింది. నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను కనుగొన్నారు. కార్టర్, అతని బృందం అక్కడి తలుపునకు గల రంధ్రం నుంచి లోపలకి చూసి తెగ ఆశ్చర్యపోయారు. ఈవిధంగా వారు బంగారు నిధులతో నిండిన గదిని కనుగొన్నారు. 9 ఏళ్ల వయసులోనే పాలకుడు 1922, నవంబర్ 26న ఈ బంగారు నిధిని కార్టర్, అతని బృందం కనుగొంది. అయితే టుటన్‌ఖామెన్ మమ్మీ ఉన్న శవపేటికను చాలా కాలం తర్వాత కనుగొన్నారు. టుటన్‌ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. ఇతనిని కింగ్ టుట్ అని పిలిచేవారు. ఈజిప్ట్ ఫారో రాజు టుట్ 1333 బీసీలో కేవలం తన 9 సంవత్సరాల వయస్సులోనే ఈజిప్ట్ పాలకుడయ్యాడు. అతని పాలన అనంతరం అతను మరణించినప్పుడు, సంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్ది భద్రపరిచారు. అతని మమ్మీతో పాటు పలు కళాకృతులు, నగలు, నిధులు కూడా అతని సమాధిలో ఖననం చేశారు. అయితే కాలక్రమేణా ఈ సమాధి ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. ఎట్టకేలకు వీడిన మరణ రహస్యం కింగ్ టుట్ సమాధిలో వేలాది కళాఖండాలు, ప్రసిద్ధ శిరస్త్రాణం లభ్యమయ్యాయి. సమాధి నుండి బయటపడిన అమూల్య వస్తువుల జాబితాను రూపొందించేందుకు కార్టర్, అతని బృందానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. సమాధిని కనుగొన్న తరువాత కింగ్ టుట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఈజిప్షియన్ చక్రవర్తులలో ఒకరిగా గుర్తింపుపొందారు. శాస్త్రవేత్తలు, విద్యార్థుల పరిశోధన అంశంగా ఇతని చరిత్ర నిలిచింది. అయితే కింగ్ టుట్ ఎలా మరణించాడనేది చాలా కాలం మిస్టరీగానే మిగిలింది. ఈ రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కొందరు చరిత్రకారులు అంటుండగా, మరికొందరు ప్రమాదంలో మరణించాడంటారు. అయితే ఒక శతాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు డిజిటల్ ఇమేజింగ్, డీఎన్ఏ పరీక్షల ద్వారా కింగ్ టుట్ మలేరియాతో మరణించినట్లు కనుగొన్నారు. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? దీనిని ఎందుకు ధరిస్తారు? -
చైనా తొలి చక్రవర్తి సమాధికి పాదరస రక్షణ!
బీజింగ్: చైనాను పాలించిన మొట్టమొదటి చక్రవరి కిన్ షీ హువాంగ్. ఆయన సమాధికి పాదరసం(మెర్క్యూరీ)తో రక్షణ కలి్పంచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ద్రవ రూపంలో ఉండే లోహమే పాదరసం. ఇది విషపూరితమైంది. కిన్ క్రీస్తుపూర్వం 221 నుంచి 210 దాకా.. పదేళ్లపాటు డ్రాగన్ దేశాన్ని శాసించాడు. కిన్ సమాధిని కట్టుదిట్టంగా నిర్మించారు. షాన్షీ ప్రావిన్స్‌లో 1974లో రైతులు పొలం దున్నుతుండగా కిన్ షీ హువాంగ్ సమాధి బయటపడింది. చక్రవర్తి సమాధిని తెరిచే చూస్తే వినాశనం తప్పదన్న ప్రచారం బాగా వ్యాప్తిలో ఉంది. దీంతో, తెరిచే సాహసం చేయలేకపోయారు. సమాధికి సమీపంలో మట్టితో తయారు చేసిన సైనికులు, ఆయుధాలు, గుర్రాల విగ్రహాలు భారీగా బయటపడ్డాయి. మరణానంతరం కూడా చక్రవర్తిని కాపాడడానికి ఈ ‘టెర్రకోట ఆరీ్మ’ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చక్రవరి సమాధి చుట్టూ మెర్క్యూరీ లోహం స్వేచ్ఛగా కదులుతున్నట్లు పరిశోధకులు ఇటీవలే తేల్చారు. సమాధిని ఎవరూ తాకకుండా ఇలాంటి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. -
Taliban: ఎట్టకేలకు ఆ సమాధి వెలుగులోకి!
ముల్లా ఒమర్.. ప్రపంచం మొత్తం చర్చించుకున్న.. చర్చిస్తున్న ఇస్లామిక్ రెబల్ గ్రూప్ ‘తాలిబన్’ అలియాస్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ వ్యవస్థాపకుడు. అయితే.. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల మోహరింపు తర్వాత ఆయన ఏమయ్యాడనే మిస్టరీ చాలా ఏళ్లు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చివరికి ఆయన సమాధి తొమ్మిదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. తాలిబన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ముల్లా ఒమర్.. 2001 దాకా ఆ సంస్థకు ఎమిర్(అధినేత)గా వ్యవహరించారు. అయితే అదే ఏడాది అఫ్గన్‌లో అమెరికా-నాటో దళాల మోహరింపు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2013 ఏప్రిల్‌లో ఆయన అనారోగ్యం పాలై మరణించినట్లు.. రెండేళ్ల తర్వాత తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన్ని ఎక్కడ ఖననం చేశారు? ఆ సమాధి ఎక్కడుందనే విషయాలపై తాలిబన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పోయింది. ఈ తరుణంలో.. జబుల్ ప్రావిన్స్‌లోని సూరి జిల్లా దగ్గర ఒమర్జోలో ఆయన్ని ఖననం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం నిర్వహించగా.. ఆదివారం తాలిబన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్డించారు. సమాధిని ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో.. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తాలిబన్ గ్రూప్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకపోవడంతో విషయాన్ని బయటికి వెల్లడించారు. కాందహార్‌లో పుట్టి పెరిగిన ఒమర్.. ఉన్నత చదువులతో అపర మేధావిగా గుర్తింపు పొందాడు. అయితే.. 1993లో అఫ్గనిస్థాన్ అంతర్యుద్ధం కారణంగా తాలిబన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. తనను తాను స్వాతంత్ర సమరయోధుడిగా ప్రకటించుకున్న ఒమర్.. పాశ్చాత్య దేశాల తీరుపై విరుచుకుపడుతూ ఉండేవాడు. ఆయన హయాంలోనే తీవ్రవాద సంస్థగా ఎదిగిన తాలిబన్.. మహిళలపై కఠిన ఆంక్షలతో నరకరం చూపించింది. -
సవతి తల్లిని పాతిపెట్టాడు సరే! మరి ఆ సమాధి?
అంతుచిక్కని విషయాలపైన ఆసక్తి నెలకొనడం సహజమే!. అలాంటి జాబితాలో ప్రముఖంగా నిలిచేది టుటన్ఖమున్ సమాధి మిస్టరీ. ప్రాచీన ఈజిప్ట్ రాజు సమాధిగా, పాఠ్యపుస్తకాల్లో కర్స్ ఆఫ్ టుటన్ఖామున్గా ఇది ఎంతో ఫేమస్. ఈ సమాధిని తవ్వి బయటకు తీసిన తర్వాతే ఎన్నో చిత్ర-విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి చుట్టూరా ఎన్నో కథలు, మరెన్నో ప్రచారాలు పుట్టుకొచ్చాయి. అదే సమయంలో ఈ సమాధి ఆధారంగా ఆసక్తికర విషయాలను కనుగొంటున్నారు చరిత్రకారులు. ► సరిగ్గా వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సమాధి.. టుటంఖమన్ సమాధి అనేది చరిత్రకారులు చెప్పేమాట. కేవలం పదకొండేళ్లకు ఈజిప్ట్ ఫారోగా(చక్రవర్తి) బాధ్యతలు స్వీకరించిన టుటన్ఖమున్.. పంతొమ్మిదేళ్లకే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు(పరిశోధనల ఆధారంగా నిర్ధారణ). అతనెలా చనిపోయాడన్న విషయం.. ఇప్పటికీ మిస్టరీనే!. అయితే ఈ సమాధి మాత్రం ఎన్నో అంతుచిక్కని రహస్యాలను చేధించేందుకు పరిశోధకులకు, చరిత్రకారులకు ఒక అవకాశం ఇచ్చింది. ► సమాధిలో కుర్చీలు, రథాలు, ఖజానాలు, ఇతర విలాస వస్తువులు ఉంచారు. బంగారుమయమైన ఆ సమాధిలో ఊహించినదానికంటే ఎన్నో రెట్ల రహస్యాలు దాగి ఉండొచ్చని చరిత్రకారులు ఒక అంచనాకి వచ్చారు. ► టుటన్ఖమున్(టుటన్‌ఖాటెన్) క్రీస్తుపూర్వం 1341లో పుట్టిఉంటాడనే ఒక అంచనా ఉంది. ఈజిప్షియన్ భాష ప్రకారం.. గాలి, సూర్యుడి కలయిక పేరే టుటన్ఖమున్. చిన్నవయసులోనే శక్తివంతమైన రాజుగా అతనికి పేరు దక్కింది. కానీ, ఆ పేరుప్రఖ్యాత్యుల వల్లే అతన్ని హత్య చేసి ఉంటారని భావిస్తుండగా.. అతని చావుకి సవతి తల్లి నెఫెర్టిటికి ఏదో కనెక్షన్ ఉండి ఉంటుందని భావిస్తుంటారు చరిత్రకారులు. ► 1922లో హోవార్డ్ కార్టర్ ఈజిప్ట్ ఫారో టుటన్ఖమున్ సమాధి కనిపెట్టాడు. అయితే ఈ సమాధిని తాకిన వాళ్లు, చివరికి కథనాలు రాసిన వాళ్లు సైతం అనుమానాస్పద రీతిలో చనిపోవడం, ఏదో ఒక ప్రమాదానికి గురికావడంతో శపించబడ్డ సమాధిగా పేర్కొంటూ చాలా కాలంపాటు దాని జోలికి వెళ్లలేదు చరిత్రకారులు. అయితే.. ► కాలక్రమంలో దీనిపై పరిశోధనలు మళ్లీ మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే.. ఇప్పటివరకు కనుగొన్న ఫారోల సమాధుల్లో ఇదే చిన్నది కావడం!. దీంతో టుటన్‌ఖమూన్ నిజంగా ఫారోనేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ మిస్టరీకి సంబంధించిన ఆధారాలు దొరికాయింటూ తాజాగా బ్రిటీష్ ఈజిప్టాలజిస్టులు ముందుకు వచ్చారు. ► నెఫెర్టిటి.. అఖేనటెన్ భార్య. టుటన్ఖమున్కు సవతి తల్లి. టుటన్ఖమున్ కంటే ముందు ఈజిప్ట్‌ను పాలించింది. కానీ, ఆమె సమాధి మాత్రం ఎక్కడుందో ఇప్పటిదాకా తెలియలేదు. ► ప్రపంచంలో ఈజిప్ట్ నాగరికత మూలాలున్న ప్రతీచోటా తవ్వకాలు జరిపినా లాభం లేకుండా పోయింది. 18 ఈజిప్ట్ రాజకుటుంబాలకు చెందిన మమ్మీలకు డీఎన్ఏ టెస్టులు జరిపినా ఆ సమాధి దొరకలేదు. అయితే, నెఫెర్టిటి సమాధి వివరాలకు సంబంధించిన ఆధారం.. టుటన్ఖమున్ సమాధిలోనే దాగి ఉన్నాయని వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ► టుటన్ఖమున్ సమాధి పక్కనే రహస్య చాంబర్లో నెఫెర్టిటి సమాధి ఉండవచ్చని చాలా కాలం నుంచి కొన్ని వాదనలు ఉన్నాయి. అయితే.. అసలు టుటన్ఖమున్ సమాధినే.. నెఫెర్టిటి సమాధిలో భద్రపరిచారనే వాదనను ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ► టుటన్ఖమున్ను అతని తర్వాతి పాలకుడు ఫారో అయ్ సమాధి చేశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాల కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయని బ్రిటిష్ మ్యూజియం క్యూరేటర్‌గా గతంలో పని చేసిన నికోలస్ రీవ్స్ చెప్తున్నారు. ఆ చిత్రాల కింద.. నెఫెర్టిటిని టుటన్ఖమున్ సమాధి చేస్తున్న చిత్రాలు ఉన్నాయని రీవ్స్ చెప్తున్నాడు. ఆ తర్వాతి చిత్రాలు మమ్మీ నోరు తెరిచే కార్యక్రమం(మరణించిన వ్యక్తి ఐదు ఇంద్రియాలను పునరుద్ధరించడానికి) గురించి వివరిస్తున్నాయని పేర్కొన్నారు. ► ఎలాగైతే.. ఫారో అయ్ సమాధికి చేసిన డిజైన్ల కింద టుటన్ఖమున్ గురించిన వివరాలు ఉన్నాయో. అలాగే.. టుటన్ఖమున్ సమాధిలో నెఫెర్టిటి సమాధికి సంబంధించిన వివరాలు దాగి ఉన్నాయన్నది రీవ్స్ చెప్తున్న మాట. ► తన సవతి తల్లి నెఫెర్టిటి అంటే టుటన్ఖమున్కు అమితమైన ప్రేమ అయినా ఉండాలి. లేదంటే.. ద్వేషమైనా ఉండాలి. అందుకే ఆమె సమాధి ఎవరికీ చిక్కకుండా రహస్యంగా టుటన్ఖమున్ దాచి ఉంటాడనే భావిస్తున్నారు రీవ్స్. మరోవైపు అత్యంత శక్తివంతమైన రాణిగా నెఫెర్టిటి చరిత్రకు ఎక్కడంతో.. ఆమె సమాధిని ప్రత్యేక పరిస్థితుల్లో ఖననం చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. ► టుటన్ఖమున్ సమాధి మిగతా ఫారోలా కంటే భిన్నంగా ఉంటుంది. పైగా ఆ చాంబర్‌లోని డెకరేషన్ గోడపై మార్పులు ఉండడంతో.. అందులో రహస్య ఛాంబర్ ఉండొచ్చని, అందులోనే ఆమె సమాధిని దాచి ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ► అయితే.. టుటన్ఖమున్ సమాధి గురించి ఇలాంటి వాదనలు,రాతలు చాలా చేయొచ్చని అంటున్న రీవ్స్.. ఒకవేళ తన వాదనే నిజమైతే ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టుల అన్వేషణకు ఒక సమాధానం దొరకవచ్చని భావిస్తున్నారాయన. -
ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...
ఈజిప్ట్, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల్లో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు జరిపి పరిశోధనలు చేస్తుంటారు. మమ్మీలుగా పిలిచే పురాతన సమాధులను తెరిచి నాటి పూర్వీకులు ఎలా ఉండేవారు, ఎలా చనిపోయారు, ఏం ఉపయోగించేవారు వంటి విషయాలను వెల్లడించేవారు. అంతేకాదు ఆ సమాధి ఎన్నాళ్ల క్రితం నాటిది కూడా లెక్కగట్టి చెబుతారు. ఇలాంటి ఆసక్తకరమైన విషయాలు వెలికితీసే క్రమంలో ఇక్కడొక దేశంలో కనుగొన్న సమాధి చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సమాధిపై ఉండే హెచ్చరిక చూస్తే కచ్చితంగా వామ్మో! అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...ఇజ్రాయెల్‌లో గలీలీలోని యూదుల బీట్ షీయారిమ్ శ్మశానవాటికలో ఒక పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 65 ఏళ్ల క్రితం యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కనుగొన్న తొలి సమాధి ఇదేనని శాస్తవేత్తల అభిప్రాయం. ఆ సమాధిపై ఎరుపు రంగుతో ఒక హెచ్చరిక హిబ్రూ లిపిలో ఉంది. ఈ సమాధి తెరిచే సాహసం చేస్తే శపించబడతారనేరది ఆ హెచ్చరిక సారాంశం. ఈ సమాధి 18 వేల ఏళ్ల నాటిదని అన్నారు. మతం మార్చుకున్న జాకబ్ అనే యూదు వ్యక్తిదని చెబుతున్నారు. పైగా ఆ హెచ్చరికలో మీరు తెరవకూడాని వస్తువులు అంటూ వాటి వివరాలు కూడా ఉన్నాయి. ఈ సమాధిపై ఉన్న శాసనం చివరి రోపమన్ లేదా బైజాంటైన్ కాలానికి చెందినదని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇజ్రాయెల్ అంటే గతం, వర్తమానం, భవిష్యత్తుల సమాహారం అని ఒకరు, తెరవకూడని విషయాలు యూదులకు సరిహద్దులు అంటూ మరోకరు రకరకాలగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. Things you shouldn't open: - Pandora's Box - An umbrella indoors - Ancient graves An 1,800 year old grave marker for a Jewish man named Jacob the Convert was recently discovered in the Galilee. The marker included an inscription warning people against opening the grave. pic.twitter.com/9JHyBBH3aI — Israel ישראל (@Israel) June 8, 2022 (చదవండి: పాపం పెద్దాయన.. అది నేరమా? మండిపడుతున్న నెటిజన్లు) -
బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే సమాధి.. అధికారులు పట్టించుకోకపోవడంతో..
బాగేపల్లి(బెంగళూరు): బాగేపల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్. బి.నారాయణ స్వామి సమాధిని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో మట్టిలో కలిసిపోయేలా ఉంది. ఇటీవల ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఆదేశించినా కూడా పట్టించుకోలేదు. 1985లో అప్పటి సీఎం రామకృష్ణ హెగడె ప్రభావంతో రాష్ట్రంలో జనతాపార్టీ ధాటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కనుచూపు మేరలో లేకుండా పోయారు. కానీ బి.నారాయణ స్వామి ఆ హవాను ఎదిరించి బాగేపల్లిలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి గుండెపోటుతో కన్నుమూశారు. చిత్రావతి నది వంతెన పక్కన ఆయన అంత్యక్రియలు జరిపారు. ఇటీవల బాగేపల్లి మునిసిపాలిటీ అధికారులు డ్రైనేజీ కోసం తవ్వకాలు చేస్తుండగా ఆయన సమాది బయట పడింది. ఆయన స్మారకం ఇక్కడే నిర్మించాలని అధికారులకు ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి ఆదేశించినా పట్టించుకోకుండా సమాధిని మట్టిలో పూడ్చివేశారు. చదవండి: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే -
రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!
ఇంతవరకు ఈజిప్టులో పిరమిడ్ రూపంలో మమ్మీలుగా పిలిచే సమాధులు ఉన్నాయని మనం విన్నాం. అంతేగాక ఆ సమాధులు రాజ వంశానికి చెందిన వారివి అని, పైగా వారు వాడిన వస్తువులు అన్నింటిని ఆ సమాధిలో భద్రపరిచేవారని విన్నాం. కానీ ఈజిప్టులో ఇంకా కొన్ని సమాధులపై పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూ....పరిశోధనలు చేస్తూనే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఈజిప్టు పురావస్తు శాఖ ప్రస్తుతం ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించడమే కాక బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) అసలు విషయంలోకెళ్లితే....కైరోలోని పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. పైగా ఈ సమాధులను స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది. అంతేకాదు బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మిషన్ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు. పైగా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో కవర్‌తో కూడిన సున్నపురాయి శవపేటికను గుర్తించినట్లు చెప్పారు. అయితే సమాధి యొక్క ప్రాథమిక అధ్యయనాల్లో ఇది గతంలో పురాతన కాలంలో తెరివడబడినట్లు వాజీరి పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండోవ సమాధి మాత్రం త్రవ్వకాల సమయంలో మిషన్ సాయంతో దానిని మొదటిసారిగా తెరిచినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, మానవ ముఖంతో ఉన్న సున్నపురాయి శవపేటిక ఏ మాత్రం చెక్కు చెదరకుండా మంచి స్థితిలో రెండవ సమాధిలో ఉన్నట్లు మిషన్ త్రవ్వకాలను పర్యవేక్షించే హసన్ అమెర్ చెప్పారు. అయితే ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని హసన్ చెప్పారు. ఈ మేరకు హసన్ ఇటీవల కాలంలో ఈజిప్టులో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలతో సహా అనేక పురావస్తు ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
ఓయూలో సమాధి కలకలం.. దానిపై తాజా పూలు చల్లి ఉండటంతో..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. వారు తిరిగి వసతి గృహాలకు పరుగెత్తారు. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈసీహెచ్-1 వసతిగృహానికి దగ్గరగా చెట్ల మధ్య ఇది ఉంది. దానిపై తాజాగా చల్లిన పూలు ఉన్నాయి. చదవండి: ఓయూ క్యాంపస్‌లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్ అయితే అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉంటారని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు బస్తిలో ఉండే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క మూడు రోజుల కింద చనిపోతే దాన్ని ఆదివారం పూడ్చి పెట్టినట్లు ప్రత్యేక సాక్షి చెప్పడంతో.. ఓయూ అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: హైదరాబాద్: స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె.. నిలిచిన ఫుడ్ డెలివరీ -
కంఠీరవకు.. అభిమాన సంద్రం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్ రాజ్‌కుమార్ సమాధిని పెద్దసంఖ్యలో అభిమానులు సందర్శిస్తున్నారు. మంగళవారం పాలశాస్త్రం పూజలు ముగియడంతో బుధవారం నుంచి అనుమతించారు. విభిన్న రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తుమకూరు జిల్లా పావగడ నుంచి ఎద్దుల బండిలో కొందరు అభిమానులు వచ్చారు. వారు శివరాజ్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. పునీత్ దూరమైనప్పటికీ, అన్న శివ రాజ్కుమార్నే పునీత్‌గా భావించి అభిమానిస్తామని వారు చెప్పారు. శివరాజ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) నృతం చేసిన చిన్నారులు పునీత్ సమాధిని బాల నృత్యకారులు దర్శించుకుని నృత్యాంజలి సమర్పించారు. కెంగేరి సమీపంలోని నాట్యలోక డాన్స్ గ్రూపునకు చెందిన చిన్నారులు అలా నివాళులు అర్పించారు. పునీత్ బాల డ్యాన్సర్లను ఎప్పుడూ ప్రోత్సహించేవారని అన్నారు. -
పునీత్ సమాధిని దర్శించేందుకు ఫ్యాన్స్‌కు అనుమతి
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించేందుకు నేటి నుంచి అభిమానులకు అవకాశం కల్పించారు. శుక్రవారం పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మణంతో కన్నడిగులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానుల దర్శనార్థం కంఠీరవ సూడియోలో పునీత్ పార్థీవదేహన్ని ఉంచారు. కడసారి తమ అభిమాన హీరోని చూసేందుకు లక్షల్లో అభిమానులు తరలివచ్చారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! ఇక మంగళవారం పునీత్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పూజ అనంతరం ఆయన అన్న, హీరో శివ రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. అభిమానుల కోరిక మేరకు బుధవారం నుంచి పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏ ఊరిలోనైనా సాధారణంగా సమాధులు ఊరికి దూరంగా ఉంటాయి. ఇంట్లో గతించిన వారిని స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపి, కొన్నాళ్ల తరువాత సమాధి కడుతారు. ప్రపంచంలోని ఏ ఊరిలోనైనా ఈ ఆచారం కొనసాగుతుంది. చనిపోయిన వారి కోసం ఊరి చివర ఒక ప్రత్యేక స్మశాన వాటిక ఉండడం సాంప్రదాయం. కానీ ఇంటికి ముందే గతించిన వారి సమాధి ఉండడం, వారం వారం వాటికి పూజలు చేయడం ఆ ఒక్క ఊరిలోనే కనిపించే ఆచారం. గతించిన వారి ఆత్మల సన్నిధిలో తాము నివసించాలని, ఆ ఆత్మల ఆశీస్సులే తమకు అపురూపమని భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. అంతేకాదు.. తమ చింతలన్నింటినీ రూపుమాపి, తమ బ్రతుకులకు ఉత్సాహాన్ని నింపే స్వామి ‘చింతల మునిస్వామి’ అని భావిస్తూ తమ ఇంట్లో వండిన ప్రతి వంటకాన్ని ముందుగా ఆ స్వామికి నైవేధ్యంగా అందిస్తారు ఆ గ్రామస్తులు. తమ ఊరికి సమీపంలో ఉండే గంజిహళ్లి గ్రామ బడేసాహెబ్ వలి తాత పెట్టిన శాపంతో ఆ ఊరు మంచం లేని వింత ప్రపంచంగా మారింది. చిత్రం ఏమిటంటే ఏ ఇంటిలోనూ మనకు మంచమే అగుపించదు. నేలనే పాన్పుగా భావించి, నేలపై నిదురించే ఆ గ్రామవాసులు తమ ఇంటి ముందున్న సమాధులే తమకు శ్రీరామ రక్షగా భావిస్తుంటారు. స్మశానవాటిక లేని, మంచం వాడని, వింత ఆచారాలు కలిగి, సమాధులే అండదండగా భావిస్తోంది అయ్యకొండ గ్రామం. ఏడు తరాలుగా నిరంతరాయంగా, క్రమం తప్పకుండా ఈ ఆచారాలు పాటిస్తున్న ఆ గ్రామ వాసులను పలుకరిస్తే.. తాము నమ్మిన ఆచారాలను పాటించడంలోని ఒక చిత్తశుద్ధి, ఒక నియమపాలన కనిపిస్తుంది. వాటిపై ప్రత్యేక కథనం... గ్రామం గురించి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉంది అయ్యకొండ గ్రామం. కర్నూలుకు 61కిలో మీటర్లు దూరం ఉన్న ఈ గ్రామంలో 254 కుటుంబాలుండగా 1426 జనాభ ఉంటుంది. పురుషులు–768, స్త్రీలు–658 ఉన్నారు. ఊరంతా మాల దాసరి (ఒకే) కులం. గ్రామస్తులు చెప్పే చరిత్ర జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అయ్యకొండ గ్రామంలో ‘శ్రీ చింతల మునిస్వామి’ ఆలయం ఉంది. అక్కడి పెద్దల అభిప్రాయాల ప్రకారం... మూడున్నర శతాబ్ధాల క్రితం అయ్యకొండపై (అప్పట్లో ఊరు లేదు) చింతల మునిస్వామి తాత ఉండేవారు. ఇక్కడికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గంజిహళ్లి గ్రామంలో పెద్ద భూస్వామి ఇంట్లో ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా ఉండేవారు. ఓ రోజు యజమాని ఒక ఆవును తీసుకెళ్లి తన కూతురుకు ఇచ్చిరావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించారు. దీంతో ఆవును తీసుళ్తుండగా అది తప్పించుకొని వెళ్లిపోడంతో యజమాని ఆగ్రహించి, ఆవును వెతుక్కొని తేవాలని ఆదేశిస్తారు. దీంతో ఎల్లప్ప అడవిలో వెతుక్కుంటూ కొండపైకి వెళ్తారు. అక్కడ రాళ్ల గుహలో శబ్ధం రాగా రాళ్ల చాటు నుంచి తొంగి చూస్తారు. అక్కడ కూర్చున్న చింతల మునిస్వామికి తప్పించుకుపోయిన ఆవు పితకకుండానే పాలు ఇస్తుండడం, మునిస్వామి తాత దోసిలి పట్టి పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఎల్లప్ప. ఇది చూసి తాత శక్తులు కలిగిన స్వామిగా భావించి భూస్వామి వద్ద పని మానేసి.. మునిస్వామి చెంతకు చేరి సేవలు చేసుకుంటూ ఉండిపోతారు. ఇళ్ల మధ్యే సమాధులు చింతల మునిస్వామి వద్ద సేవలు చేస్తూ జీవిస్తున్న ఎల్లప్ప కుమారుడు బాల మునిస్వామి చనిపోయిన తరువాత తన ఇంటి ముందే సమాధి చేస్తారు. ప్రతి శనివారం ఆ సమాధికి ఆవు పేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించారట. కుటుంబాలు పెరుగుతూ పోవడం, ఆయుష్షు తీరి చనిపోయిన వారిని ఇళ్ల ముందే అంత్యక్రియలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. వండిన వంట మునిస్వామి చెంత ఆ రోజుల్లో చింతల మునిస్వామి తాత వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప తినడానికి సమీపంలోని గ్రామాలకు వెళ్లి అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామి చెంత ఉంచి, పూజించిన తరువాతే భుజించేవారట. అన్నంతో పాటు ఏ వంట అయినా ఇలా చేసేవారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వంశీయులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం, తీపి వంటలు.. ఇలా ఏ వంట వండినా ముందుగా చింతల మునిస్వామి ముందు పూజించిన తరువాతే నోటిలో పెట్టుకుంటున్నారు. అత్త ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆమెకు తెలియకుండా కోడలు చేసుకున్న వంట సైతం ఆలయంలోకి తీసుకెళ్లాలి. ఆమె వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరితోనైనా పంపించి, పూజ చేయించిన తరువాతే తినాలి. చివరకు మద్యం, సారా, కల్లు ఇలా ఏమి తాగాలన్నా తాత ముందు పూజ చేయాల్సిందే. మంచం వాడని వింత ప్రపంచం మంచం వాడని వింత ఊరుగా అయ్యకొండకు పేరు. గంజిహళ్లి బడేసాహెబ్ తాత, చింతల మునిస్వామి తాత ఇద్దరు స్నేహితులు. గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరుణాలకు ఆహ్వానించగా బల్లి రూపంలో వస్తారు బడేసాహెబ్ తాత. ఇది గ్రహించని మునిస్వామి తాత మంచంపై కూర్చొని ఉండి తిరుణాలకు రాలేదని బడేసాహెబ్ తాతపై కోప్పడుతారట. అప్పుడు ప్రత్యక్షమైన బడేసాహెబ్ తాత మంచంపై కూర్చున్న నువ్వు.. నేను వచ్చినా గ్రహించకుండా కోపగించుకుంటావా అని ఆగ్రహించి ‘మాల వాడికి మంచం లేదు.. నువ్వు మంచం వాడరాదని’ శపించారట. తాత మంచం వాడలేదని ఆ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మనిషి పుట్టిన తరువాతే ఆచారాలు పుట్టాయి. అయితే వాటి ప్రభావం మనుషులపై ఎంతో ఉంటుంది. ఆనాదిగా వస్తున్న ఆచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలను మనిషి ఎంతో విశ్వాసం కలిగి ఉంటాడు అనడానికి ఇవే నిదర్శనం. ఏడు తరాలుగా ఇవే ఆచారాలు : పెద్ద రంగన్న, అయ్యకొండ. ఏడు తరాలుగా మా కులదైవం శ్రీ చింతల మునిస్వామి తాతను ఆరాధిస్తూనే వస్తున్నాం. అప్పటి నుంచి ఏ వంట చేసినా ముందుగా తాత పాదాల చెంత ఉంచి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోం. తరాలు మారినా మా ఆచారాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిని కాదనే ఇళ్లు, మనిషి మా గ్రామంలోనే లేరు. స్మశానం ఉండదు.. ఇంటి ముందు సమాదులు : చిట్టెమ్మ గ్రామానికి ప్రత్యేకంగా స్మశానం ఉండదు. ఎవరు చనిపోయినా ఇంటి ముందు లేదా పక్కన ఖాళీ స్థలంలోనే అంత్యక్రియలు జరుపుతారు. వాటి మధ్యే మా జీవనం. ప్రతి శనివారం వాటిని శుభ్రం చేసి అగరొత్తులు వెలిగించి పూజించడం తరాలుగా వస్తున్న ఆచారాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం వాటి మధ్యే ఆడుకోవడం చేస్తుంటారు. ఏ వంట చేసినా తాతకు ముందుగా నైవేద్యం : నాగమ్మ మా గ్రామంలో వస్తున్న ఆచారాలను ఇప్పటికీ ఎవరూ కాదని వెళ్లరు. ఏ వంట చేసినా ముందుగా చింతల మునిస్వామి తాత చెంత పెట్టాలి. అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, పిండి వంటలు, చివరకు గుడ్డుతో ఆమ్లెట్ వేసుకున్నా నైవేధ్యంగా పెట్టి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోము. రోజుకు పది రకాల వంటలు, పది సార్లు వండినా తాతకు పెట్టాల్సిందే. కటిక నేలపైనే కాన్పు : శంకరమ్మ మా గ్రామంలో మంచం వాడరాదనే శాపం ఉంది. దీంతో ఊరిలోని ఏ ఇంట్లో చూసినా మంచం ఉండదు. నేలపైనే నిద్రిస్తాము. చివరకు కాన్పు జరిగినా కటిక నేలపైనే. పచ్చి బాలింత అయినా బొంత పరుచుకొని తల్లి, పిల్లలు కింద పడుకోవాలి తప్ప ఏ మంచాన్ని వాడరు. దీనిని ఎవరూ కాదనరు. -
తవ్వకాల్లో బయటపడ్డ 2,300 ఏళ్ల నాటి సమాధులు
చెన్నై : చెన్నిమలై సమీపంలోని కడుమనల్‌లో జరిగిన తవ్వకాల్లో 2,300 ఏళ్ల నాటి సమాధులు బయల్పడ్డాయి. ఈరోడ్ జిల్లా, చెన్నిమలై సమీపంలోని నొయ్యల్ నదీతీరంలో కడుమనల్ గ్రామముంది. ఇక్కడ సుమారు రెండువేల ఏళ్ల క్రితం నాటి మనుష్యుల ఆవాసాలకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 1981 నుంచి తంజావూరు, తమిళవర్సిటీ, రాష్ట్ర పురావస్తుశాఖ, పుదుచ్చేరి వర్సిటీ ఆధ్వర్యంలో కడుమనల్‌లో తవ్వకాలు జరుపుతూ వచ్చారు. ఈ తవ్వకాల్లో కడుమనల్‌లో 2 వేల ఏళ్ల క్రితమే మనుష్యులు ఉన్నత నాగరికతతో జీవించిన ఆధారాలు లభించాయి. విదేశాల్లో వాణిజ్య సంబంధాలు జరిగినట్లు, బంగారు ఆభరణాలు తయారీ, వివిధ వర్ణాల ప్రశస్తమైన రాళ్లకు నగిషీ పరిశ్రమలున్నట్లు కనుగొన్నారు. నెల రోజులుగా రాష్ట్ర పురావస్తుశాఖ ప్రాజెక్టు డైరక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ఏడుగురు కడుమనల్ ప్రాంతంలో తవ్వకాలు పనులు జరుపుతున్నారు. ఇందులో కడుమనల్లోని కల్లకాడు ప్రాంతంలో సుమారు 2,300 ఏళ్ల నాటి క్రితం ప్రజలు ఉపయోగించిన సమాధులు, అదే ప్రాంతంలోని కెలావనక్కాడు అనే చోట పరికరాలు, హారాలు తయారుచేస్తూ వచ్చిన పరిశ్రమల ఆనవాళ్లు కనుగొన్నారు. దీనిపై జె.రంజిత్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కొడుమనల్‌లో ప్రస్తుతం 8వ విడత తవ్వకాలు పనులు జరుపుతున్నామని, ఇక్కడ సుమారు 250 ప్రాంతాలలో సమాధులు బయల్పడినట్లు తెలిపారు. నాగరికతకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. -
కరుణ సమాధి పక్కనే నాది ఉండేది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణంతో మంగళవారం చెన్నైలో జరిగిన కార్యవర్గ అత్యవసర సమావేశం ఉద్వేగభరితంగా సాగింది. కరుణ కొడుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ సందర్భంగా పలుమార్లు తండ్రిని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చెన్నై మెరీనా బీచ్‌లో కలైజ్ఞర్‌కు సమాధి స్థలం దక్కకుంటే ఏమై ఉండేదని నన్ను చాలామంది అడిగారు, ఏముంది.. కరుణ సమాధి పక్కనే నాదీ ఉండేది. కానీ, ఆ అవసరం రాలేదు’ అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బగళన్ సమక్షంలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దురైమురుగన్, కనిమొళి, టీఆర్‌బాలు తదితర ముఖ్య నేతలతోపాటు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టగానే అందరూ లేచి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప తీర్మానంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కరుణానిధి సాధించిన విజయాలు, తీసుకున్న సంచలన నిర్ణయాలు, ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అధినేతతోపాటు తండ్రిని కోల్పోయా పలువురు పార్టీ నేతల ప్రసంగాల అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మీరంతా పార్టీ అధినేతను మాత్రమే కోల్పోయారు. కానీ, నేను అధినేతతో పాటు తండ్రికి సైతం దూరమయ్యా. గత ఏడాదిన్నరగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపుడు నన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. మీ అందరి సహకారంతో పార్టీ కార్యకలాపాలను నెట్టుకొస్తున్నా. పార్టీలో పునరుత్తేజం కోసం ప్రయత్నించా. ఆయనను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చా. డీఎంకేను మళ్లీ గెలిపించి అధికారం ఆయన చేతిలో పెట్టాలని అహర్నిశలు కృషి చేశా. అన్నా సమాధి పక్కనే కలైజ్ఞర్ సమాధి ఉండాలని నిర్ణయించాం. ఇది మన ఆశ కాదు, కరుణ కోరిక. అయితే కరుణ చివరి కోర్కెను తీర్చేందుకు ఈ ప్రభుత్వం నిరాకరించింది. సీఎం చేతులు పట్టుకుని బతిమాలినా సానుకూలంగా స్పందించకుండా ‘చూద్దాం’ అని మాత్రమే సమాధానమిచ్చారు. దురై మురుగన్‌ను పంపినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాం. ఒకవేళ మెరీనా బీచ్‌లో సమాధికి స్థలం కేటాయించకుంటే ఏమయ్యేదని అందరూ ప్రశ్నించారు. ఏముంది.. కరుణ సమాధి పక్కనే నన్ను సమాధి చేయాల్సి వచ్చేదని చెప్పా. కానీ, ఆ పరిస్థితి రాలేదు. కరుణ జీవించిఉన్నపుడేకాదు మరణించిన తర్వాతా గెలిచారు. ఆయన పార్టీని కాపాడుకుందాం, కరుణ ఆశయాలు సాధించేలా ప్రతినబూనాలి’ అని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో తరచూ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలంతా పార్టీ అధ్యక్షుడుగా స్టాలినే ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. -
జీవసమాధికి యత్నించిన లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్
గుంటూరు, మాచర్లరూరల్:ఆధ్యాత్మిక భావనతో జీవసమాధిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వవలసివచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డి అనే వృద్ధుడు ఇహలోక ఈతిబాధల నుంచి విముక్తి పొందేందుకు సజీవ సమాధిలోకి వెళ్లనున్నట్టు కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపాడు. అందుకు గాను 10 అడుగుల గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మాచర్ల తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్ఐ లోకేశ్వరరావు ఆగమేఘాలపై గన్నవరం గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మానవ జీవితం ఎంతో విలువైనదని, బతికుండగా జీవసమాధి చేసుకోవడం నేరమని లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. లచ్చిరెడ్డి మానసిక స్థితిని గమనించి, ఆయన మళ్లీ ఇటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా బాధ్యత తీసుకోవాలని కుమారులు రామకృష్ణారెడ్డి, అక్కిరెడ్డిలకు తెలిపారు. వీఆర్వో బి.వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
టుటన్ఖమున్ సమాధిలో రహస్యగది లేదు!
కైరో : 3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన ‘బాల రాజు’ టుటన్ఖమున్ సమాధి గుట్టు వీడింది. 19 ఏళ్ల వయసులోనే మరణించిన ఈ ఫారో పాలకుడి సమాధిలో అద్భుతమైన కళాఖండాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు బయటపడడంతో యావత్ ప్రపంచం దృష్టి సమాధిపై పడింది. సరిగ్గా ఇదే సమయంలో అందులో రహస్య గదులున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి స్థానిక అధికారులు కూడా ఉన్నాయన్నట్లుగానే సంకేతాలు పంపారు. అయితే సమాధిలో అటువంటి గదులేవీ లేవని తాజా పరిశోధనలో తేలింది. అది రహస్య గది కాదని, టుటన్ఖమున్ తల్లి రాణి నెఫ్రిటిటీదని చెబుతున్నారు. 2015లో ఇంగ్లిష్ ఆర్కియాలజిస్టు సమాధిపై సమగ్ర పరిశోధనలు జరిపి, ఆయా ప్రదేశాల చిత్రాలను స్కాన్ చేసి, ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం 3వేల ఏళ్ల క్రితం తన భర్త మరణం తర్వాత ఈజిప్టును నెఫ్రిటిటీ రాణి పాలించి, మంచి పాలకురాలిగా పేరుగాంచింది. అయితే చరిత్రలో ఎక్కడా ఆమె మరణం, సమాధి గురించి లేదని, తమ పరిశోధనలో మాత్రం ఈ సమాధిలోనే రాణి మృతదేహాన్ని, ఆమెకు సంబంధించిన ఆభరణాలను పెట్టారని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ఫ్రాన్సెస్కో పోర్సెల్లీ తెలిపారు. -
నాడు సమాధి.. నేడు శివాలయం
న్యూఢిల్లీ : కుతుబ్ షా కాలం నాటి గుర్తు తెలియని వ్యక్తి సమాధి అది. ఒకప్పుడు ఊరి చివర ఉన్న ఆ సమాధి కాస్తా జనాభా పెరిగే కొద్ది ప్రస్తుతం ఊరు మధ్యలోకి వచ్చింది. రాజుల కాలం నాటి ఈ సమాధిని తమ అధీనంలోకి తీసుకుని పరిశీలించాలని పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నించారు, అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. కానీ ఆశ్చర్యంగా కొన్ని నెలల్లోనే ఆ సమాధిని కాస్తా ఆలయంగా మార్చి పూజ, పునస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఎనక్లేవ్ ప్రాంతంలో ఉన్న హుమాయున్ గ్రామంలో చోటుచేసుకుంది. కుతుబ్ షా కాలం నాటి గుర్తు తెలియని వ్యక్తి సమాధి కాస్తా ఇప్పుడు ‘శివ్ భోలా’ ఆలయం అయ్యింది. దీని గురించి స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కళలు, సాంస్కృతిక, భాషా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆదేశించారు. దీనిపై సిసోడియా స్పందిస్తూ.. ‘ఈ సంఘటన గురించి నాకు ఎటువంటి సమాచారం తెలియదు. ఒక చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయడం, దానికి హాని కల్గించడం రెండు నేరమే. ఇందుకు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది. పురావస్తు శాఖ అధ్వర్యంలో ఉన్న చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ శాఖదే. చారిత్రక కట్టడాలకు ఎవరైనా హాని కల్గిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా పురావస్తు శాఖ అధికారులకు ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు పూర్తి వివరాలు ఇవ్వాలని పురావస్తు శాఖ వారిని ఆదేశించిడం జరిగింది. దీనికి బాధ్యులేవరైనా కఠిన శిక్ష తప్పద’ని స్పష్టం చేశారు. -
ఉద్యోగంలో ఇమడలేకనే..
చిత్తూరు, బి.కొత్తకోట : తండ్రి మరణంతో డీఈవోలో వచ్చిన అటెండర్ ఉద్యోగంలో ఇమడలేకనే డి.శ్రీకాంత్‌రెడ్డి (27) ఆత్మహత్యకు పాల్పడినట్టు స్పష్టమైంది. మృతు ని తల్లి డి.రమాదేవి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఈ విషయం వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసినట్టు ఇన్చార్జ్ ఎస్ఐ కేవీహెచ్ నాయుడు శుక్రవారం తెలిపారు. మృతుడి తల్లి రమాదేవి కథనం మేరకు.. శ్రీకాంత్‌రెడ్డి మిత్రులతో సరదాగా గడిపేవాడు. ఏడాదిన్నర క్రితం టీచరైన తండ్రి వెంకటరెడ్డి మృతిచెందగా శ్రీకాంత్‌రెడ్డికి డీవోఈ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం వచ్చింది. ఏడు నెలలుగా విధుల్లో ఉన్నప్పటికీ అందులో ఇమడలేకపోయాడు. తల్లితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పేవాడు. కొంతకాలం అలవాటు పడితే అన్నీ సర్దుకుంటాయని తల్లి చెబుతూ వచ్చారు. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్కడో పుట్టి ఇక్కడే సమాధి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపులకు చెందిన డి.వెంకటరెడ్డి ఉద్యోగ రీత్యా బి.కొత్తకోట మండలం గుంతావారిపల్లెకు వచ్చారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పీటీఎం మండలంలో పనిచేస్తూ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని గుంతావారిపల్లె సమీపంలో కొనుగోలు చేసిన భూమి లోనే సమాధి చేశారు. బుధవారం రాత్రి కొడుకు ఉరి వేసుకొని మృతిచెందాడు. ఆత్మహత్య లేఖలో డాడీ దగ్గరే ఉంటానని రాసినట్టుగానే శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని తండ్రి సమాధి ఎదుటే పూడ్చారు. స్నేహ బంధాన్ని చాటిన మిత్రులు: శ్రీకాంత్‌రెడ్డి మదనపల్లెలో చదివాడు. ఆ సమయంలో ఏర్పడిన మిత్రులు ఇప్పటికీ అలాగే కొనసాగారు. బుధవారం రాత్రి సారీ మా, బైబై వెళ్లిపోతున్నా అంటూ పంపిన వాయిస్ రికార్డు విన్నప్పటి నుంచి మిత్రులు అతనితో మాట్లాడేందుకు ఫోన్లో విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం అంత్యక్రియలు ముగిసే వరకు సుమారు 40 మంది మిత్రులు వెన్నంటే ఉన్నారు. అమ్మా క్షమించు.. -
సమాధులపై సమాధానం ఏమిటో?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని అనేక పర్యాటక ప్రాంతాల్లో అతి ప్రతిష్టాకరమైన చెన్నై మెరీనాబీచ్‌లోని మాజీ సీఎంల సమాధుల ఉనికి ప్రశ్నార్థకమైంది. వాతావరణ, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలితల సమాధులు నిర్మించారంటూ సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి గతంలో వేసిన పిటిషన్లో అనూహ్యమైన కదలిక చోటుచేసుకుంది. మూడు సమాధులు తొలగించాలని పిటిషనర్ చేసిన వాదనకు మద్రాసు హైకోర్టుకు ప్రభుత్వం ఎలాం టి సమాధానం ఇవ్వనుందో అనే ఆసక్తి నెలకొంది.చెన్నై నగరం అనగానే పర్యాటకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సుందరమైన మెరీనాబీచ్ తీరం, అందులో అందంగా నిర్మించిన అన్నాదురై, ఎంజీఆర్ సమాధులు. నగరానికి వచ్చిన వారు వీటిని సందర్శించకుండా పోరం టే అతిశయోక్తి కాదు. నిత్యం వందలాది మందితో సమాధులు కిటకిటలాడుతుంటాయి. ఎంజీఆర్ సమా«ధి పక్కనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి కూడా చోటుచేసుకోవడంతో రద్దీ మరిం త పెరిగింది. సముద్రతీరంతోపాటు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల సమాధులు కూడా చూడవచ్చేవారితో జనసంద్రంగా మారిపోతోంది. అన్నాదురై, ఎంజీఆర్ సమాధులకు దీటుగా జయలలితకు రూ.15 కోట్లతో స్మారకమండపం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకు సంబంధించి అనేక ఆర్కిటెక్చర్లను పిలిపించి ప్లాన్లను పరిశీలిస్తోంది. సమాధులపై అభ్యంతర పిటిషన్:ఇదిలా ఉండగా, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టే ఆందోళనతో రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సా మాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి సమాధులపై దృష్టిసారించారు. జయలలిత స్మారక మండప నిర్మాణంపై నిషే ధం విధించాలని, అన్నాదురై, ఎంజీఆర్ సమాధులను కూడా మెరీనా తీరం నుం చి తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో గతంలో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌లోని వివరాల ప్రకారం.. సముద్రపు ఒడ్డు నుంచి 500 మీటర్లలోపు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదని సముద్రతీర పర్యావరణ నిబంధనల్లో పేర్కొని ఉండగా అన్నాదురై, ఎంజీఆర్ సమాధులను నిర్మించి ఉన్నారని కోర్టుకు ఆయన తెలిపారు. ఇప్పటికే నిబంధన ఉల్లంఘన జరిగి ఉండగా మెరీనాబీచ్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధివద్ద రూ.15 కోట్లతో స్మారకమందిరం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. మెరీనాతీరంలో ఉధృతంగా సాగిన జల్లికట్టు ఉద్యమం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ పరిసరాల్లో నిరంతర 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. సమాధుల సందర్శనకు పెద్ద సంఖ్యలో జనం వచ్చే మెరీనాతీరంలో 144వ సెక్షన్ అమలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి అనేక కారణాల దృష్ట్యా మూడు సమాధులను మెరీనాతీరం నుంచి తొలగించి చెన్నై గిండీలోని గాంధీపార్కు ప్రాంగణంలోకి తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరాబెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందరం రెండువారాల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. -
ఆ సమాధి ఏ కాలానిది?!
సాక్షి, ఏథెన్స్ : మానవ జాతి వృద్ధి ఎక్కడ జరిగింది..? మనిషి ప్రయాణం ఎక్కడనుంచి ఎక్కడకు సాగింది? ప్రపంచంలో పురాతన నాగరికతలు ఏవి? మనిషి నేడు సాధించిన టెక్నాలజీకన్నా.. ఇనుప, కాంస్య యుగంలోవారే.. అధికంగా సాధించారా? ఇటువంటి ప్రశ్నలు మనిషిని అప్పుడప్పుడూ వేధిస్తుంటాయి.. అందుకు అనుగుణంగానే ప్రపంచంలో ఏదోమూల ఏదో ఒక వింత, విశేషం బయటపడుతూ ఉంటుంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్కు 100 కిలోమీటర్ల దూరంలో అత్యంత పురాతన మైనటొక సమాధి బయటపడింది. పురాతనం అనుకుంటే.. ఏదో సాదాసీదా కాదు.. సుమారు 3,500 ఏళ్ల నాటిది అని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ సమాధి కాంస్య యుగం నాటికి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమా సమాధి? ఏమిటా కథ? ఈ సమాధి ( చిన్నసైజు డబుల్‌బెడ్ రూం అంత ఉంటుంది) నాటి గ్రీస్‌లోని సంపన్నవర్గానికి చెందినదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సమాధిలో స్కెల్టెన్కు అత్యంత ఖరీదైన బంగారు ఆభరణాలు, చేతులకు స్వర్ణ కంకణాలు, ఇతర విలువైన సామగ్రి అందులో లభించింది. సమాధిలో..! సమాధిలో చనిపోయిన వ్యక్తికి 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని, మిసీనియన్ నాగరికతకు చెందిన వ్యక్తిగా పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమాధిలో ఆభరణాలతో పాటు మృణ్మయపాత్రలు, విల్లంబులు, పురాతన మద్యం, బాణసంచా ఉన్నాయి సమాధి నిర్మాణం సమాధి నిర్మాణం కూడా అత్యంత పటిష్టంగా నిర్మించారు. సమాధిని పగలగొట్టడానికి కూడా సాధ్యం కాకుండా.. పెద్దపెద్ద బండరాళ్లతో నాలుగువైపులా.. పైన నిర్మించారు. సమాధి 21 అడుగుల ఎత్తు ఉంటుంది. చుట్టూ బంకమట్టి, ఇతర పదర్థాలతో సిమెంట్లా ప్లాస్టింగ్ చేశారు. ఈ సమాధి వల్ల కాంస్యయుగంలో ముఖ్యంగా గ్రీకు నాగరికత ఎలా విలసిల్లిందో తెలుసుకోవచ్చని ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆనాటి సామాజిక, ఆర్థిక, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. -
చిన్నమ్మ ఓదార్పు
► మృతుల కుటుంబాలకు సాయం ►166 మందికి తలా రూ. మూడు లక్షలు ► ఇద్దరికి వైద్యఖర్చులకు రూ. లక్ష ► అమ్మ సమాధి వద్ద మరో వృద్ధురాలు ఆత్మహత్య అమ్మ జయలలిత మరణ సమాచారం తో గుండెలు ఆగి, బలవన్మరణాలతో విగతజీవులైన వారి కుటుంబాలను చిన్నమ్మ శశికళ ఓదార్చారు. తొలి విడతగా 166 మంది కుటుంబాలకు తలా రూ.3 లక్షలు చొప్పున సాయం అందించారు. ఇదిలా ఉంటే మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్ద ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలు మరణించారు. సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ, దివంగత సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలి సిందే. ఆందోళన వద్దంటూ పార్టీ వర్గాలు భరో సా ఇస్తూ వచ్చినా, కేడర్‌లో మాత్రం ఉత్కంఠ తప్పలేదు. తమ ముందుకు మళ్లీ వస్తారనుకున్న అమ్మ ఇక లేరన్న సమాచారంతో వందలాది గుండె లు పగిలాయి. మరెందరో బలవన్మరణాలకు పాల్ప డ్డారు. అమ్మ మరణం తట్టుకోలేక గుండెలు ఆగి, ఆత్మహత్యలతో ఐదు వందల మందికి పైగా మరణించినట్టు అన్నాడీఎంకే కార్యాలయం స్పష్టం చేసింది. వీరి కుటుంబాల్ని ఆదుకునే విధంగా తలా రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఓదార్పు అమ్మ లేరన్న సమాచారంతో మరణించిన వారి కుటుంబాల్ని ఓదార్చేందుకు చిన్నమ్మ శశికళ నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాతో రాయపేటలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబాల్ని చిన్నమ్మ ఓదార్చారు. సానుభూతి తెలియజేయడంతోపాటుగా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. తొలి విడతగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కడలూరు, విల్లుపురం, సేలం, పెరంబలూరు, అరియలూరు, మధురై జిల్లాల్లోని 166 మంది బాధిత కుటుంబాలకు తలా రూ.3 లక్షలకు చెక్కులను అందజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు తలా రూ.50 వేలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నమ్మ తమ మీద అమ్మ ప్రేమ చూపించి ఆదుకున్నారని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమై, కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఇక, పోయెస్ గార్డెన్ లో చిన్నమ్మ శశికళను రాష్ట్రానికి చెందిన బాస్కెట్ బాల్, రగ్బీ క్రీడాకారులు కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సమాధి వద్ద ఆత్మహత్య: చెన్నై మెరీనా తీరంలో దివంగత సీఎం జయలలిత శాశ్వత నిద్రలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యం వేలాది మంది తరలి వచ్చి అమ్మ సమాధిని దర్శించుకుంటూ వెళ్తున్నారు. అమ్మ మరణం తట్టుకోలేక తీవ్ర వేదనలో మునిగి స్పృహ తప్పే కార్యకర్తలు ఇక్కడ ఎక్కువే. అందుకే వారి కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ లను సైతం సిద్ధం చేసి ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వ్యాసార్పాడికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటీన ఆసుపత్రికి తరలించి రక్షించారు. చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి అమ్మ సమాధి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలు స్పృహ తప్పారు. ఆమె నోట్లో నుంచి నురగలు రావడం, ఆమె చేతిలో క్రిమి సంహారక మందు బాటిల్ ఉండడంతో ఆగమేఘాలపై ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మరణించింది. ఆమెకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించక పోవడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచి ఉన్నారు. -
జయలలిత సమాధి దగ్గర విషాదం
-
జన సందోహం
► అమ్మ సమాధి వద్దకు అభిమాన సందోహం ►వాటర్ బాటిళ్లు, అల్పాహారం పంపిణీ ►నిఘా కట్టుదిట్టం ►కమిషనర్ జార్జ్ పర్యవేక్షణ ►కాంస్య విగ్రహం ఏర్పాటుకు కసరత్తులు అమ్మ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమాన, ప్రజా సందోహం తండోపతండాలుగా మెరీనాతీరానికి తరలి వస్తున్నారు. అభిమానుల తాకిడి మూడో రోజుగా గురువారం మరింత పెరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్ల ద్వారా క్యూలైన్ ఏర్పాటు చేసి, తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తగు చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు, అధికార వర్గాలు చేపట్టారుు. ఇక, అభిమాన, జన సందోహానికి వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు, అల్పాహారం అందించే పనిలో జయ పేరవై వర్గాలు నిమగ్నమయ్యారుు. - సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: మహానాయకురాలు అమ్మ జయలలిత భౌతికంగా అందర్నీ వీడి గురువారంతో నాలుగు రోజులైంది. ఆమెను తలుచుకుంటూ లక్షలాది హృదయాలు అమ్మ..అమ్మ అని రోదిస్తున్నారు. మరెన్నో లక్షలాది హృదయాలు మళ్లీ రావమ్మా ...అంటూ తమ తంగ తాయ్(బంగారు తల్లి)ని తలచుకుంటూ కన్నీటి పర్యంతంలో మునిగారు. పదుల సంఖ్యలో మరెన్నో హృదయాలు బరువెక్కి, చివరకు అమ్మా నీ వెంటే అన్నట్టు మృత్యు ఒడిలోకి చేరుతున్నారుు. బుధవారం నాటికి 77 మంది అమ్మ కోసం గుండె పగిలి మరణించగా, గురువారం మరో తొమ్మిది గుండెలు ఆగారుు. ఇక, అమ్మ భౌతిక కాయాన్ని దగ్గరుండి దర్శించుకోలేని పరిస్థితి నెలకొనడంతో, ప్రస్తుతం ఆమె సమాధికి చేరువలో చేరి అభిమాన లోకం తమ ఆవేదనను, తమ గుండెల్లోని బాధను దిగ మింగుకోలేక బోరుమని విలపిస్తున్నారుు. మెరీనా తీరంలో రాజకీయ గురువు దివంగత ఎంజీఆర్ సమాధికి కూత వేటు దూరంలో శాశ్వత నిద్రలో ఉన్న అమ్మ సమాధిని దర్శించుకునేందుకు అభిమాన, జన సందోహం తండోప తండాలుగా పోటెత్తే పనిలో పడ్డారు. మూడో రోజుగా వేలాది మంది తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి అన్నాడీఎంకే వర్గాలు, పోలీసులు ఆగమేఘాలపై ప్రత్యేక ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చెన్నై, శివారుల నుంచే కాదు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కొందరు తమ సొంత వాహనాల్లో, మరి కొందరు రైళ్లల్లో, ఇంకొందరు బస్సుల్లో తరలి వచ్చి అమ్మ సమాధిని దర్శించుకొని కన్నీటి పర్యంతంతో నివాళులర్పిస్తున్నారు. కొందరు అరుుతే, చేతిలో అమ్మ చిత్ర పటాలను, మరి కొందరు అమ్మ ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఊరేగింపుగా సమాధి వద్దకు పోటెత్తుతున్నారు. కొందరు శిరోముండనం చేరుుంచుకుంటున్నారు. మరి కొందరు చేతిలో కర్పూరం వెలిగించి పురట్చి తలైవీ సమాధి వైపుగా హారతి పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు సైతం అమ్మా మళ్లీ ఓ సారి రావా..? అమ్మా నీ లోటు మాకు తీర్చేదెవ్వరో..?అని విలపిస్తున్నారు. నిఘా కట్టుదిట్టం: నిత్యం జన, అభిమాన సందోహం మెరీనా వైపుగా పోటెత్తుతుండడంతో అన్నాడీఎంకే వర్గాలు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, ఎమ్మెల్యే అలెగ్జాండర్ నేతృత్వంలో అన్నాడీఎంకే కార్యకర్తలు స్వచ్ఛందంగా అమ్మ సమాధి వద్దకు వస్తున్న జన సందోహం కోసం వాటార్ బాటిళ్లు, ప్యాకెట్లు, కిచిడి, పొంగల్, సాంబారు అన్నం వంటి వాటిని ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. ఇక, జనం ఒకేసారిగా సమాధి వైపు దూసుకు రాకుండా, పకడ్బందీ చర్యలు చేపట్టారు. బారికేడ్లను ఏర్పాటు చేసి, క్యూలైన్ ద్వారా లోనికి అనుమతించే పనిలో పడ్డారు. సమాధి వద్ద రెండు వందల మంది భద్రతా సిబ్బంది నియమించారు. ఆ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు, జనం తోపులాటకు ఆస్కారం ఇవ్వకుండా మరింతగా సిబ్బందిని నియమించారు. రోడ్డుపైన వాహనాలు ఆగకుండా, నిలపకుండా, తగు చర్యలు తీసుకున్నారు. అన్ని వాహనాలు మెరీనా బీచ్‌లోని పార్కింగ్ వైపుగా మళ్లించేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ జార్జ్ అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కాంస్య విగ్రహం: సీఎం జయలలిత సమాధి వద్ద ఆగమేఘాలపై ఏర్పాట్లు సాగుతున్నారుు. సమాధి చుట్టూ సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు . అమ్మ సమాధిని దర్శించేందుకు వస్తున్న జనం ఓ వైపు రాక, మరో వైపు బయటకు వెళ్లేందుకు తగ్గట్టు చర్యలు తీసుకున్నారు. జనం ఎవ్వరూ ఆ పరిసరాల్లోనే తిష్ట వేయడానికి వీలు లేని విధంగా ముందుకు సాగేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ఎంజీఆర్ సమాధి సందర్శన, అక్కడి నుంచి అమ్మ సమాధి వైపుగా క్యూలను ఏర్పాటు చేశారు.ఇక, సమాధి వద్ద అమ్మ కాంస్య విగ్రహాన్ని ఒకటి రెండురోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే, నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడానికి తగ్గ కసరత్తుల్ని అన్నాడీఎంకే వర్గాలు వేగవంతం చేశారుు. -
మృతదేహాలతో శ్మశానానికి వెలుగులు
అపర ధనవంతుడైనా, కటిక పేదవాడైనా చివరకు వెళ్లేది ఆరడుగుల గోతిలోకే. అయితే ప్రస్తుతం ఆ కాసింత స్థలం కోసం కూడా చావుతిప్పలు పడాల్సి వస్తోంది. నగర సరిహద్దుల పరిధిలో సమాధి చేయడం నిషేధిస్తూ కొన్ని నగరాల్లో చట్టాలు కూడా చేస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సమస్య పరిష్కారానికి ‘సమాధుల ఆకాశహర్మ్యాలు’ నిర్మించాలని పలువురు ఆర్కిటెక్ట్‌లు సూచిస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... కొలంబియా యూనివర్సిటీ డెత్ ల్యాబ్ డిజైనర్లు మాత్రం విభిన్న ఆలోచన చేస్తున్నారు. మృతదేహాలను డీకంపోజిషన్ చేయడం ద్వారా శ్మశానానికి వెలుగులు నింపాలన్నది వీరి ప్రతిపాదన. ఈ పద్ధతిలో డీకంపోజిషన్(కుళ్లడం) ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చనున్నారు. సమాధుల లోపల, శ్మశాన రహదారుల వెంబడి ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలపై అమర్చే ‘మెమోరియల్ వెసెల్స్’లో మానవ అవశేషాలు, సూక్ష్మజీవులను నింపుతారు. దీని ద్వారా డీకంపోజిషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. మృతదేహం శిథిలం అవుతుండడంతో ఈ వెసెల్స్ కాంతివంతంగా వెలుగుతాయి. దీంతో ఆప్తులు మరణించినా ఈ వెలుగుల్లో వారు జీవించి ఉన్నారనే భావన కలుగుతుందని డిజైనర్లు చెబుతున్నారు. ‘భవిష్యత్తు స్మృతివనాలు’ అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ బాత్ నిర్వహించిన పోటీలో వీరు విజేతలుగా కూడా నిలిచారు. దీనికి సంబంధించి ప్రాథమిక నమూనా రూపొందించడానికి ఈ వేసవిలో నెలరోజుల పాటు వీరు యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో అధ్యయనం చేపట్టనున్నారు.