బుధవారం ఉదయం కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధిని దర్శించుకుంటున్న అభిమానులు
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్ రాజ్‌కుమార్ సమాధిని పెద్దసంఖ్యలో అభిమానులు సందర్శిస్తున్నారు. మంగళవారం పాలశాస్త్రం పూజలు ముగియడంతో బుధవారం నుంచి అనుమతించారు. విభిన్న రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తుమకూరు జిల్లా పావగడ నుంచి ఎద్దుల బండిలో కొందరు అభిమానులు వచ్చారు. వారు శివరాజ్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. పునీత్ దూరమైనప్పటికీ, అన్న శివ రాజ్‌కుమార్‌నే పునీత్‌గా భావించి అభిమానిస్తామని వారు చెప్పారు. శివరాజ్ వారిని ఆప్యాయంగా పలకరించారు.
చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు)
నృతం చేసిన చిన్నారులు
పునీత్ సమాధిని బాల నృత్యకారులు దర్శించుకుని నృత్యాంజలి సమర్పించారు. కెంగేరి సమీపంలోని నాట్యలోక డాన్స్ గ్రూపునకు చెందిన చిన్నారులు అలా నివాళులు అర్పించారు. పునీత్ బాల డ్యాన్సర్లను ఎప్పుడూ ప్రోత్సహించేవారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment