Kanteerava Stadium
-
కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా ‘సిద్ధూ’ ప్రమాణ స్వీకారం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక కేబినెట్ శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేదిక నిలిచింది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు.ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్ సూచనప్రాయంగా బయటపెట్టింది. #WATCH | Opposition leaders display their show of unity at the swearing-in ceremony of the newly-elected Karnataka government, in Bengaluru. pic.twitter.com/H1pNMeoeEC — ANI (@ANI) May 20, 2023 హాజరైన ప్రముఖులు వీళ్లే.. ►తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ సీఎం నితీష్ హాజరు ►తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్ పవార్, ఫారుఖ్ అబ్ధుల్లా ► కమల్ హాసన్, శివరాజ్ కుమార్. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే తొలి కేబినెట్ బేటీ: రాహుల్ గాంధీ మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎన్నికలకు ముందు మేం ఏం చెప్పామో అవే చేస్తాం. 5 వాగ్దానాలు చేశాం. ఈ కేబినేట్ భేటీలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’ అని తెలిపారు. #WATCH | We made 5 promises to you. I had said we don't make false promises. We do what we say. In 1-2 hours, the first cabinet meeting of the Karnataka govt will happen and in that meeting these 5 promises will become law: Congress leader Rahul Gandhi pic.twitter.com/hhsancnayq — ANI (@ANI) May 20, 2023 -
సిద్దూ, డీకేఎస్ అండ్ కో ప్రమాణం రేపే
బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు(శనివారం, మే 20) ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ కూర్పు కోసం సిద్ధూ, డీకేఎస్‌లు కలిసి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లారు. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్యనేతలను కలిశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ‘‘మంత్రి వర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇంఛార్జితో చర్చించాక సిద్ధం చేశారని, దీనికి పార్టీ అధ్యక్షుడి ఆమోదం లభించడమే తరువాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే(మల్లికార్జున ఖర్గే తనయుడు) పేర్కొన్నారు. ఇప్పటికే కేబినెట్ లిస్ట్‌కు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్డోర్ స్టేడియంలో శనివారం ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. -
పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ..
Puneet Rajkumar : అర్ధాంతరంగా నిష్క్రమించిన యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సమాధిని అభిమానులు పెద్దసంఖ్యలో సందర్శిస్తుండడంతో బెంగళూరు కంఠీరవ స్టూడియో రద్దీగా మారింది. ఆదివారం సెలవు కావటంతో వేల సంఖ్యలో అభిమానులు దర్శించుకుని స్మరించుకొన్నారు. తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అభిమానులు కంఠీరవకు క్యూ కట్టారు. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు అనే తేడా లేకుండా తరలివచ్చారు. సుమారు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. నేడు 11 రోజుల శాస్త్రం పునీత్ మరణించి సోమవారానికి 11 రోజులు అవుతుంది, ఇంటి వద్ద 11వ రోజు సంస్మరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు అన్నదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నేత్రదానాలు ముమ్మరం పునీత్ నేత్రదానంతో స్ఫూర్తి పొందిన వందలాది మంది మరణానంతరం నేత్రాలను దానం చేస్తామని ఆస్పత్రులకు రాసి ఇస్తున్నారు. బెంగళూరు నగరంలో రోజూ రెండు వేల మంది నేత్రదానం చేయడానికి ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు. ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా నేత్రదానం చేస్తానని ప్రకటించారు. -
త్వరలో పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగా
బెంగళూరు: కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధిని బుధవారం నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు దర్శించుకొంటున్నారు. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్‌కు వీరాభిమానులు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరు శనివారం పునీత్ సమాధిని దర్శించుకున్నారు. త్వరలో ఇక్కడే పెళ్లి చేసుకొంటామని తెలిపారు. ఇందుకు శివరాజ్‌కుమార్ కూడా సమ్మతించారని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పునీత్‌కు అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. చామరాజనగర వద్ద జరిగిన గోరె హబ్బలో రాజ్, పునీత్‌ల చిత్రాన్ని ప్రదర్శించారు. చదవండి: (పునీత్‌కు అప్పటికే చెమటలు పట్టాయి.. అందుకే అక్కడకు వెళ్లాలని సూచించా..) -
కంఠీరవకు.. అభిమాన సంద్రం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్ రాజ్‌కుమార్ సమాధిని పెద్దసంఖ్యలో అభిమానులు సందర్శిస్తున్నారు. మంగళవారం పాలశాస్త్రం పూజలు ముగియడంతో బుధవారం నుంచి అనుమతించారు. విభిన్న రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తుమకూరు జిల్లా పావగడ నుంచి ఎద్దుల బండిలో కొందరు అభిమానులు వచ్చారు. వారు శివరాజ్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. పునీత్ దూరమైనప్పటికీ, అన్న శివ రాజ్కుమార్నే పునీత్‌గా భావించి అభిమానిస్తామని వారు చెప్పారు. శివరాజ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) నృతం చేసిన చిన్నారులు పునీత్ సమాధిని బాల నృత్యకారులు దర్శించుకుని నృత్యాంజలి సమర్పించారు. కెంగేరి సమీపంలోని నాట్యలోక డాన్స్ గ్రూపునకు చెందిన చిన్నారులు అలా నివాళులు అర్పించారు. పునీత్ బాల డ్యాన్సర్లను ఎప్పుడూ ప్రోత్సహించేవారని అన్నారు. -
పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై..
CM Bommai Kisses Puneeth Rajkumar Forehead At Last Rites: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, సిద్దరామయ్యలతో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. పునీత్ చివరిచూపు కోసం లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియానికి తరలివచ్చారు. ఆశ్రునయనాల మధ్య పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు అంత్యక్రియలు నిర్వహించే ముందు సీఎం బొమ్మై..పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు అలా నిల్చుండిపోయారు. మరోసారి తల నిమురుతూ తీవ్ర భావేద్వోగానికి లోనయ్యారు. పునీత్ నుదిటిపై సీఎం బొమ్మై ముద్దుపెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్ అంటే బొమ్మైకి ఎంత అభిమానమో ఈ ఒక్క ఫోటో చూస్తుంటే అర్థం అవుతుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి:పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. ఇక కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియానికి తరలివచ్చారు. కాగా పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య! -
అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
Puneeth Rajkumars Last Rites At Kanteerava Studios:కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి.అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కంఠీరవ రాజ్‌కుమార్‌కు మొత్తం ముగ్గురు కుమారులు. వారిలో పునీత్ చిన్నవాడు. శివరాజ్ కుమార్ పెద్దకొడుకు కాగా, రాఘవేంద్ర రెండోవాడు. ఆయన కుమారుడే వినయ్ రాజ్‌కుమార్. అతని చేతుల మీదుగా పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ హీరోగా ఎదగడానికి కూడా పునీత్ ఎంతో సహాయపడ్డారు. కర్ణాటక సీఎం సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు.. -
తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..
Puneeth Rajkumar Funeral: అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం సహా అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో పునీత్ కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: (Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు) కాగా, కోట్లాది మంది ఆత్మీయ బంధువు, విలక్షణ నటుడు, కన్నడ సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే విషయం తెలుసుకున్న ప్రజలు కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. -
Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు పునీత్ రాజ్‌కుమార్. కుటుంబ సభ్యుల్లో కొందరు.. ముఖ్యంగా కుమార్తె ధృతి విదేశాల్లో ఉండటం.. ఆమె ఇంకా భారత్ చేరుకోకపోవడంతో పునీత్ అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న పునీత్ కుమార్తె ధృతి శనివారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి సరాసరి కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ధృతి.. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీరుపెట్టుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. (చదవండి: పోటెత్తిన అభిమానులు : శోకసంద్రమైన బెంగళూరు ) చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: Puneeth Rajkumar: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా మారిందా? -
పోటెత్తిన అభిమానులు : శోకసంద్రమైన బెంగళూరు
సాక్షి, బెంగళూరు: తమ అభిమాన హీరో పునీత్ రాజ్‌కుమార్‌ను కడసారి దర్శించుకునేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివస్తున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా శోకసంద్రంలో మునిగిన అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సంద్రాన్ని తలపించేలా వస్తున్న అభిమానులు ‘‘అప్పూ.. మిస్.. యూ’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడా ఏం తప్పు చేశాడని కోట్లాది మంది అభిమానుల ప్రాణాలను తీసుకుపోయావు అంటూ రోదిస్తున్నారు. పునీత్ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టేడియంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కంఠీరవ స్టేడియంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం బొమ్మై దివంగత నటుడికి నివాళులర్పించారు.(Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) కాగా 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పూకి అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని స్టేడియంకు తరలించారు. (Puneeth Rajkumar:పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది Fans walking in to Kanteerava stadium to get a last glimpse of Kannada actor Puneeth Rajkumar. His body will be kept here for public homage till evening. @TheQuint pic.twitter.com/vHc80JhvBx — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 ) God, took away the lives of crores of his admirers. What bad did he do🙏 Never in his life, 💔😔 #PuneethRajkumar #PuneethRajkumarFans pic.twitter.com/1netN5OsVN — KR (@ImKalyanRaksha) October 29, 2021 -
తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్ ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ మృతి నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్ పార్థీవ దేహాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్టేడియం వద్దకు తరలిస్తున్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు. పునీత్ కూతురు అమెరికాలో ఉంది. చదవండి: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు.. -
స్టేడియంలో భార్య ఉందని...ఐపీఎస్ అధికారి..
సాక్షి, బెంగళూరు : పేరుకు పబ్లిక్ సర్వెంట్, కానీ చేసేందంతా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడమే. భార్య స్టేడియం లోపల ప్రాక్టీస్ చేస్తుండడంతో లోపల ఎవరూ ఉండరాదంటూ జాతీయ స్థాయి అథ్లెట్స్ ను బలవంతంగా బయటకు పంపించారంటూ ఒక ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి జాతీయ అథ్లెట్స్ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అనుపమ్ అగర్వాల్ భార్య స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో మిగతావారిని సిబ్బందితో కలసి స్టేడియం నుంచి బయటకు పంపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత్యంతరం లేని క్రీడాకారులు స్టేడియంకు సమీపంలోనున్న కబ్బన్‌పార్క్‌లో ప్రాక్టీస్ చేశారు. అంతేకాకుండా ఘటనపై క్రీడాకారులతో పాటు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు స్వీకరించరాదంటూ పోలీస్ స్టేషన్లకు సూచించినట్లు కూడా తెలిసింది. దీంతో ఘటనపై బాధితులు సంపిగె రామనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోగా స్వీకరించడానికి పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అది అగర్వాల్ సొత్తేం కాదు : మంత్రి మధ్వరాజ్ ఈ ఘటనపై యువజన క్రీడాశాఖా మంత్రి ప్రమోద్ మధ్వరాజ్ కలబురిగిలో మీడియాతో మాట్లాడుతూ.. స్టేడియం ప్రభుత్వం సొత్తు కాదని, అధికారి అనుపమ్ అగర్వాల్ సొత్తు అంతకంటే కాదని ఘాటుగా అన్నారు. స్టేడియం కేవలం ప్రజల సొత్తని, ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
మదినిండా అప్పాజీ
ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ దిగివచ్చిన తారాలోకం గాజనూరు నుంచి స్మారక స్థలి వద్దకు చేరుకున్న రాజ్థ్రం దాదాపు 54ఏళ్ల పాటు కన్నడ చిత్రసీమను ఏలిన కన్నడ కంఠీరవుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ రాజ్‌కుమార్ స్మరణతో బెంగళూరులోని కంఠీరవ స్టేడియం మారుమోగింది. శాండల్‌వుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన తారాలోకం కంఠీరవ స్టేడియానికి తరలివచ్చింది. అభిమానులంతా ‘అన్నగారు’ అంటూ ఎంతో భక్తితో పిలుచుకునే డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కంఠీరవ స్టేడియం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో కిక్కిరిసింది. - సాక్షి, బెంగళూరు కంఠీరవ స్టేడియంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద ఏర్పాటైన రాజ్‌కుమార్ స్మారకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి బి.సరోజాదేవి, రెబల్‌స్టార్ అంబరీష్, క్రేజీస్టార్ రవిచంద్రన్‌తోపాటు రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్, కుటుంబసభ్యులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉమాశ్రీ, రోషన్‌బేగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక స్మారకం ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టూడియోకు తరలివచ్చారు. రాజ్‌కుమార్ సమాధిని దర్శించే అభిమానులకు ఆయన వివిధ సినిమాల్లో కనిపించిన వేషధారణలను సైతం కళ్లముందు నిలిపేందుకు సమాధికి ఇరువైపులా రాతిఫలకాలపై ఏర్పాటుచేసిన ఛా యాచిత్రాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పవచ్చు. ఇక స్మారక ఆవిష్కరణ సందర్భంగా కంఠీరవ స్టూడియో అంతా రాజ్‌కుమార్ కటౌట్లు, పోస్టర్లతో నిండిపోయింది. రాజ్‌కుమార్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో రాజ్‌కుమార్ స్వగ్రామం గాజనూరు నుంచి బయలుదేరి అన్ని జిల్లా కేంద్రాల్లో సంచరించిన రాజ్థ్రం శనివారం నాటికి కంఠీరవ స్టేడియంలోని స్మారకం వద్దకు చేరుకుంది. ఈ రథానికి రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు, అభిమానులు ఘ నంగా స్వాగతం పలికారు. రాజ్‌కుమార్ సినీ విశేషాలను గుర్తు చేసుకునేందుకు గాను నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తారలు సందడి చేశారు. ‘అప్పాజీ’ చివరి కోరిక తీరలేదు.... ఇక స్మారక ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మాట్లాడుతూ...మరణానికి చేరువగా ఉన్న రో జుల్లో మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించాలని అప్పాజీ(డాక్టర్ రాజ్‌కుమార్) ఆశించారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామిపై అప్పాజీ కి ఎంతో భక్తి భావం ఉండేది. ఎప్పుడు సమయం దొరికినా రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేవారు. మరణించే సమయానికి ముందు గురు రాఘవేంద్ర స్వామిని దర్శించాలని భావించారు. అయితే ఆ చివరి కోరిక తీరలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.