తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు | Puneeth Rajkumar Body at Kanteerva Stadium For Fans Darshan | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar Passed Away: తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు

Published Fri, Oct 29 2021 3:12 PM | Last Updated on Fri, Oct 29 2021 4:47 PM

Puneeth Rajkumar Body at Kanteerva Stadium For Fans Darshan - Sakshi

బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్‌ ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్‌ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. 

పునీత్‌ మృతి నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్‌ పార్థీవ దేహాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని స్టేడియం వద్దకు తరలిస్తున్నారు. కాగా, పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి  దగ్గరే నిర్వహించనున్నారు. పునీత్‌ కూతురు అమెరికాలో ఉంది.

చదవండి: కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement