
Puneeth Rajkumars Ancestral House In Gajanur Made Into Museum: కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆసక్మిక మరణం సినీ పరిశ్రమను కలిచి వేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ ఈ ఏడాది అక్టోబర్29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి ముందే తన పూర్వీకులు, తన తండ్రి, సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ స్వస్థలమైన గాజనూర్‌లోని ఇంటిని మ్యూజియంగా మార్చాలని అనుకున్నాడట.
ఇప్పటికే శిథిలావస్ధకు చేరుకున్న ఆ ఇంటిని అందంగా పునరుద్ధరించి ఓ మ్యూజియంగా మార్చాలని భావించాడట. ఇందులో భాగంగా పునీత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆ ఇంటిని సందర్శించి మ్యూజియం ఏర్పాటుకు తగిన ప్రణాళికలు రూపొందించారట. అయితే దురదృష్టవశాత్తూ గుండెపోటుతో పునీత్ మరణించాడు.
తాజాగా పునీత్ కలను నిజం చేయడానికి ఆయన మేనల్లుడు గోపాల్ రంగంలోకి దిగాడు. ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు శరవేగంగా పనులు ప్రారంభించాడు. మరో రెండు నెలల్లో రెన్నోవేషన్ పనులు పూర్తవుతాయని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment