
Puneeth Rajkumars Last Rites At Kanteerava Studios:కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి.అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
కంఠీరవ రాజ్‌కుమార్‌కు మొత్తం ముగ్గురు కుమారులు. వారిలో పునీత్ చిన్నవాడు. శివరాజ్ కుమార్ పెద్దకొడుకు కాగా, రాఘవేంద్ర రెండోవాడు. ఆయన కుమారుడే వినయ్ రాజ్‌కుమార్. అతని చేతుల మీదుగా పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ హీరోగా ఎదగడానికి కూడా పునీత్ ఎంతో సహాయపడ్డారు. కర్ణాటక సీఎం సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment