Puneeth Rajkumar Funeral: Karnataka CM Basavaraj Bommai Pays Tribute - Sakshi
Sakshi News home page

Puneet Raj Kumar: పునీత్‌ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. ఫోటో వైరల్‌

Published Sun, Oct 31 2021 11:21 AM | Last Updated on Sun, Oct 31 2021 4:44 PM

CM Basavaraj Bommai Kisses Puneeth Rajkumar Forehead At Last Rites - Sakshi

CM Bommai Kisses Puneeth Rajkumar Forehead At Last Rites: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, సిద్దరామయ్యలతో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. పునీత్‌ చివరిచూపు కోసం లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియానికి తరలివచ్చారు. ఆశ్రునయనాల మధ్య పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్‌ అంత్యక్రియలు

అంత్యక్రియలు నిర్వహించే ముందు సీఎం బొమ్మై..పునీత్‌ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు అలా నిల్చుండిపోయారు. మరోసారి తల నిమురుతూ తీవ్ర భావేద్వోగానికి లోనయ్యారు. పునీత్‌ నుదిటిపై సీఎం బొమ్మై ముద్దుపెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్‌ అంటే బొమ్మైకి ఎంత అభిమానమో ఈ ఒక్క ఫోటో చూస్తుంటే అర్థం అవుతుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి:పునీత్‌ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్‌ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..

ఇక కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం యావత్‌ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన  కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో  అభిమానులు కంఠీరవ స్టేడియానికి తరలివచ్చారు. కాగా పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే.

చదవండి: పునీత్‌ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ
పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement