cheif minister
-
అలకలు.. చిటపటలు.. ఎట్టకేలకు మహా డ్రామాకు ఎండ్ కార్డు!
-
మాజీ సీఎం చంపయీ సోరెన్ కొత్త పార్టీ
రాంచి : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Former Jharkhand CM & JMM leader Champai Soren says, "I will not retire from politics. In the new chapter that I have started, I'll strengthen the new organisation and if I find a good friend in the way, I'll move ahead with that friendship to serve the people and… pic.twitter.com/Q8VwIK694o— ANI (@ANI) August 21, 2024మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు. ఆగస్ట్ 18న ఢిల్లీలో మకాంఆగస్ట్ 18న చంపయీ సోరెన్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఎల్లుండే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి(54) ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయం వెల్లడించారు. ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. చివరికి రేవంత్ పేరే.. తెలంగాణ రాజ్‌భవన్ వద్ద నిన్నంతా హైడ్రామా నడిచింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే.. నిన్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీనియర్ల చర్చల పరిణామాల తర్వాత మంగళవారం సాయంత్రం ఈ నిర్ణయం వెల్లడించింది హైకమాండ్. పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం, చివరకు రేవంత్ పేరునే ఖరారు చేసింది. ‘‘కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది. అందులో మూడు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం. ప్రచారంలో పాల్గొన్న సీనియర్ నేతల కోసం మరో తీర్మానం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ మరో తీర్మానం. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఎంపిక జరిగింది. పార్టీలో సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీంగా పని చేస్తారు’’ అని మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. స్వతంత్రుడిగా అసెంబ్లీలోకి.. రాజకీయ అటుపోట్లు, ఒడిదుడుకులను ఎదుర్కొని సీఎం పదవి స్థాయికి ఎదిగిన రేవంత్ ప్రస్థానం ఆసక్తికరమే. విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారాయన. ఆ తర్వాత 2002లో బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్)లో చేరి కొంతకాలం కొననసాగారు. ఆ తర్వాత 2006లో జడ్పీటీసీ మెంబర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గి శాసన మండలి సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ ఓడించడం గమనార్హం. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దగ్గరై.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 6వేలకు పైగా మెజార్టీతో నెగ్గి శాసనసభకి చేరారు . తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచే పోటీ చేసి.. 14 వేల మెజార్టీతో మళ్లీ నెగ్గారు. ఆపై అసెంబ్లీలో ఆయన్ని ఫ్లోర్ లీడర్‌గా నియమించింది టీడీపీ. అయితే 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నడుమ.. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించగా, చివరకు 2017 అక్టోబర్ 31వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో తొలి ఓటమి చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారాయన. దూకుడు స్వభావం ఉండడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం ఆయనకు డైనమిక్ లీడర్ అనే గుర్తింపును జనాల్లో తెచ్చిపెట్టాయి. రేవంత్‌కు 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీలో(ముగ్గురు సభ్యులుండే..) వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని, 2021 జులైలో ఏకంగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్ నుంచి, కామారెడ్డి నుంచి పోటీ చేసి.. కొడంగల్‌లో మంచి మెజారిటీతో(32 వేల ఓట్ల) గెలుపొందగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. వివాదాలున్నా.. కాంగ్రెస్ విజయ సారథిగా ఈ ఎన్నికలతో గుర్తింపు దక్కించుకున్న రేవంత్‌రెడ్డి పేరు సీఎం రేసులో ముందు నుంచే వినిపిస్తూ వచ్చింది. అయితే ఓటుకు నోటు లాంటి కేసు, పార్టీలో పలువురితో పొసగడకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పెద్ద మెజార్టీతో గెలుపొందలేదనే కారణాలను చెప్పి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ఎంపికకు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి పేరునే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సమర్థించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించారని భావించిన అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపించింది. వ్యక్తిగత జీవితం.. రేవంత్‌రెడ్డి 1969, నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ కొండారెడ్డి పల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏవీ కాలేజ్ నుంచి బీఏ చేశారాయన. జర్నలిస్ట్‌గానూ ఆయన ఓ వార్త పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లపాటు ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి దగ్గరి బంధువైన గీతాను 1992లో రేవంత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి-గీత దంపతులకు ఒక బిడ్డ నైమిషా రెడ్డి. ఈమె వివాహం 2015లో ఏపీకి చెందిన వ్యాపారవేత్త వెంకట్‌రెడ్డి తనయుడు సత్యనారాయణతో జరిగింది. ఈ జంటకు ఓ బాబు. మనవడు పుట్టిన సమయంలో తాత అయ్యాననే ఆనందంలో ఓ ఫొటో, అలాగే ఈ పంద్రాగష్టు రోజున మనవడితో దిగిన మరో ఫొటోను రేవంత్‌రెడ్డి తన సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో సంబురంగా షేర్ చేసుకున్నారు కూడా. I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week. I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj — Revanth Reddy (@revanth_anumula) April 9, 2023 -
ప్రకాష్ సింగ్ బాదల్ కు కన్నీటి వీడుకోలు
-
పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై..
CM Bommai Kisses Puneeth Rajkumar Forehead At Last Rites: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, సిద్దరామయ్యలతో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. పునీత్ చివరిచూపు కోసం లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియానికి తరలివచ్చారు. ఆశ్రునయనాల మధ్య పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు అంత్యక్రియలు నిర్వహించే ముందు సీఎం బొమ్మై..పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు అలా నిల్చుండిపోయారు. మరోసారి తల నిమురుతూ తీవ్ర భావేద్వోగానికి లోనయ్యారు. పునీత్ నుదిటిపై సీఎం బొమ్మై ముద్దుపెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్ అంటే బొమ్మైకి ఎంత అభిమానమో ఈ ఒక్క ఫోటో చూస్తుంటే అర్థం అవుతుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి:పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. ఇక కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియానికి తరలివచ్చారు. కాగా పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య! -
నటి మనోరమ ఐదుగురు సీఎంలతో నటించిందన్న విషయం మీకు తెలుసా?
ప్రముఖ నటి మనోరమ 12 ఏళ్ల వయసులోనే నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 1937 మే26న తమిళనాడులో జన్మించిన ఆమె చిన్న వయసులోనే వెయ్యికి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో సుమారు 1500 సినిమాల్లో ఎంతోమంది అగ్ర నటులతో కలిసి నటించింది. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించింది. 2009 వరకూ ఈ రికార్డును ఎవరూ అధిగమించలేదు. ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం సహా పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకుంది. అభిమానులు ఈమెను ఎంతో ప్రేమగా ‘ఆచి’ అని పిలుస్తారు. ఇక మనోరమ తన నటనా జీవితంలో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. వారిలో తమిళనాడు మాజీ సీఎంలు జయలలిత, అన్నాదురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధి సహా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు ఉన్నారు. అదే విధంగా ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్ సహా ఎంతో మంది అగ్ర నటులతో నటించారు. గుండెపోటుతో 2015 అక్టోబర్ 10న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనోరమ కన్నుమూశారు. చదవండి: ఆ వార్తలను నమ్మకండి : నటుడు చంద్రమోహన్ ఇంకా నటించాలనుంది కానీ..: రజనీకాంత్ -
కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. కాగా విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రాష్ట్రంలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించిన కేకే. శైలజకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్‌కు ఆరోగ్య శాఖ కేటాయించారు. ఇక పినరయి విజయన్ అల్లుడు మహ్మద్ రియాస్‌కు పబ్లిక్ అండ్ టూరింజ్ శాఖను అప్పగించారు.ఇక కేబినెట్లో చేరిన వారంతా అందరూ కొత్తవారే. ఈ సందర్భంగా సీఎం విజయన్‌తో పాటు మంత్రులకు గవర్నర్, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మే2న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి గెలవదనే సంప్రదాయాన్ని చెరిపేసిన విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. చదవండి: Pinarayi Vijayan: పినరయి దిగ్విజయన్ ఉద్దండులకు సాధ్యపడలేదు.. కానీ ఆయన సాధించారు -
సీఎం జగన్మోహన్రెడ్డి ఆదర్శప్రాయుడు..
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, ఏడాదిన్నర కాలంలోనే 90 శాతానికిపైగా ఎన్నికల హామీలు నేరవేర్చి, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు మాత్రమే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఆయన కితాబునిచ్చారు. పథకాల అమలుపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మాట్లాడే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ 600 హామీలను గుప్పించిందని, వాటిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మంత్రి విమర్శించారు. నాడు ప్రజలు చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. నమ్మిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఇకపై ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యుత్తమ విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారని మంత్రి వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంతో పాటు పేదల సొంతిటి కళను నెరవేర్చడమే ముఖ్యమంత్రి తదుపరి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. -
నితీష్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. దీపావళి తర్వాత నవంబర్ 16న సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో జేడీయూ గెలిచినప్పటికీ.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీష్ కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఏడోసారి జేడీయూ నేత నితీష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తనకు అఖండ విజయం అందించిన ప్రజలకు, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. (నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే) ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయమై జేడీ(యూ) కోర్ కమిటీ నిన్నరాత్రి బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో జేడీయూతో పోలిస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. (నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) -
‘ సినిమాలో మాదిరి.. ఒక్క రోజులో సీఎం కాలేరు’
సాక్షి, టీ. నగర్: సినిమాల్లో జరిగినట్లు ఎవరూ ఒక్క రోజులో ముఖ్యమంత్రి కాలేరని పేరవై ప్రధాన కార్యదర్శి జె.దీప అన్నారు. తనపై రూ. 1.12 కోట్లు మోసగించినట్లు ఆరోపణలు రావడం శశికళ కుటుంబీకులు చేసిన కుట్రగా జె. దీప పేర్కొన్నారు. కడలూరులో ఎంజీఆర్ అమ్మ దీప పేరవై తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఎంజీఆర్, జయలలిత బహిరంగ సభ, సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం తేరడి మైదానంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దీప మాట్లాడుతూ.. జయలలిత జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె పుట్టిన రోజు నుంచి రాయడం ప్రారంభించారని తెలిపారు. అన్నాడీఎంకేను, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటైందని, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. అంతేకాక ఆమె తనపై వచ్చిన రూ. 1.12 కోట్ల వ్యవహారం ప్రస్తావించారు. దీనిపై మోసం చేసినట్లు ఫిర్యాదులందాయని వాపోయారు. తనపై ఇది వరకే అనేక ఫిర్యాదులు చేయడమే కాకుండా అసత్యాలను వెల్లడిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం రూ. 1.12 కోట్లు మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు శశికళ కుటంబీకులు చేసిన కుట్రగా జె. దీప తెలిపారు. -
చిన్నమ్మే చీఫ్ మినిస్టర్
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవ ఎన్నిక - పేరును ప్రతిపాదించిన పన్నీరు సెల్వం - జైకొట్టిన ఎమ్మెల్యేలు - 9న సీఎంగా చిన్నమ్మ ప్రమాణ స్వీకారం - ముఖ్యమంత్రి పదవికి పన్నీరు రాజీనామా సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారాయి. ఊహించినట్టుగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన అత్యవసర సమావేశంలో 136 మంది ఎమ్మెల్యేలు శశికళను తమ నేతగా ఎన్నుకున్నారు. శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అందరూ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. ఈనెల 9వ తేదీన సీఎంగా చిన్నమ్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎంపికైన అనంతరం పార్టీ సభ్యులనుద్దేశించి 60 ఏళ్ల శశికళ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం, ‘అమ్మ’ ఆశయసాధన కోసం తాను సీఎం పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. శరవేగంగా మారిన పరిణామాలు... అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత గతేడాది డిసెంబర్ 5న కన్నుమూయడంతో ఆమె నిర్వర్తిస్తున్న రెండు బాధ్యతలను పన్నీర్‌సెల్వం, శశికళలు పంచుకోవడం తెలిసిందే. అయితే పార్టీ సంప్రదాయం ప్రకారం రెండు పదవుల్లో ఒక్కరే ఉన్నప్పుడే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధ్యమని శశికళ విధేయులైన కొందరు మంత్రులు, సీనియర్ నేతలు వాదన లేవనెత్తారు. ఇది కాలక్రమేణా బలపడుతూ రాగా మరోవైపు పన్నీర్‌సెల్వం తన పని తాను చేసుకుంటూ పోతూనే పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయసాగారు. దీంతో అప్రమత్తమైన శశికళ శరవేగంగా పావులు కదిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా ఆదివారం నాటి అత్యవసర సమావేశానికి హాజరుకావాలంటూ పోయెస్‌గార్డెన్ నుంచి టెలిఫోన్ద్వారా శనివారం ఆదేశాలు పంపారు. దీంతో పన్నీర్‌సెల్వంకు ఉద్వాసన ఖాయమని శనివారంరాత్రే తేలిపోయింది. చెన్నై సమీపంలోని సముద్రతీరంలో రెండు నౌకలు ఢీకొనగా వెలువడిన చమురుతెట్టు తొలగింపు పనులను పర్యవేక్షించేందుకు సీఎం పన్నీర్‌సెల్వం ఆదివారం ఉదయాన్నే ఎన్నూరు హార్బర్‌కు వెళ్లారు. అక్కడినుంచి సచివాలయానికొచ్చి అధికారులతో సమావేశం జరుపుతుండగా పోయెస్‌గార్డెన్ నుంచి పిలుపొచ్చింది. దీంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపేసి 11.45 గంటలకు హడావుడిగా శశికళ వద్దకు చేరుకున్నారు. ఆమెతో రెండు గంటలపాటు మంతనాలు జరిపారు. శశికళ పేరును ప్రతిపాదించిన పన్నీరుసెల్వం అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా తాను రాజీనామా చేస్తున్నట్లు సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించడంతోపాటు ఆ స్థానానికి శశికళను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సీఎంసహా సమావేశానికి హాజరైన 136 మంది ఎమ్మెల్యేలు శశికళను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఎంపిక అనంతరం శశికళ మాట్లాడుతూ ఆనాడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నేడు శాసనసభాపక్ష నేతగా తనను ముందుగా ప్రతిపాదించింది పన్నీర్సెల్వమేనన్నారు. పార్టీ కష్టకాలాలను ఎదుర్కొన్న సమయాల్లో, గతంలో సీఎంగా అమ్మ కొనసాగడానికి ఇబ్బంది ఎదురైన సమయాల్లోను పన్నీర్‌సెల్వం అండగా నిలిచారని ప్రశంసించారు. జయలలిత మరణాంతరం తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సీఎంగా బాధ్యతలు చేపట్టాలని తొలుత పన్నీరుసెల్వమే కోరారని, అయితే అప్పట్లో అమ్మను కోల్పోయిన బాధలో ఏదీ వినే పరిస్థితిలో తాను లేకపోయానని చెప్పారు. అయితే రెండు పదవుల్ని ఒక్కరే నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పదేపదే వస్తున్న వినతులతో ఇందుకు ఆమోదిస్తున్నానని తెలిపారు. తమిళనాడు ప్రజల సంక్షేమంకోసం అన్నాడీఎంకే తన కృషిని కొనసాగిస్తుందన్నారు. గతేడాది డిసెంబర్ 31న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళ నెల రోజులు తిరిగేసరికల్లా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం. జయలలిత మరణించిన తరువాత సరిగ్గా 60 రోజులకు చిన్నమ్మ సీఎంగా మారనున్నారు. శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవడంతో ఆమె మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విధేయతకు మారుపేరు ‘పన్నీరు’ విధేయుడంటే ఇలాఉండాలని పన్నీరు సెల్వం మరోమారు చూపారు. అమ్మ జయలలితకే కాదు, చిన్నమ్మ శశికళకూ తాను విధేయుడేనని చాటుకున్నారు. పదవులు తనకు శాశ్వతం కాదన్నట్టు, విధేయతే ముఖ్యమని మరోమారు చాటుకున్నారు. జయలలితకు అత్యంత నమ్మినబంటుల్లో ఆ పార్టీ కోశాధికారి ఓ పన్నీరుసెల్వం ఒకరు. అమ్మ సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడల్లా, ఆమెకే కాదు.. తమిళనాడుకు ఆపద్భాందవుడిగా సీఎం పగ్గాలు చేపట్టారు. తేని జిల్లా పెరియకులం గ్రామంలో పుట్టి పెరిగి, టీ దుకాణం నడుపుకుంటూ రాజకీయాల్లో పన్నీరు సెల్వం అడుగిడారు. పెరియకులం మున్సిపల్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన ఆయన జయలలితకు అత్యంత విధేయుడిగా అవతరించారు. 2001ఎన్నికలతో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టగానే, కేబినెట్ పదవి దక్కించుకున్నారు. అదేఏడాది టాన్సీభూముల కేసులో జయలలిత జైలుశిక్షను ఎదుర్కొనడంతో, సీఎం పదవి చేపట్టే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఆ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి 1 వరకు ఐదున్నర నెలలు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత మళ్లీ జైలుశిక్ష ఎదుర్కోవాల్సి రావడంతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకు 8 నెలలు పనిచేశారు. ఇక గత డిసెంబర్ 5న జయలలిత మరణం అనంతరం మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు చిన్నమ్మ శశికళకు పగ్గాలప్పగిస్తూ విధేయత చాటుకున్నారు. ప్రజలు కోరుకున్న సీఎంలు కారు – శశికళ ఎంపికపై ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్య ‘‘పోయెస్‌గార్డెన్ ఇంట్లో నివసించేవారిని ప్రజలు సీఎంగా ఆశించి ఓటు వేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాదు’’అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకోవడంపై ఆయన స్పందిస్తూ.. గతేడాది జరిగిన ఎన్నికల్లో సీఎంగా జయలలిత ఉండాలని ఆశించి ప్రజలు ఓట్లేశారని, ఆమె మరణం తరువాత నిన్నటివరకు పన్నీర్‌సెల్వం, ఆ తరువాత శశికళ ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రులు కారని వ్యాఖ్యానించారు. శశికళకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఏనాడూ జయలలిత కనీస ప్రాధాన్యమివ్వలేదని, జైలు కెళ్లినప్పుడు సైతం పన్నీర్సెల్వంకే బాధ్యతలు అప్పగించారని అన్నారు. అయితే ఈరోజు శశికళను సీఎంగా చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం జయలలిత మనోభీష్టానికి, ప్రజాభిప్రాయానికి విరుద్ధమని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని చెప్పారు. తమిళనాడు చరిత్రలో బ్లాక్‌డే: ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక తమిళనాడు రాజకీయాల్లో బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ(టీఎన్‌సీసీ) మాజీ అ«ధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. శశికళ ప్రజల నుంచి రాలేదు, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్టూ దక్కదన్నారు. శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే స్వేచ్ఛ ఆ పార్టీ ఎమ్మెల్యేలకుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమర్థించారు. అంత అవసరం ఏమిటి: బీజేపీ అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అంతర్గత వ్యవహారంగా పరిగణించడానికి వీలులేదని బీజేపీ తమిళనాడుశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కేవలం రెండు నెలల్లో పన్నీర్‌సెల్వంను సీఎం పదవి నుంచి తప్పించాల్సిన అవసరమేంటో ప్రజలకు చెప్పాలన్నారు. దురదృష్టకరం: జయలలిత మేనకోడలు దీప సీఎంగా పన్నీర్‌సెల్వంను తప్పించి శశికళ బాధ్యతలు తీసుకోవడం దురదృష్టకరమని జయలలిత మేనకోడలు దీప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నకోబడని శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖండించదగిన అంశమన్నారు. ప్రజాస్వామ్య పాలనను కాదని అకస్మాత్తుగా సైనిక పరిపాలన వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పారు. -
వాళ్లు సీఎం కావడం పెద్ద కష్టమేమీ కాదు
నాంపల్లి: బీసీ నేత ప్రధానమంత్రి అయినప్పుడు.. బీసీలు ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల్లోని అన్ని కులాలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధించవచ్చని చెప్పారు. రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ రాజకీయాల్లో ఉంటూ రాజకీయంగా బీసీలను చైతన్యం చేసేందుకు ఒక వేదికను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న క్యాజువాలిటీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించి తగు న్యాయం చేస్తామని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్.రావు మాట్లాడుతూ బీసీల్లో ఐకమత్యం లేదని, అందరం కలిసి ఒక్కటైతేనే బీసీలకు రాజ్యాధికారం తథ్యమన్నారు. 2019 నాటికి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావ దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యులు, బీసీ సాధికారత సంస్థ అధ్యక్షులు దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా చైతన్యంతోనే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం సామాజికవేత్తల జీవిత గాధలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించారు. బీసీ భీష్మ పితామహ బాబూరావు వర్మ, వాణిజ్యపన్నుల శాఖ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వై.సత్యనారాయణ, డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, దళితరత్న జేబీరాజు, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, సంస్థ ప్రధాన కార్యదర్శి జయ ప్రసాద్ పాల్గొన్నారు. -
31న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆహ్వానించారని, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అక్టోబర్ 31 తేదిగా నిర్ణయించామని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గంలో బెర్తుల కోసం శివసేన ప్రతిపాదనల్ని పంపినట్టు సమాచారం. ఈ సాయంత్రం శివసేన, బీజేపీల మధ్య సమావేశం థాక్రే నివాసం మాతోశ్రీలో జరుగనుంది.