
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, ఏడాదిన్నర కాలంలోనే 90 శాతానికిపైగా ఎన్నికల హామీలు నేరవేర్చి, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు మాత్రమే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఆయన కితాబునిచ్చారు. పథకాల అమలుపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మాట్లాడే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ 600 హామీలను గుప్పించిందని, వాటిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మంత్రి విమర్శించారు. నాడు ప్రజలు చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. నమ్మిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఇకపై ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యుత్తమ విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారని మంత్రి వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంతో పాటు పేదల సొంతిటి కళను నెరవేర్చడమే ముఖ్యమంత్రి తదుపరి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment