రాంచి : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Former Jharkhand CM & JMM leader Champai Soren says, "I will not retire from politics. In the new chapter that I have started, I'll strengthen the new organisation and if I find a good friend in the way, I'll move ahead with that friendship to serve the people and… pic.twitter.com/Q8VwIK694o
— ANI (@ANI) August 21, 2024
మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు.
ఆగస్ట్ 18న ఢిల్లీలో మకాం
ఆగస్ట్ 18న చంపయీ సోరెన్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే
భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment