రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.
Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govt
Read @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024
ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పు
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
అవమానం జరిగిందని
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment