లోక్‌సభలో రాహుల్‌పై మోదీ విమర్శలు! | Pm Modi Speech In Parliament Budget Session | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో రాహుల్‌పై మోదీ విమర్శలు!

Published Tue, Feb 4 2025 5:20 PM | Last Updated on Tue, Feb 4 2025 6:09 PM

Pm Modi Speech In Parliament Budget Session

ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పసలేదంటేంటూ సోనియా, అందుకు వంత పాడిన రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ లోక్‌సభలో పరోక్షంగా స్పందించారు. లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మోదీ ప్రసంగిస్తూ.. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్‌ చేస్తారు. సభలో అదే పేదల గురించి మాట్లాడితే ఆ నేతలే ఫేస్‌ని విసుగ్గా పెడతారంటూ..కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. 

నాలుగోసారి దేశ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. నాలుగో సారి దేశ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వికసిత్‌ భారత్‌ మా లక్ష్యం.10ఏళ్లలో 25కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. వికసిత్‌ భారత్‌ సాధనే మా లక్ష్యం. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తాం. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుంది. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం. ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించాం. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో మేం ఏ ఒక్క తప్పుడు హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు.  

కొందరు శీష్‌మహల్‌ కోసం అవినీతి చేస్తారు.ఇప్పుడు నగదు బదిలీద్వారా ప్రజలకు నేరుగా నగదు అందుతుంది.మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ స్లోగన్లు మాత్రమే ఇచ్చేవి. మేం 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేంశాం. రాష్ట్ర ప్రసంగం కొంతమందికి బోర్‌గా అనిపించింది. బీజేపీ పాలనలో ఎలాంటి స్కాం జరగలేదు.  మా హయాంలో దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం.

గతంలో స్కాంలు గురించి వినేవాళ్లం. కానీ ఇప్పుడు స్కాంలు లేవు. కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుకుటుంటున్నాం. ప్రపంచ గేమింగ్‌ రాజధానిగా భారత్‌ మారుతోంది. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయి. తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తోంది. ప్రలోభాలకు గురిచేస్తోంది. అందుకే హర్యానాలో బీజేపీని మూడోసారి గెలిపించారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుంతుంది. రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణం. రాజ్యంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది.

కొందరు నేతలు లగ్జరీగా ఉండాలని అనుకుంటారు. ఖరీదైన షవర్లు, బాత్‌టబ్‌లు కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి పేదల గరించి ఏం తెలుస్తోంది. కొంతమందికి బంగ్లాలు కొనుగోలు చేయడంపైనే ఫోకస్‌ చేస్తారు. మేం ఇంటింటికి నల్లాలు ఇచ్చే దానిపై ఫోకస్‌ పెట్టాం’’ అని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement