
నేడు(ఫిబ్రవరి 5) బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల తనయుడు అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు

1976 ఫిబ్రవరి 5న ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ లకు ఆయన జన్మించాడు

రెఫ్యూజీ(2000) సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు

ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005), ధూమ్2 (2006), గురు (2007), దోస్తానా (2008), బోల్ బచ్చన్ (2012), హౌస్ ఫుల్ (2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి

ధూమ్ (2004) సినిమాతో తొలిసారి భారీ హిట్ అందుకున్నాడు

యువ (2004), సర్కార్ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నాడు

ఆయన నిర్మించిన పా (2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నాడు

2007లో నటి ఐశ్వర్యా రాయ్ ని వివాహం చేసుకున్నాడు. 2011 నవంబరు 16న వారికి కుమార్తె ఆరాధ్య జన్మించింది


















