గవర్నర్, సీఎం చంపయ్ సొరెన్‌తో కేబినెట్( ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రి పదవుల ముసలం పుట్టింది. చంపయ్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. అక్కడితో ఆగకూండా ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలడానికి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా చంపయ్ సోరేన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్‌లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలవడానికి ఢిల్లీ వచ్చాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో మా సమస్యలు చెబుతాం’ అని ఎమ్మెల్యే రాజేష్ కచాప్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరే ముందు మరో ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ అలియాస్ అనూప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌లోకి తీసుకున్న నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు.
అంత కంటే ముందు.. మంత్రి పదవులపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జేఎంఎం పార్టీకి చెందిన కొత్త మంత్రి బసంత్ సొరెన్‌ను కలిసి తమ అసంతృప్తి తెలియజేశారు. అయితే సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ... ‘రెండు పార్టీల మధ్య ఎటువంటి అనిశ్చితి లేదు. తామంతా ఐకమత్యంగా ఉన్నాం’ అని చెప్పారు. మరోవైపు.. అసంతృప్త ఎమ్మెల్యేల కంటే ముందే సీఎం చంపయ్ సొరెన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ ఢిల్లీలో చేరుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు.
కేబినెట్‌లో నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే.. ఫిబ్రవరి 23న జరిగే అసెంబ్లీ సమావేశాలకు అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరుకాకుండా జైపూర్‌పు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంపయ్ సొరెన్ జనవరి 16 కొత్త కెబినెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న హేమంత్ సొరెన్‌ను భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంపయ్ సొరెన్ జార్ఖండ్‌కు కొత్త సీఎం బాధ్యతలు చేపట్టారు. జేఎంఎం-29, కాంగ్రెస్-17, ఆర్జేడీ-1 స్థానంతో జార్ఖండ్‌లో జేఎంఎం సంకీర్ణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment