రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి.. అతిపెద్ద శత్రువులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జార్ఖండ్‌ను కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని చెబుతూనే.. ఆర్జేడీ ఇప్పటికీ రాష్ట్ర ఏర్పాటుపై ప్రతీకారం కోరుకుంటోందని అన్నారు. ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని ఆదివారం నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు.
‘‘అధికార జేఎంఎం పార్టీ ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తోంది. ఆదివాసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆ వర్గాల అటవీ భూమిని ఆక్రమించినవారితో చేతులు కలుపుతోంది. బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారుతో అధికార పార్టీ సంబంధాలు ఏర్పరుచుకుంటోంది. అంతే కాకుండా బుజ్జగింపు రాజకీయాలపై చేయటంలో అధికార జేఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని సైతం అధిగమించింది. బుజ్జగింపు రాజకీయం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దళితుల, గిరిజనులు వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను దెబ్బతీసి.. వారికి ద్రోహం చేయటమే కాంగ్రెస్ పార్టీ అజెండా. ప్రస్తుతం అదే విధమైన ద్రోహం జేఎంఎం చర్యలలో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.
#WATCH | Jamshedpur, Jharkhand: PM Modi says, "...In Santhal Pargana, the Adivasi population is decreasing rapidly. The lands are being grabbed. Infiltrators are taking over positions in Panchayats. The incidents of crime against daughters are increasing... Every Jharkhandi is… pic.twitter.com/ECYnXNID83
— ANI (@ANI) September 15, 2024
‘‘ జేఎంఎం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో జార్ఖండ్‌ను దోచుకోవడం, అవినీతిపై మాత్రమే దృష్టి సారించింది. ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. నీరు, అడవులు, భూమి అన్నింటిలో అవినీతికి పాల్పడింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఈ కేసులన్నీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇస్తున్నా. కొన్ని నెలల తర్వాత జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తాం. కొత్త పరిపాలనలో జవాబుదారీతనం, న్యాయాన్ని తీసుకురావాలనే బలమైన ఉద్దేశం మాది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీ’ అని మోదీ అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని రాంచీలో రూ.660 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. టాటానగర్ నుంచి ప్రధాని మోదీ.. ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment